HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/thati-gijalu-eating-health25cdb1d5-8a98-45c6-b8c0-8a698405310c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/thati-gijalu-eating-health25cdb1d5-8a98-45c6-b8c0-8a698405310c-415x250-IndiaHerald.jpgవేసవికాలం వచ్చిందంటే చాలు కొన్ని కొన్ని పండ్లు మాత్రం ఈ సీజన్లోని దొరుకుతూ ఉంటాయి. అలాంటి వాటిలో తాటి ముంజలు కూడా ఒకటి.. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఇవి తినడానికి తియ్యగా చాలా సాఫ్ట్ గా ఉన్నప్పటికీ చాలామంది వీటిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా తాటి ముంజలు తినడం వల్ల శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలాంటి అధిక వేడినైనా సరే శరీరాన్ని చల్లబరిచే తత్వం ఈ తాటి ముంజలలో ఎక్కువగా ఉంటుందట. తాటి ముంజలలో ఎక్కువగా విటమిన్స్, ఖనిజాలు, మినరల్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. అందుచేతనే వీటTHATI GIJALU;EATING;HEALTH{#}Sugar;Shakti;Aquaతాటి ముంజలు తినడం వల్ల ఇన్ని సమస్యలకు చెక్..!తాటి ముంజలు తినడం వల్ల ఇన్ని సమస్యలకు చెక్..!THATI GIJALU;EATING;HEALTH{#}Sugar;Shakti;AquaSun, 21 Apr 2024 06:00:00 GMTవేసవికాలం వచ్చిందంటే చాలు కొన్ని కొన్ని పండ్లు మాత్రం ఈ సీజన్లోని దొరుకుతూ ఉంటాయి. అలాంటి వాటిలో తాటి ముంజలు కూడా ఒకటి.. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఇవి తినడానికి తియ్యగా చాలా సాఫ్ట్ గా ఉన్నప్పటికీ చాలామంది వీటిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా తాటి ముంజలు తినడం వల్ల శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలాంటి అధిక వేడినైనా సరే శరీరాన్ని చల్లబరిచే తత్వం ఈ తాటి ముంజలలో ఎక్కువగా ఉంటుందట.


తాటి ముంజలలో ఎక్కువగా విటమిన్స్, ఖనిజాలు, మినరల్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. అందుచేతనే వీటిని తినడం వల్ల శరీరానికి హైడ్రేట్ గా ఉంటుంది. తాటి ముంజలలో ఎక్కువగా నీటి శాతమే ఉంటుంది. అందుచేతనే వీటిని తిన్నా కూడా మన శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుందట.


తాటి ముంజలు తినడం వల్ల శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి కూడా తగ్గదు.. ఎవరికైనా దగ్గు ,జలుబు ఉంటే వాటిని అమాంతం దూరం చేస్తాయి. డయాబెటిస్ రోగులు సైతం తాటి ముంజలు పైన తోలు తీయకుండా తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగవు.


తాటి ముంజలలో ఎక్కువగా క్యాలరీలు ఉండవు కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం చాలా మంచిది.. అంతేకాకుండా ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మం మృదువుగా మారడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడేవారు వీటిని తినడం మంచిది.


మూత్రపిండాలలోనే ఉండేటువంటి రాళ్లను కూడా లేకుండా చేస్తాయి తాటి ముంజలు.. తాటి ముంజలు తరచూ తింటూ ఉండటం వల్ల కంటి సమస్యలను దూరం చేస్తుంది అలాగే రత్తహీనత సమస్యను కూడా నివారిస్తుంది..

తాటి ముంజలు ఎక్కువగా తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. జీర్ణ వ్యవస్థ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>