PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chiranjeevi-ycp-social-media-troll-janasenab219495e-55f2-4b7f-96ee-3ba9871c0e02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chiranjeevi-ycp-social-media-troll-janasenab219495e-55f2-4b7f-96ee-3ba9871c0e02-415x250-IndiaHerald.jpgగత కొన్నేళ్లుగా చిరంజీవి రాజకీయాలకి దూరంగానే ఉంటున్నారు.. కానీ గత రెండు రోజుల క్రితం నుంచి మెగాస్టార్ చిరంజీవి పైన సోషల్ మీడియాలో చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం చిరంజీవికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు వ్యక్తుల రాజకీయంగా మద్దతు పలకడం అన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకరు జనసేన నేతకాక మరొకరు బీజేపీ నేత. అలా ఇద్దరి నాయకులకు చిరంజీవి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ విషయంలోనే వైసిపి సోషల్ మీడియాలో చిరంజీవి పైన విమర్శలు వినిపిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరికైనా సరే రాజకీయమన్నాక విమర్శCHIRANJEEVI;YCP;SOCIAL MEDIA;TROLL;JANASENA{#}Chiranjeevi;kalyan;Bharatiya Janata Party;Janasena;media;Film Industry;CM;Reddy;politics;TDP;News;YCPచిరంజీవి: అప్పుడు ప్రశంస..ఇప్పుడు విమర్శ..!చిరంజీవి: అప్పుడు ప్రశంస..ఇప్పుడు విమర్శ..!CHIRANJEEVI;YCP;SOCIAL MEDIA;TROLL;JANASENA{#}Chiranjeevi;kalyan;Bharatiya Janata Party;Janasena;media;Film Industry;CM;Reddy;politics;TDP;News;YCPMon, 22 Apr 2024 07:24:26 GMTగత కొన్నేళ్లుగా చిరంజీవి రాజకీయాలకి దూరంగానే ఉంటున్నారు.. కానీ గత రెండు రోజుల క్రితం నుంచి మెగాస్టార్ చిరంజీవి పైన సోషల్ మీడియాలో చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం చిరంజీవికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు వ్యక్తుల రాజకీయంగా మద్దతు పలకడం అన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకరు జనసేన నేతకాక మరొకరు బీజేపీ నేత. అలా ఇద్దరి నాయకులకు చిరంజీవి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ విషయంలోనే వైసిపి సోషల్ మీడియాలో చిరంజీవి పైన విమర్శలు వినిపిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఎవరికైనా సరే రాజకీయమన్నాక విమర్శలు వంటివి సహజంగానే వినిపిస్తుంటాయి.. అయితే చిరంజీవి సపోర్టు చేయడం అనేది తన సొంత విషయం అని అభిమానులైతే భావిస్తూ ఉన్నారు. గతంలో కూడా సినీ ఇండస్ట్రీ నుంచి వైసీపీకి చాలా మంది నేతలు కూడా సపోర్టు పలికారు..ఇప్పటికీ పలుకుతూనే ఉన్నారు.. అది తప్పు కానప్పుడు చిరంజీవి చేస్తున్నది నేరం అవుతుందా అంటూ పలువురు జనసేన కార్యకర్తలతో పాటు మెగా అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. టిడిపి ,జనసేన, బిజెపి కూటమికి ఎవరైనా మద్దతు ఇస్తే దాన్ని వైసిపి నేరంలా చూపిస్తోంది.


గతంలో కూడా చిరంజీవి మూడు రాజధానుల విషయం పైన వైసిపి పార్టీకి మద్దతు పలికారు.. అప్పుడు ఆయనని అందరూ కూడా అభినందించారు కానీ ఇప్పుడు కూటమిపరంగా తమ స్నేహితులకు సపోర్టు చేయడంతో చాలా మంది చిరంజీవిని విమర్శిస్తున్నారు.. మూడు రాజధానుల విషయంలో తన సొంత తమ్ముడైన పవన్ కళ్యాణ్ ని కాదని సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి సపోర్టు చేశారు. అప్పుడు కూడా చిరంజీవి పైన జనసేన నేతలు కార్యకర్తలు చాలా విమర్శించారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో చిరంజీవి పైన చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి తరహా రాజకీయాలు ఎవరికి చేటు చేస్తాయో చూడాలి మరి.. మరి కొంతమంది ఇది వైసిపి సోషల్ మీడియా చేస్తున్న పని కాదని కేవలం కొంతమంది ఫేక్ ఐడీల ద్వారా కావాలని ఇలా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.మరి చిరంజీవి ఈ విషయం పైన ఎలా స్పందిస్తారో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>