PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-bramhani-nara-lokesh-mangalgiri-tdp-politics301b4512-57d7-49c3-a58e-7803bcee7e55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-bramhani-nara-lokesh-mangalgiri-tdp-politics301b4512-57d7-49c3-a58e-7803bcee7e55-415x250-IndiaHerald.jpg( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) - మూడుముక్కలాటతో ప్రజల బతుకులు ఛిద్రం - కక్షపూరిత రాజకీయాలకు ప్రజలే బుద్దిచెబుతారు - మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి సమర్థుడైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుంది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న వారు మూడుముక్కలాటతో ప్రజల బతుకులను ఛిద్రం చేశారని శ్రీమతి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేతపూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన బ్రాహ్మణి... వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్NARA BRAMHANI;NARA LOKESH;MANGALGIRI;TDP POLITICS{#}Industries;contract;Nara Brahmani;Nara Lokesh;marijuana;Mangalagiri;Amaravati;Capital;Amaravathi;Lokesh;Lokesh Kanagaraj;Hyderabad;India;CBNజ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఒక ఆటాడేసిన నారా బ్రాహ్మ‌ణి.. ఎన్ని తిట్లో చూడండి..!జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఒక ఆటాడేసిన నారా బ్రాహ్మ‌ణి.. ఎన్ని తిట్లో చూడండి..!NARA BRAMHANI;NARA LOKESH;MANGALGIRI;TDP POLITICS{#}Industries;contract;Nara Brahmani;Nara Lokesh;marijuana;Mangalagiri;Amaravati;Capital;Amaravathi;Lokesh;Lokesh Kanagaraj;Hyderabad;India;CBNSun, 21 Apr 2024 12:06:08 GMT( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

- మూడుముక్కలాటతో ప్రజల బతుకులు ఛిద్రం
- కక్షపూరిత రాజకీయాలకు ప్రజలే బుద్దిచెబుతారు
- మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి

సమర్థుడైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుంది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న వారు మూడుముక్కలాటతో ప్రజల బతుకులను ఛిద్రం చేశారని శ్రీమతి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేతపూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన బ్రాహ్మణి... వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ... ఒకప్పుడు రాళ్లురప్పలతో నిండిన హైదరాబాద్ ను హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా విశ్వనగరంగా మార్చిన దార్శనికుడు చంద్రబాబునాయుడు. ఎల్లప్పుడూ ప్రజాక్షేమాన్ని కాంక్షించే చంద్రబాబుపై తప్పుడు కేసులుపెట్టి 53రోజులపాటు అక్రమంగా జైలులో నిర్భందించారు, కక్షపూరిత రాజకీయాలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.  


రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరగిపోయాయి, భద్రతలేక భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. నాసిరకం మద్యం కారణంగా నిరుపేద కుటుంబాలు నాశనమవుతున్నాయి. ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి క్యాపిటల్ గా మార్చేశారు. చంద్రబాబు సిఎం అయ్యాక మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతారు. భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటిపన్నులు, కరెంటుబిల్లులతో ప్రజలపై భారంమోపారు. అమరావతి విధ్వంసంతో ఇక్కడి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి.  పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయాలు పడిపోయాయి. రాబోయే ఎన్నికల్లో అందరి ఆశీస్సులతో చంద్రబాబు సిఎం అయ్యాక రాజధాని నిర్మాణం చేపట్టి అమరావతి ప్రాంతానికి గతవైభవం తెస్తార‌ని ఆమె తెలిపారు.


రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. రాష్ట్రప్రజలు రెండునెలలు ఓపికపడితే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అన్నివర్గాల ప్రజల కష్టాలు తీరుతాయి. మంగళగిరి నియోజకవర్గంలో ఇబ్బందుల్లో ఉన్న చేనేతలను ఆదుకునేందుకు నారా లోకేష్ టాటా తనేరియాతో ఒప్పందం చేసుకుని వీవర్స్ శాలను ఏర్పాటుచేశారు. అధునాతన మగ్గాలు, డిజైన్లతోపాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి చేనేతల ఆదాయం పెంచేందుకు కృషిచేస్తున్నారు. నారా లోకేష్ చేస్తున్న మంచి పనుల్లో ఇదో చిన్న కార్యక్రమం మాత్రమే. లోకేష్ విజన్ అమలైతే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం దేశంలోనే నెం.1గా తయారవుతుందని నారా బ్రాహ్మణి చెప్పారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>