PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-tollywod-sailent-2024ac9eae5e-70a3-45ac-b3e5-933d8477e184-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-tollywod-sailent-2024ac9eae5e-70a3-45ac-b3e5-933d8477e184-415x250-IndiaHerald.jpgవాస్తవానికి సినీ ఇండస్ట్రీకి రాజకీయనికి ఎప్పుడూ కూడా మంచి బాండింగ్ ఉంటుంది. సినీ రంగం నుంచి రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ ,ఎంజీఆర్ ,జయలలిత, కరుణానిధి వంటి వారు కూడా సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాలలోకి వచ్చి బాగా సక్సెస్ అయ్యారు.. ఇప్పటికి కూడా చాలామంది సెలబ్రిటీలు పొలిటికల్ పరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎవరూ కూడా సీఎం సీటు దాకా చేరుకోలేకపోతున్నారు. కేవలం ఎంపీ ఎమ్మెల్యేలు గానే నెగ్గి మంత్రులుగా పనిచేస్తున్నారు. ఆంధ్రాలో చూస్తే మెగా ఫ్యామిలీ, నందమూరిAP POLITICS;TOLLYWOD;SAILENT;2024{#}M. Karunanidhi;Hindupuram;Film Industry;producer;Producer;CBN;Industries;MP;politics;Chiranjeevi;Tollywood;Balakrishna;NTR;Telugu;Jabardasth;Elections;CM;Yevaru;Andhra Pradesh;Success;News;kalyan;Partyఏపీ: పాలిటిక్స్ అంటే టాలీవుడ్ వణుకుతోందా..?ఏపీ: పాలిటిక్స్ అంటే టాలీవుడ్ వణుకుతోందా..?AP POLITICS;TOLLYWOD;SAILENT;2024{#}M. Karunanidhi;Hindupuram;Film Industry;producer;Producer;CBN;Industries;MP;politics;Chiranjeevi;Tollywood;Balakrishna;NTR;Telugu;Jabardasth;Elections;CM;Yevaru;Andhra Pradesh;Success;News;kalyan;PartySat, 20 Apr 2024 13:42:35 GMTవాస్తవానికి సినీ ఇండస్ట్రీకి రాజకీయనికి ఎప్పుడూ కూడా మంచి బాండింగ్ ఉంటుంది. సినీ రంగం నుంచి రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ ,ఎంజీఆర్ ,జయలలిత, కరుణానిధి వంటి వారు కూడా సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాలలోకి వచ్చి బాగా సక్సెస్ అయ్యారు.. ఇప్పటికి కూడా చాలామంది సెలబ్రిటీలు పొలిటికల్ పరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎవరూ కూడా సీఎం సీటు దాకా చేరుకోలేకపోతున్నారు. కేవలం ఎంపీ ఎమ్మెల్యేలు గానే నెగ్గి మంత్రులుగా పనిచేస్తున్నారు.


ఆంధ్రాలో చూస్తే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ రాజకీయాలలో కొన్నేళ్ల నుంచి ఉంటున్నారు . సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు బాలయ్య ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. ఈసారి హ్యాట్రి కొట్టాలని హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలోకి వెళ్లాలని చాలా పట్టుదలతో ఉన్నారు. ఈ సమయంలోనే సినీ ఇండస్ట్రీ నుంచి ఏపీ వైపు దృష్టి సాధించాల్సిన అవసరం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ గడిచిన కొద్దిరోజులుగా చూస్తే రాజకీయాల వైపు టాలీవుడ్ ఇండస్ట్రీ సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది.


వాస్తవానికి తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులు సైతం చాలామంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే. చాలామంది ఆస్తిపాస్తులు కూడా ఇక్కడే ఉన్నాయి. కానీ ఎవరూ కూడా ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయలేదు.. గడిచిన కొన్ని నెలల క్రితం తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరు ప్రచారం చేయలేదు.. అంతా సైలెంట్ గానే ఉన్నారు. అందుకు కారణం ఏంటనే అంతా సైలెంట్ గానే ఉన్నారు. అందుకు కారణం అయితే తెలియదు కానీ.. ఇటీవల టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలిపారు.


 చంద్రబాబు అరెస్టును ఎందుకు ఖండించలేదనే విషయం పైన మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు రాజకీయాలు ముఖ్యం కాదని..తమకు అన్ని రాజకీయ పార్టీలు సమానమేనని తమకు సినీ రంగం ప్రయోజనాలే ముఖ్యమంటూ తెలియజేశారట. ఎవరైనా సరే వ్యక్తిగతంగా తమ రాజకీయ ఇష్టాలను ప్రకటించుకుంటే అందులో ఏమాత్రం తప్పులేదు కానీ టాలీవుడ్ లోని ఉన్న సంఘాలు మాత్రం ఎవరికీ మద్దతుగా నిలిచేది ఉండదంటూ  తెలియజేశారు. నిజానికి ఆంధ్రాలోని రాజకీయాలు చూస్తే ఎవరికి అర్థం కావడం లేదు ఎవరు అధికారంలోకి వస్తారో తెలియక సతమతమవుతున్నారు. ఎవరు వచ్చినా కూడా తక్కువ సీట్లతోనే గెలుస్తారనే అయితే అంటున్నారు. ఇంత టైట్ ఫిట్ సాగుతున్న సమయంలో ఎవరైనా సినీ సెలబ్రిటీల  సపోర్ట్ తీసుకుని ప్రచారంలోకి దిగితే ఒకవేళ  రివర్స్ అయితే ఏమిటా అనే చర్చ కూడా టాలీవుడ్ లో కొనసాగుతోంది. ప్రచారం చేసిన తర్వాత ఆపోజిట్ పార్టీ గెలిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్దేశంతోనే రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ సినిమా మనిషి కాబట్టి జబర్దస్త్ బ్యాచ్ మాత్రం తిరుగుతున్నట్టు కనిపిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>