PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-mekapati-bonding6c2b8845-0079-4266-a933-96d1e5c92df9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-mekapati-bonding6c2b8845-0079-4266-a933-96d1e5c92df9-415x250-IndiaHerald.jpg• రాజకీయ స్నేహానికి మారుపేరు మేకపాటి గౌతం రెడ్డి •స్నేహం కోసం పదవిని కూడా పక్కకు పెట్టారు * జగన్ కోసమే రాజకీయ ఎంట్రీ (అమరావతి - ఇండియా హెరాల్డ్) ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే.. ఎవరు ఎలా పోతేనేం నేను బాగుంటే చాలు అనే నాయకులు చాలామంది ఉన్నారు... అయితే బయటకు కనిపించరు కానీ లోపల వారి ప్రవర్తన చూస్తే మాత్రం నిజంగా ఈ మాట అనక తప్పదు.. ముఖ్యంగా రాజకీయ అవసరాల కోసం స్నేహాలు వర్తమాన పరిస్థితుల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి.. అవసరం తీరిన తర్వాత స్నేహం కూడా శత్రుత్వమే అవుతుంది.. కానీ ఇక్కడ ఒక నJAGAN;MEKAPATI;BONDING{#}gautham new;gautham;Gautam Adani;Nellore;Tammudu;Thammudu;Allu Sneha;Y. S. Rajasekhara Reddy;Yatra;Father;Yevaru;CM;India;MP;politics;Jagan;Reddy;Congress;Ministerరాజకీయ స్నేహం: జగన్ - మేకపాటి..అరుదైన ఆత్మీయత..!రాజకీయ స్నేహం: జగన్ - మేకపాటి..అరుదైన ఆత్మీయత..!JAGAN;MEKAPATI;BONDING{#}gautham new;gautham;Gautam Adani;Nellore;Tammudu;Thammudu;Allu Sneha;Y. S. Rajasekhara Reddy;Yatra;Father;Yevaru;CM;India;MP;politics;Jagan;Reddy;Congress;MinisterSat, 20 Apr 2024 11:07:12 GMT రాజకీయ స్నేహానికి మారుపేరు మేకపాటి గౌతం రెడ్డి

•స్నేహం కోసం పదవిని కూడా పక్కకు పెట్టారు

* జగన్ కోసమే రాజకీయ ఎంట్రీ





(అమరావతి - ఇండియా హెరాల్డ్)

ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే.. ఎవరు ఎలా పోతేనేం నేను బాగుంటే చాలు అనే నాయకులు చాలామంది ఉన్నారు... అయితే బయటకు కనిపించరు కానీ లోపల వారి ప్రవర్తన చూస్తే మాత్రం నిజంగా ఈ మాట అనక తప్పదు.. ముఖ్యంగా రాజకీయ అవసరాల కోసం స్నేహాలు వర్తమాన పరిస్థితుల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి.. అవసరం తీరిన తర్వాత స్నేహం కూడా శత్రుత్వమే అవుతుంది.. కానీ ఇక్కడ ఒక నాయకుడు మాత్రం స్నేహం కోసం పదవిని వదులుకోవడమే కాదు ఏకంగా ప్రాణాలను అర్పించే అంత త్యాగం చేశారు.. మరి ఆయన ఎవరు?  ఆయన స్నేహితుడు ఎవరు ? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం...

రాజకీయంగా స్నేహం అంటే ఇలా ఉండాలి అని ఎంతో మందికి నిరూపించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి అలాగే మేకపాటి గౌతంరెడ్డి.. స్నేహానికి మారు పేరైన దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్వప్రయోజనాల కోసం స్నేహం చేయలేదు .. స్నేహం కోసమే రాజకీయాల్లోకి వచ్చిన ఒక అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం.. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే స్నేహితుడి వెన్నంటే నిలిచారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో ఆయన బాంధ్యవ్యం నేటి రాజకీయాలలో అరుదైన స్నేహ బంధానికి ప్రతీకగా నిలుస్తోంది.. ఎంతోమందికి ఆయన స్నేహం ఆదర్శంగా నిలుస్తోందని చెప్పవచ్చు..

దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆయన వ్యాపార రంగంపైనే దృష్టి సారించారు.. తొలినాళ్లలో రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం వైయస్ జగన్మోహన్ రెడ్డితో స్నేహ బంధమే అని చెప్పాలి. ఆయన తమ్ముడు పృథ్వి రెడ్డి హైదరాబాదులో చదువుకునే సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి క్లాస్మేట్ కావడంతో అలా స్నేహబంధం ఏర్పడింది.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే ఆత్మీయ బంధం మరింత బలపడింది.. మరోవైపు 2009 ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ లో తీవ్ర పోటీ నెలకొంటే వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా గౌతంరెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక వైయస్సార్ హఠాన్మరణం తర్వాత ఆయన అండదండలతోనే కాంగ్రెస్ నుంచి గెలిచిన పలువురు ప్రజా ప్రతినిధులు ముఖం చాటేసినా..కష్టకాలంలో మాత్రం మేకపాటి కుటుంబం వైఎస్ జగన్ వెన్నంటే నిలిచింది.. నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహణలో పాలు పంచుకుంది..


అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచేందుకు తన ఎంపీ పదవిని కూడా వదిలిపెట్టడానికి రాజమోహన్ రెడ్డి వెనుకాడ లేదు.. వైయస్ జగన్ వెన్నంటి నిలిచిన మేకపాటి కుటుంబాన్ని నాడు కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది వేధించింది... అయినప్పటికీ గౌతమ్ రెడ్డి తెరవెనక వైఎస్ కుటుంబంతోనే రాజకీయంగా ప్రయాణం కొనసాగించారు.. అలా  స్నేహం కోసం మంత్రిత్వ పదవులను కూడా కాదనుకొని తమ స్నేహానికి ప్రతీకగా నిలిచారు మేకపాటి గౌతంరెడ్డి..  అలా  జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి , మేకపాటి కుటుంబానికి మధ్య  సాన్నిహిత్యం  రాజకీయ స్నేహానికి నిదర్శనం అని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>