HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health02bce84d-b1ce-45b3-a3c3-0cafc5e5c4ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health02bce84d-b1ce-45b3-a3c3-0cafc5e5c4ea-415x250-IndiaHerald.jpgవేసవి కాలంలో బయటకు వెళ్లేందుకు దాదాపు ఎవరూ కూడా అంతగా ఇష్టపడరు. అలాగని రోజువారీ పనులకు నుంచి విరామం తీసుకుని ఇంట్లోనే ఫ్యాన్‌ కింద కూర్చోలేరు కదా. ఎండలో బయటికి వెళ్లినప్పుడు వేడి స్ట్రోక్ అనేది ఖచ్చితంగా ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఎండకి బయటకి వెళ్ళినప్పుడు హీట్ స్ట్రోక్ నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి.తల తిరగడం, హృదయ స్పందన రేటు పెరగడం, చర్మం ఎర్రబడటం, వికారం, అధిక చెమట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శారీరక అలసట ఇంకా అలాగే మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా హీHealth{#}Onion;Beetroot;Buttermilk;Dehydrationసమ్మర్లో వడ దెబ్బ నుంచి కాపాడే డ్రింక్స్ ఇవే?సమ్మర్లో వడ దెబ్బ నుంచి కాపాడే డ్రింక్స్ ఇవే?Health{#}Onion;Beetroot;Buttermilk;DehydrationSun, 21 Apr 2024 17:31:00 GMTవేసవి కాలంలో బయటకు వెళ్లేందుకు దాదాపు ఎవరూ కూడా అంతగా ఇష్టపడరు. అలాగని  రోజువారీ పనులకు నుంచి విరామం తీసుకుని ఇంట్లోనే ఫ్యాన్‌ కింద కూర్చోలేరు కదా. ఎండలో బయటికి వెళ్లినప్పుడు వేడి స్ట్రోక్ అనేది ఖచ్చితంగా ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఎండకి బయటకి వెళ్ళినప్పుడు హీట్ స్ట్రోక్ నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి.తల తిరగడం, హృదయ స్పందన రేటు పెరగడం, చర్మం ఎర్రబడటం, వికారం, అధిక చెమట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శారీరక అలసట ఇంకా అలాగే మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా హీట్ స్ట్రోక్‌ బారీన పడినట్లు సంకేతం. కాబట్టి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా డీహైడ్రేషన్ వల్ల హీట్ స్ట్రోక్‌ సమస్య బాగా పెరుగుతుంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఆపై ఉంటే హీట్‌ స్ట్రోక్‌ సమస్య పెరిగే అవకాశం చాలా ఎక్కువ. ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు తీసుకుంటే వేసవి కాలంలో ఖచ్చితంగా హీట్‌ స్ట్రోక్‌ సమస్య నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఈ వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి పెరుగుతో చేసిన మజ్జిగ లేదా లస్సీని తాగవచ్చు. చెమట ద్వారా కోల్పోయే ఖనిజాలు మజ్జిగ ద్వారా పొందవచ్చు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబయోటిక్స్ కూడా అధికంగా ఉంటాయి.


ఎండ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పచ్చి మామిడి షర్బత్ తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేడి వాతావరణంలో రోజుకు మూడు సార్లు ఈ డ్రింక్ తాగడం వల్ల ఎలాంటి హాని తలెత్తదు. పచ్చి మామిడి, జీలకర్ర, సోపు, బీట్‌రూట్ వంటి పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచి, తక్షణ శక్తిని అందిస్తాయి. బయటికి వెళ్లాక అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే కొబ్బరి నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇది శారీరక బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.చింతపండు నీళ్ళు తయారు చేసుకుని సేవించినా ఎండతాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. చింతపండులో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి అధిక శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది వేసవిలో కడుపు సమస్యలను కూడా దూరం చేస్తాయి.అలాగే ఎండ నుంచి కాపాడడంలో ఉల్లిపాయ రసం ఇందుకు సహాయపడుతుంది. మూత్ర విసర్జన తర్వాత ఉల్లిపాయ రసాన్ని చెవులు, ఛాతీపై అప్లై చేయాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అలాగే పచ్చి ఉల్లిపాయలను కూడా తినవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>