Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplc346d09c-bf69-4be2-a644-1da1ace0c8c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplc346d09c-bf69-4be2-a644-1da1ace0c8c3-415x250-IndiaHerald.jpgసన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటతీరు ఈ సీజన్లో ఊహకందని రీతిలో ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే సన్రైజర్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంటుంది. కానీ బ్యాటింగ్లో మాత్రం తేలిపోతుంది అని అప్పట్లో అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం బౌలింగ్లో కాదు బ్యాటింగ్లో అన్ని టీమ్స్ కి మించి ప్రదర్శన చేస్తుంది అన్న విషయం అర్థమవుతుంది. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా భారీ స్కోరు చేస్తుంది. మొన్నటికి మొన్న ఏకంగా ఐపీఎల్ లోనే అత్యధిక స్కోర్ గా ఉన్న 263 పరుగుల రికార్డును బద్దలు కొట్టి.. 277 పరుగులు చేసింది. ఇక ఈ రికార్డును ఏ టIpl{#}abhishek;Delhi;Hyderabad;Cricketఐపీఎల్ లో కాదు.. టి20 క్రికెట్ హిస్టరీలోనే అరుదైన రికార్డ్?ఐపీఎల్ లో కాదు.. టి20 క్రికెట్ హిస్టరీలోనే అరుదైన రికార్డ్?Ipl{#}abhishek;Delhi;Hyderabad;CricketSun, 21 Apr 2024 06:23:00 GMTసన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటతీరు ఈ సీజన్లో ఊహకందని రీతిలో ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే సన్రైజర్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంటుంది. కానీ బ్యాటింగ్లో మాత్రం తేలిపోతుంది అని అప్పట్లో అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం బౌలింగ్లో కాదు బ్యాటింగ్లో అన్ని టీమ్స్ కి మించి ప్రదర్శన చేస్తుంది అన్న విషయం అర్థమవుతుంది. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా భారీ స్కోరు చేస్తుంది. మొన్నటికి మొన్న ఏకంగా ఐపీఎల్ లోనే అత్యధిక స్కోర్ గా ఉన్న 263 పరుగుల రికార్డును బద్దలు కొట్టి.. 277 పరుగులు చేసింది. ఇక ఈ రికార్డును ఏ టీం బద్దలు కొడుతుందా అని అందరూ ఎదురు చూస్తున్న వేళ.. మరోసారి సొంత రికార్డునే బద్దలు కొట్టేసింది సన్రైజర్స్. ఏకంగా 287 పరుగులు చేసి బ్యాటింగ్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించింది.



 ఇక ఓపెనర్ గా వచ్చిన ఆటగాళ్లు రావడం రావడమే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతున్నారు. దీంతో ఇక సన్రైజర్స్ ఆట తీరుకు అన్ని రికార్డులు దాసోహం అంటున్నాయి. ఇలా అత్యుత్తమమైన ప్రదర్శన చేస్తూ వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది జట్టు. ఇక ప్రస్తుతం పాయింట్లు పట్టికలో రెండవ స్థానాలలో కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ ఐదు మ్యాచ్ లలో విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో అటు సన్రైజర్స్ ఓపెనర్లు సృష్టించిన విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మునుపెన్నడూ లేని రీతిలో భీకరమైన బ్యాటింగ్ చేశారు  సన్రైజర్స్ ఓపెనర్లు.



 ఈ క్రమంలోనె ఆ జట్టు కేవలం ఐపీఎల్లో మాత్రమే కాదు టి20 క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డులను నమోదు చేసింది. పవర్ ప్లే లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. కేవలం 6 ఓవర్లలోనే 125 పరుగులు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 84 పరుగులు చేయగా అభిషేక్ 40 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ లు ఆడారు. అయితే గతంలో ఈ రికార్డు కోల్కతా జట్టు పేరిట ఉంది. 2017లో ఆ జట్టు ఆర్సీబీపై పవర్ ప్లే పూర్తయ్యే సరికి 105 పరుగులు చేయగా ఇదే అత్యధిక స్కోర్ గా ఉండేది. ఇక ఇప్పుడు ఈ రికార్డును సన్రైజర్స్ బద్దలు కొట్టేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>