Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/madhuf1943dc8-c157-4b18-92ba-922979e7056b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/madhuf1943dc8-c157-4b18-92ba-922979e7056b-415x250-IndiaHerald.jpgగత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. అయితే 17 స్థానాలకు గాను 15 స్థానాలలో విజయం సాధిస్తామని చెబుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అని స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. అయితే కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లపై మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టారు అన్నది తెలుస్తుంది. ఇలాంటి వాటిలో రేవంత్ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి తో పాటు మాజీ సీఎం కేసీఆర్ సొMadhu{#}Raghunandan Rao;Congress;Malkajgiri;Assembly;MP;Parliment;srinivas;Backward Classes;District;CM;Reddy;revanth;Patancheru;Medak;Bharatiya Janata Partyమెదక్ : ఈ లెక్కన చూస్తే.. మెదక్ లో గెలిచేది నీలం మధేనా?మెదక్ : ఈ లెక్కన చూస్తే.. మెదక్ లో గెలిచేది నీలం మధేనా?Madhu{#}Raghunandan Rao;Congress;Malkajgiri;Assembly;MP;Parliment;srinivas;Backward Classes;District;CM;Reddy;revanth;Patancheru;Medak;Bharatiya Janata PartySun, 21 Apr 2024 12:30:00 GMTగత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. అయితే 17 స్థానాలకు గాను 15 స్థానాలలో విజయం సాధిస్తామని చెబుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అని స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. అయితే కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లపై మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టారు అన్నది తెలుస్తుంది. ఇలాంటి వాటిలో రేవంత్ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి తో పాటు మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో విజయంపై కూడా స్పెషల్ ఫొటోస్ పెట్టారు.


 అయితే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ అభ్యర్థి నీలం మధుని బరిలోకి దింపారు. బిజెపి నుంచి రఘునందన్ రావు అటు బిఆర్ఎస్ నుంచి వెంకటరామిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది అని చెప్పాలి. అయితే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో విజయం ఎవరిది అనే విషయంపై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఈ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధునే ఇక ఎంపిక గెలిచి పార్లమెంట్లు అడుగు పెట్టబోతున్నాడట. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, పటాన్చెరు, దుబ్బాక, సంగారెడ్డి, మెదక్ నియోజకవర్గాలు ఉన్నాయి.


 అయితే ఏడు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఎంపీ అభ్యర్థి గెలుపును డిసైడ్ చేసేది మాత్రం పటాన్చెరు నియోజకవర్గ ఓటర్లే అన్నది తెలుస్తుంది . ఎందుకంటే ఇక్కడ నాలుగు లక్షల పదివేల 170 మంది ఓటర్లు ఉన్నారు. మిగతా నియోజకవర్గాలతో పోల్చి చూస్తే ఇదే అత్యధికం. అయితే ఇక్కడ అటు నీలం మదుకు మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు కాంగ్రెస్ సీనియర్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా మధుకు మద్దతిస్తుండడంతో.. కాటా అభిమానులు కూడా పాత వివాదాలను మరిచిపోయి మధుని గెలిపించేందుకు పాటుపడే అవకాశం ఉంది. ఈ లెక్కన పటాన్చెరు నుంచి మెజారిటీ స్థాయిలో ఓట్లు నీలం మదుకు రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా. ఈ లెక్క ప్రకారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు కూడా అనుకుంటున్నారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>