PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidud9b5ede4-405a-42b6-994c-4ff4a767c6b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidud9b5ede4-405a-42b6-994c-4ff4a767c6b2-415x250-IndiaHerald.jpgబీజేపీ నేత, శ్రీ పీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి హిందూపురం ఎంపీ సీటు ఆశించి భంగపడ్డారు. పరిపూర్ణానంద బీజేపీ అధిష్టానం తనకు ఎంపీ టికెట్ కచ్చితంగా ఇస్తుందని చాలా ఆశించారు. అంతేకాదు బీజేపీ పార్టీ కోసం కష్టపడి చాలానే సేవలు చేశారు. హిందూపురంలో పార్టీని బలపరిచే పనులు కూడా చేశారు. ఇంత చేసినా టికెట్‌ దక్కకపోవడంతో ఆయన బాగా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిపూర్ణానంద స్వామిని తన ఇంటికి పిలిపించుకున్నారు.Chandrababu naidu{#}sree;Hindupuram;Reddy;TDP;CBN;MLA;Assembly;MP;Bharatiya Janata Partyఏపీ: చంద్రబాబుకి ఊహించని షాక్ ఇచ్చిన పరిపూర్ణానంద స్వామి..??ఏపీ: చంద్రబాబుకి ఊహించని షాక్ ఇచ్చిన పరిపూర్ణానంద స్వామి..??Chandrababu naidu{#}sree;Hindupuram;Reddy;TDP;CBN;MLA;Assembly;MP;Bharatiya Janata PartyMon, 22 Apr 2024 19:51:00 GMT
బీజేపీ నేత, శ్రీ పీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి హిందూపురం ఎంపీ సీటు ఆశించి భంగపడ్డారు. పరిపూర్ణానంద బీజేపీ అధిష్టానం తనకు ఎంపీ టికెట్ కచ్చితంగా ఇస్తుందని చాలా ఆశించారు. అంతేకాదు బీజేపీ పార్టీ కోసం కష్టపడి చాలానే సేవలు చేశారు. హిందూపురంలో పార్టీని బలపరిచే పనులు కూడా చేశారు. ఇంత చేసినా టికెట్‌ దక్కకపోవడంతో ఆయన బాగా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిపూర్ణానంద స్వామిని తన ఇంటికి పిలిపించుకున్నారు.

దాంతో ఆయన టీడీపీలో చేరుతారేమో, టీడీపీ తరఫున అసెంబ్లీ లేదా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. బి ఫామ్స్ ఇచ్చేటప్పుడు చంద్రబాబు ఆయన్ని పిలిచారు. నల్లిమిల్లి రామకృష్ణా రెడ్డి అనపర్తి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు కానీ పొందలేకపోయారు. ఆయన్ని బీజేపీ ద్వారానైనా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. పరిపూర్ణానంద స్వామిని కూడా అలాగే పిలిచి ఏదో ఒక సీటు ఇస్తారేమో అని చాలామంది అభిప్రాయపడ్డారు కానీ అదేమీ లేదని తర్వాత తెలిసింది. పోటీ చేయవద్దని కోరడానికి మాత్రమే పరిపూర్ణానంద స్వామిని చంద్రబాబు పిలిచినట్లు సమాచారం.

 ఈ మాట విని పరిపూర్ణానంద స్వామి చాలా బాధపడ్డారట. 40 ఏళ్లుగా తాను హిందూపురం నియోజకవర్గం కోసం పని చేస్తున్నారని తనకు సీటు ఇవ్వకుండా ఉండటం అన్యాయమని వాపోయారట. అంతేకాదు  ఇప్పటిదాకా తాను ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని అనుకున్నారని కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు ముందే డైరెక్ట్ గా చెప్పేసారట. హిందూపురం నుంచి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయబోతున్నానని స్పష్టం చేశారట. దీనివల్ల టీడీపీ ఓట్లు చీలే ప్రమాదం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు బాగా కలవర పడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బిజెపి చేసిన పొరపాటు వల్ల చివరికి టీడీపీకి పెద్ద నష్టం వాటిల్లే లాగా ఉంది. మరి ఈ విషయంలో చంద్రబాబు తన రాజకీయ తెలివిని ఉపయోగించి నష్టాన్ని తగ్గించుకోగలుగుతారా? అనేది చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>