PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/singanamala-politics-ycpcf046103-edc7-46b0-85e6-1defd4a5338c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/singanamala-politics-ycpcf046103-edc7-46b0-85e6-1defd4a5338c-415x250-IndiaHerald.jpg •టిప్పర్ డ్రైవర్ అంటూ ప్రకటన రోజే అవమానం * వీరాంజనేయులు గెలుపుకి కారణం అవుతానంటున్న సాంబశివారెడ్డి * గెలిచి టిడిపికి చెక్ పెట్టేరా (అమరావతి - ఇండియా హెరాల్డ్) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న వేళ... పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆయా ప్రాంతాలలో మరింత ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా చెప్పాలి అంటే అనంతపురంలో శింగనమల నియోజకవర్గం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.. ఇక్కడ టిడిపి తరఫున బండారు శ్రావణి బరిలోకి దిగుతుండగా.. ఆమెకు పోటీగా వైసిపి తరఫుSINGANAMALA;POLITICS;YCP{#}yamini;Nalamada Padmavathi Reddy;Singanamala;Bandaru Sravani;Jonnalagadda Padmavathy;Driver;Scheduled caste;News;Cheque;India;Hanu Raghavapudi;Elections;CBN;MLA;Andhra Pradesh;TDP;YCP;Minister;Jaganసమరంలో సామాన్యుడు: అవమానపడ్డ చోటే సమరానికి సిద్ధం - టిప్పర్ డ్రైవర్..!సమరంలో సామాన్యుడు: అవమానపడ్డ చోటే సమరానికి సిద్ధం - టిప్పర్ డ్రైవర్..!SINGANAMALA;POLITICS;YCP{#}yamini;Nalamada Padmavathi Reddy;Singanamala;Bandaru Sravani;Jonnalagadda Padmavathy;Driver;Scheduled caste;News;Cheque;India;Hanu Raghavapudi;Elections;CBN;MLA;Andhra Pradesh;TDP;YCP;Minister;JaganSun, 21 Apr 2024 09:19:05 GMT

•టిప్పర్ డ్రైవర్ అంటూ ప్రకటన రోజే అవమానం

* వీరాంజనేయులు గెలుపుకి కారణం అవుతానంటున్న సాంబశివారెడ్డి

* గెలిచి టిడిపికి చెక్ పెట్టేరా


(అమరావతి - ఇండియా హెరాల్డ్)

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న వేళ... పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆయా ప్రాంతాలలో మరింత ఉత్కంఠ  నెలకొంది. ముఖ్యంగా చెప్పాలి అంటే అనంతపురంలో శింగనమల నియోజకవర్గం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.. ఇక్కడ టిడిపి తరఫున బండారు శ్రావణి బరిలోకి దిగుతుండగా.. ఆమెకు పోటీగా వైసిపి తరఫున అతి సామాన్య టిప్పర్ డ్రైవర్ ను రంగంలోకి దింపడం అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు.. ఆంధ్ర రాష్ట్రం మొత్తం శింగనమల వైపు చూసేలా వైసీపీ జగన్ నిర్ణయం  ఉందంటూ పలువురు కీలక నేతలు వాపోతున్నారు.. అయితే ఇక్కడ సామాన్యుడికి అవకాశం ఇవ్వడం వెనుక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి..

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. 2014లో జరిగిన ఎన్నికలలో టిడిపి అభ్యర్థి  యామిని బాల.. వైసిపి అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి పైన నాలుగువేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.. అయితే ఆ తర్వాత ఆమె ప్రజల్లో మమేకమౌతూ చేసిన పాదయాత్ర ఆమెకు ప్లస్ గా మారింది... అందులో భాగంగానే 2019 ఎన్నికల్లో ప్రత్యర్థి యామిని బాల పైన జొన్నలగడ్డ పద్మావతి ఏకంగా 47 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం సంచలనం అని చెప్పవచ్చు.. అంతేకాదు ఒకానొక సమయంలో జొన్నలగడ్డ పద్మావతి పేరు మంత్రి లిస్టులో కూడా వినిపించింది.. ఆ తర్వాత కొంతకాలానికి పద్మావతి మాట్లాడిన మాటల కారణంగా కొన్ని అనర్ధాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే పదవి కోసం కాళ్లు పట్టుకోవాలా అంటూ ఆమె మాట్లాడిన మాటలు.. ఆ తర్వాత మరుసటి రోజు జగన్ దేవుడు అంటూ చెప్పిన మాటలు ..పార్టీలో అసంతృప్తి చాయలు నెలకొనేలా చేశాడు.  దీంతో వైసిపి పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సాంబశివారెడ్డికి వైసిపి పార్టీ తరఫున ఎస్సీ కాండిడేట్ ను తీసుకొచ్చే బాధ్యతను అప్పగించారు.. ఇందులో భాగంగానే తన దగ్గర పనిచేసే టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులను సాంబశివారెడ్డి అభ్యర్థిగా తీసుకురావడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే అభ్యర్థిని ప్రకటించడమే కాదు అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత కూడా ఇప్పుడు సాంబశివారెడ్డి పైన ఉన్నది అని చెప్పవచ్చు..


 వాస్తవానికి సింగనమల నియోజకవర్గం లో వైసీపీ అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు ప్రకటించిన తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు టిప్పర్ డ్రైవర్ అంటూ హేళన చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే టిప్పర్ డ్రైవర్ ను  గెలిపించాలని.. సామాన్యుడు గద్దెనెక్కితే ఆ తర్వాత ప్రజలకు ఎలాంటి మేలు చేస్తారనేది నిరూపిస్తామని చెబుతున్నారు వైసీపీ కేడర్.. అత్యంత సామాన్యుడిగా బరిలోకి దిగుతున్న వీరాంజనేయులికి.. సామాన్యుల ఇబ్బందులు ఏంటో బాగా తెలుసు. ఈ క్రమంలోనే ఒక సామాన్య వ్యక్తీ అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారికి ఏ విధంగా మేలు చేస్తారు అనేది తెలుసుకోవడానికి కూడా ప్రజలు ఉత్సుకత చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఎక్కువగా వీరాంజనేయులు వైపే మొగ్గు చూపుతూ ఉండడం గమనార్హం.. ఇక తనను హేళన చేసిన టిడిపి తో సమరానికి దిగి గెలిచి చూపిస్తామంటూ చెబుతున్నారు.. ఇక అత్యంత సామాన్య వ్యక్తిగా బరిలోకి దిగుతున్న టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు సమరంలో నెగ్గితే అదొక రికార్డు అని చెప్పవచ్చు. మొత్తానికి వీరాంజనేయులు  గెలుపొందితే తనను హేళన చేసిన వారికి ఈ రకంగా చెక్ పెట్టవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>