Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vidyabalan66dc8d26-c5df-4320-9092-d2adf7d9cc78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vidyabalan66dc8d26-c5df-4320-9092-d2adf7d9cc78-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఫాలో అయ్యే దర్శకనిర్మాతలు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఏదైనా సినిమా మొదలుపెట్టాలి అనుకున్నప్పుడు మంచి రోజు మంచి ముహూర్తం చూసుకుని పూజ కార్యక్రమాలు చేయడం చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది ఈ సెంటిమెంట్లను కాస్త ఎక్కువగానే ఫాలో అవడం చూస్తూ ఉంటాం. కేవలం ఇక సినిమా షూటింగ్ ప్రారంభం రోజు ముహూర్తం మాత్రమే కాదు ఏకంగా నటీనటుల ఎంపిక విషయంలో కూడా ఇలాంటి ముహూర్తాలు చూసుకోవడం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏకంగా హీరో హీరోయిన్ల జాతకాలు చెక్ చేసి మరి సినిమాల్లోకి తీసుకోవడం కూడా చVidyabalan{#}Cheque;Yevaru;Hero;Director;Cinema;bollywoodనా జాతకం బాలేదని.. సినిమా నుంచి తీసేసారు : హీరోయిన్నా జాతకం బాలేదని.. సినిమా నుంచి తీసేసారు : హీరోయిన్Vidyabalan{#}Cheque;Yevaru;Hero;Director;Cinema;bollywoodSat, 20 Apr 2024 17:05:00 GMTసినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఫాలో అయ్యే దర్శకనిర్మాతలు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఏదైనా సినిమా మొదలుపెట్టాలి అనుకున్నప్పుడు మంచి రోజు మంచి ముహూర్తం చూసుకుని పూజ కార్యక్రమాలు చేయడం చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది ఈ సెంటిమెంట్లను కాస్త ఎక్కువగానే ఫాలో అవడం చూస్తూ ఉంటాం. కేవలం ఇక సినిమా షూటింగ్ ప్రారంభం రోజు ముహూర్తం మాత్రమే కాదు ఏకంగా నటీనటుల ఎంపిక విషయంలో కూడా ఇలాంటి ముహూర్తాలు చూసుకోవడం చేస్తూ ఉంటారు.



 కొంతమంది ఏకంగా హీరో హీరోయిన్ల జాతకాలు చెక్ చేసి మరి సినిమాల్లోకి తీసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటివి పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ఒకప్పుడు ఇలా సినిమా హీరో హీరోయిన్ల జాతకాలు కూడా చూసేవారు అనే టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపించేది. అయితే తనకు కూడా ఒక సినిమా విషయంలో ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది అంటూ చెబుతున్నారు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్  గా కొనసాగిన ఆమె ఇక ఎన్నో చాలెంజ్ రోల్స్ లో కూడా చేసి కోట్లాదిమంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.



 అయితే ఒకానొక సమయంలో తన జాతకం బాగాలేదు అనే కారణంతో సినిమా నుంచి తప్పించారు అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది విద్యాబాలన్. తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న వింత సంఘటనని ఇటీవల అభిమానులతో పంచుకుంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా జాతకం బాగాలేదని దురదృష్టవంతురాలని అని చెప్పి నన్ను సినిమా నుంచి తప్పించారు. ఇక ఒక మూడ విశ్వాసాలు ఉన్న డైరెక్టర్ తన మూవీ విజయం సాధించాలని ఒకే షర్ట్ నలభై రోజులకు పైగా వేసుకున్నాడు. కానీ చివరికి అతని సినిమా పరాజయం పాలైంది. అయితే అతను ఎవరు ఆ మూవీ ఏంటి అనే విషయం మాత్రం చెప్పాలనుకోవట్లేదు అంటూ విద్యాబాలన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>