Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1d0e7321-a170-4d93-8c97-a065ba4d8021-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1d0e7321-a170-4d93-8c97-a065ba4d8021-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినీ ప్రేక్షకుల అభిరుచులు పూర్తిస్థాయిలో మారిపోయాయి. కొంతమంది హీరోలు వయస్సుకు తగిన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతుంటే మరి కొందరు హీరోలు మాత్రం రొటీన్ సినిమాలలో నటిస్తూ తీవ్రస్థాయిలో ప్రేక్షకుల నుంచి విమర్శలు మూటగట్టుకుంటున్నారు.టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ గత కొన్నేళ్ల నుంచి సినిమాల విషయంలో ఎంతో మారారు.దృశ్యం, దృశ్యం2, గురు, సైంధవ్ లాంటి విభిన్నమైన కథనాలను ఎంచుకున్న వెంకటేశ్ సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకాదరణ దక్కుతోంది. నారప్ప లాంటి సినిమాల్లో నటించడsocialstars lifestyle{#}Narappa;vikram;Balakrishna;Kollywood;Industry;vijay kumar naidu;Hero;Cinema;mediaఆ విషయంలో ప్రేక్షకులను మెప్పిస్తున్న సీనియర్ హీరోలు...!!ఆ విషయంలో ప్రేక్షకులను మెప్పిస్తున్న సీనియర్ హీరోలు...!!socialstars lifestyle{#}Narappa;vikram;Balakrishna;Kollywood;Industry;vijay kumar naidu;Hero;Cinema;mediaSun, 21 Apr 2024 23:23:17 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం సినీ ప్రేక్షకుల అభిరుచులు పూర్తిస్థాయి లో మారిపోయాయి. కొంతమంది హీరోలు వయస్సుకు తగిన పాత్రల లో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతుంటే మరి కొందరు హీరోలు మాత్రం రొటీన్ సినిమాలలో నటిస్తూ తీవ్రస్థాయిలో ప్రేక్షకుల నుంచి విమర్శలు మూటగట్టుకుంటున్నారు.టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ గత కొన్నేళ్ల నుంచి సినిమాల విషయంలో ఎంతో మారారు.దృశ్యం, దృశ్యం2, గురు, సైంధవ్  లాంటి విభిన్నమైన కథనాలను ఎంచుకున్న వెంకటేశ్ సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకాదరణ దక్కుతోంది. నారప్ప లాంటి సినిమాల్లో నటించడం వెంకటేశ్ కే సాధ్యమవుతుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరో స్టార్ హీరో బాలయ్య సైతం కథల ఎంపిక లో, పాత్రల ఎంపిక లో పూర్తిస్థాయి లో మారిపోయారు. బాలయ్య గత మూడు సినిమా లను చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతోంది.

బాలయ్య భవిష్యత్తు సినిమా లలో సైతం వయస్సుకు తగిన పాత్రలనే ఎంచుకుంటున్నారని కొన్ని సినిమా లలో ఆయన డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఈ జాబితా లో రజనీకాంత్, కమల్ హాసన్ గురించి మాట్లాడుకోవాలి. జయాపజయాలతో సంబంధం లేకుండా రజనీ కాంత్ విభిన్నమైన కథలకు, పాత్రలకు ఓటేస్తున్నారు.మరో స్టార్ హీరో కమల్ హాసన్ సైతం వయస్సుకు తగిన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. విక్రమ్ సినిమా కమల్ హాసన్ స్థాయిని మార్చేసింది. విక్రమ్ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు ఎంత గానో నచ్చేసిందని చెప్పాలి. కమల్ ప్రస్తుతం నటిస్తున్న ఇండియన్2, కల్కి సినిమాలపై భారీ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. కమల్ కెరీర్ ప్లానింగ్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలు అద్భుతమైన కథాంశాలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తూ మరిన్ని విజయాలను అందు కోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>