PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chaing-sites-giddi-eswari-ragurama-ms-raju916e7ef0-5ca7-4651-9713-f963246e40d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chaing-sites-giddi-eswari-ragurama-ms-raju916e7ef0-5ca7-4651-9713-f963246e40d6-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.. ముఖ్యంగా టిడిపి కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో నాలుగు నియోజకవర్గాలలో ట్విస్ట్ ఇస్తూ అభ్యర్థులను మార్చాలని టిడిపి అధినేత నిర్ణయించారు. అప్పటికే టికెట్ పొందిన అభ్యర్థులకు ఇది భారీ షాక్ అని చెప్పవచ్చు. అందులో భాగంగానే నాలుగు అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను మార్చారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర రిజర్వ్డ్ నియోజకవర్గంలో ప్రస్తుత అభ్TDP;CHAING;SITES;GIDDI ESWARI;RAGURAMA;MS RAJU{#}anil music;satya;monday;Paderu;anil kumar singhal;Narsapuram;Ram Gopal Varma;narasapuram;CBN;Assembly;March;District;TDP;Minister;prasad;News;Narsapur;Bharatiya Janata Party;Partyటీడీపీ: బాబూ బిగ్ ట్విస్ట్.. 4 స్థానాల్లో అభ్యర్థులకు షాక్..!టీడీపీ: బాబూ బిగ్ ట్విస్ట్.. 4 స్థానాల్లో అభ్యర్థులకు షాక్..!TDP;CHAING;SITES;GIDDI ESWARI;RAGURAMA;MS RAJU{#}anil music;satya;monday;Paderu;anil kumar singhal;Narsapuram;Ram Gopal Varma;narasapuram;CBN;Assembly;March;District;TDP;Minister;prasad;News;Narsapur;Bharatiya Janata Party;PartySun, 21 Apr 2024 11:25:34 GMTప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.. ముఖ్యంగా టిడిపి కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో నాలుగు నియోజకవర్గాలలో ట్విస్ట్ ఇస్తూ అభ్యర్థులను మార్చాలని టిడిపి అధినేత నిర్ణయించారు. అప్పటికే టికెట్ పొందిన అభ్యర్థులకు ఇది భారీ షాక్ అని చెప్పవచ్చు. అందులో భాగంగానే నాలుగు అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను మార్చారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు..

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర రిజర్వ్డ్ నియోజకవర్గంలో ప్రస్తుత అభ్యర్థి అనిల్ కుమార్ ను  మార్చి ఎస్సి విభాగం నుంచి  రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్.
ఎస్ .రాజు కి కేటాయించారు. మొదట రాజుకి టికెట్ ఇవ్వాలని  భావించినా  అనిల్ కుమార్ కి కేటాయించడం జరిగింది. కానీ అనిల్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం వ్యతిరేకిస్తుండడంతో చివరికి ఎమ్. ఎస్ .రాజును ఖరారు చేశారు.

అనకాపల్లి జిల్లాలోని మాడుగుల టిడిపి అభ్యర్థిని కూడా మార్చాలని చంద్రబాబు నిర్ణయించారు
.గతంలో ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ రావుకు టికెట్ ఇవ్వగా.. ప్రచారంలో ఆయన వెనుకబడ్డారని నివేదికలు అందడంతో ప్రసాద్ రావు స్థానంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ను టిడిపి అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది.

ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా రఘురామ పోటీ చేయనున్నారు.. మొదట నర్సాపురం బిజెపి అభ్యర్థిగా చోటు దక్కుతుందని రఘురామ భావించినా ఆ పార్టీలో సభ్యత్వం లేకపోవడంతో ఆయనకు చోటు లభించలేదు అని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక రఘురామాకు టికెట్ ఇవ్వాలని టిడిపి వర్గాల నుంచి కూడా ఒత్తిడి రావడంతో నరసాపురం ఎంపీ స్థానం బీజేపీకి వెళ్లి.. ఆస్థానాన్ని వర్మ కేటాయించడంతో.. ఆ స్థానం కోసం రఘురామ తీవ్ర ప్రయత్నాలు చేశారు.. ఇక బిజెపి అభ్యర్థి శ్రీనివాస వర్మ కు ఆ పార్టీ బీఫామ్ కూడా ఇచ్చేసింది.. దీంతో రఘురామను ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయిస్తూ ఖరారు చేశారు.. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం ఉదయం 11:30 కు నామినేషన్ వేయనున్నట్లు రఘురామకృష్ణరాజు  ప్రకటించారు.


ఇక పాడేరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది..

ఇక కాసేపట్లో అభ్యర్థులకు టిడిపి చీఫ్ చంద్రబాబు బీ- ఫామ్ లు కూడా అందజేయనున్నారు.  నామినేషన్లకు ముందు ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>