Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dk87314ca2-28c1-4cbc-ab9f-303e0e1adf6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dk87314ca2-28c1-4cbc-ab9f-303e0e1adf6f-415x250-IndiaHerald.jpg2024 ఐపీఎల్ సీజన్లో ఎంతో మంది భారత ఆటగాళ్లు అదరగొట్టేస్తున్నారు. ఇందులో కొంతమంది సీనియర్లు ఉంటే ఇంకొంతమంది అప్పుడే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఈ ఏడాది జూన్ నెలలో టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇక ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించుకోవడమే లక్ష్యంగా అందరూ ఆటగాళ్లు ఇక అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారు. కానీ ఒక్క ఆటగాడి పేరు మాత్రం ఇండియన్ క్రికెట్ లో బాగా మారుమోగిపోతోంది. అతను ఎవరో కాదు సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్. గతంలో కెరియర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో ఐపీఎల్లో అDk{#}Karthik;Cricket;World Cup;Yuva;June;Indianఎట్టకేలకు.. మనసులో మాట బయటపెట్టిన డీకే?ఎట్టకేలకు.. మనసులో మాట బయటపెట్టిన డీకే?Dk{#}Karthik;Cricket;World Cup;Yuva;June;IndianSun, 21 Apr 2024 06:40:00 GMT2024 ఐపీఎల్ సీజన్లో ఎంతో మంది భారత ఆటగాళ్లు అదరగొట్టేస్తున్నారు. ఇందులో కొంతమంది సీనియర్లు ఉంటే ఇంకొంతమంది అప్పుడే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఈ ఏడాది జూన్ నెలలో టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇక ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించుకోవడమే లక్ష్యంగా అందరూ ఆటగాళ్లు ఇక అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారు. కానీ ఒక్క ఆటగాడి పేరు మాత్రం ఇండియన్ క్రికెట్ లో బాగా మారుమోగిపోతోంది. అతను ఎవరో కాదు సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్.


 గతంలో కెరియర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో ఐపీఎల్లో అద్భుతంగా రానించి వరల్డ్ కప్ షెడ్యూల్లో చోటు సంపాదించుకున్న దినేష్ కార్తీక్ ఇక ఈసారి కూడా ఇలాగే టీమిండియాలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్లో అతని బ్యాటింగ్ విధ్వంసం ఆ రేంజ్ లో కొనసాగుతోంది. ఏకంగా ప్రతి మ్యాచ్ లో కూడా చివర్లో బ్యాటింగ్ కి వస్తూ అద్భుతమైన షాట్లు ఆడుతున్నాడు. తన బ్యాటింగ్ తో క్రికెట్ ప్రపంచానికి కొత్త రకం షాట్లను పరిచయం చేస్తున్నాడు. ఇక విధ్వంసం  అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు.


 అయితే ఇక టీమిండియాలోకి వచ్చేందుకే దినేష్ కార్తీక్ ఇంత అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. ఇక ఇదే విషయం గురించి ఆర్సిబి ఫినిషర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరోసారి తనకు టీమిండియా తరఫున ఆడాలని ఉంది అంటూ మనసులో మాట బయటపెట్టాడు. నా కెరియర్ లోనే అత్యుత్తమ దశలో ఉన్న.. 100% సిద్ధంగా ఉన్న. టి20 ప్రపంచ కప్ లో నా సేవలు అందించాలని అనుకుంటున్నా. జట్టు గెలుపు కోసం నా సాయి శక్తుల కృషి చేస్తా అంటూ దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు. ఇప్పుడు వరకు జరిగిన మ్యాచ్ లలో 205 స్ట్రైక్ రేట్ తో 226 పరుగులు చేశాడు డీకే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>