PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-elections434e8989-c71a-4727-8f3d-12af02e55448-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-elections434e8989-c71a-4727-8f3d-12af02e55448-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం స్టార్ట్ అయింది.ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్రధాన పార్టీ నాయకులు మాట‌ల‌కు ప‌దును పెంచుతున్నారు.అయితే వారిలో మరీ ముఖ్యంగా జ‌న‌సేన త‌ర‌ఫున స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఉన్న‌వారు స‌వాళ్లు కూడా విసురుతున్నారు.ఇంకా ఎన్నిక‌ల‌కు ఇరవై రోజుల సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికే రాజ‌కీయం మంచి కాకెక్కింది.తాజాగా థర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, టాలీవుడ్ న‌టుడు పృథ్వీ రాజ్‌ జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ వైసీపీ అభ్యర్థి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, స‌వాళ్లు విసిరారు.ముఖ్యంగా కాపు ఉద్య‌మనాassembly elections{#}pruthvi;Godavari River;Jagan;Andhra Pradesh;Tollywood;Vishakapatnam;CM;electricity;YCP;Reddy;Partyఉత్తరాంధ్ర : అదే జరిగితే ముద్రగడ ఇంట్లో అంట్లు తోముతానన్న పృథ్వి.?ఉత్తరాంధ్ర : అదే జరిగితే ముద్రగడ ఇంట్లో అంట్లు తోముతానన్న పృథ్వి.?assembly elections{#}pruthvi;Godavari River;Jagan;Andhra Pradesh;Tollywood;Vishakapatnam;CM;electricity;YCP;Reddy;PartyMon, 22 Apr 2024 06:39:20 GMTప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం స్టార్ట్ అయింది.ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్రధాన పార్టీ నాయకులు మాట‌ల‌కు ప‌దును పెంచుతున్నారు.అయితే వారి లో మరీ ముఖ్యంగా జ‌న‌సేన త‌ర‌ఫున స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఉన్న‌వారు స‌వాళ్లు కూడా విసురుతున్నారు.ఇంకా ఎన్నిక‌ల‌కు ఇరవై రోజుల సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికే రాజ‌కీయం మంచి కాకెక్కింది.తాజాగా థర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, టాలీవుడ్ న‌టుడు పృథ్వీ రాజ్‌ జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ వైసీపీ అభ్యర్థి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, స‌వాళ్లు విసిరారు.ముఖ్యంగా కాపు ఉద్య‌మనాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కేంద్రంగా చేసుకొని విమ‌ర్శ‌లు చేసారు.

ముద్రగడ కాపు ఉద్య‌మ నాయ‌కుడిగా ప్ర‌స్థానం ప్రారంభించి ఇప్పుడు రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా మరియు రెడ్డి సేవ‌కుడిగా మారారు.కిర్లంపూడి లో కూర్చుని క‌బుర్లు చెబుతున్న ముద్ర‌గ‌డ‌ త‌న ప‌రిశ్ర‌మ‌ల‌కు, రైస్ మిల్లుల‌కు ఉన్న విద్యుత్ బ‌కాయిలు ఎంతో చెప్పాల‌ని ఆయన డిమాండ్ చేశారు. ఉత్త‌రాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ కనీసం మూడు సీట్లు కూడా గెలిచే ప‌రిస్థితి లేద‌న్నారు. ఒక‌వేళ మూడు సీట్లు వైసీపీ గెలిస్తే మాత్రం నేను ఆయన ఇంట్లో అంట్లు తోముతాన‌ని అన్నారు.

అలాగే ప్రస్తుతం ముద్ర‌గ‌డను ప‌ట్టించుకునేవారు న‌మ్మేవారు ఎవ‌రూ లేర‌ని పృథ్వీ గట్టిగా అన్నారు. మెగా కుటుంబం లో చిరంజీవి, రామ్‌చరణ్ స‌హా ప‌లువురు కూటమికి మద్దతుగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లోనే రాబోతున్నారని చెప్పారు.అలాగే సీఎం జ‌గ‌న్‌పై కూడా పృథ్వీ విమ‌ర్శ‌లు చేసారు. అయితే దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.పృథ్వి జగన్ పై చేసిన విమర్శలకి కచ్చితంగా రేపు వైసీపీ నాయకులు గట్టిగా కౌంటర్ ఇవ్వడం అనేది ఖాయమని అలాగే ఉత్తరాంద్ర లో వైసీపీ గెలవడం పక్కా అని తాను చెప్పినట్లు అంట్లు తోమాడానికి గిన్నెలు కూడా రెడీగా ఉన్నాయని వైసీపీ నాయకులు అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>