MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vdffa15b2f-5126-49fc-9450-78ee710dbfa1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vdffa15b2f-5126-49fc-9450-78ee710dbfa1-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అవుతూ ఉంటాయి. కానీ భారీ అంచనాల నడుమ విడుదల అయిన సినిమాలలో చాలా తక్కువ శాతం సినిమాలు మాత్రమే ప్రేక్షకుల అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఇకపోతే సినీ పరిశ్రమలో కొంత మంది వ్యక్తులకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అలాగే వారు నిర్మించే సినిమాలపై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకుంటారు. అలా తెలుగు సినీ పరిశ్రమలో మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన పేరు ఉంది అంటే ఆ సినిమాపై ఆటోమేటVd{#}gunasekhar;parasuram;Samantha;vijay deverakonda;Audience;Box office;Heroine;Varsham;News;dil raju;Telugu;Cinemaఅప్పుడు శాకుంతలం... ఇప్పుడు ఫ్యామిలీ స్టార్... పెద్ద దెబ్బే వేసాయిగా..?అప్పుడు శాకుంతలం... ఇప్పుడు ఫ్యామిలీ స్టార్... పెద్ద దెబ్బే వేసాయిగా..?Vd{#}gunasekhar;parasuram;Samantha;vijay deverakonda;Audience;Box office;Heroine;Varsham;News;dil raju;Telugu;CinemaSat, 20 Apr 2024 06:30:00 GMTప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అవుతూ ఉంటాయి. కానీ భారీ అంచనాల నడుమ విడుదల అయిన సినిమాలలో చాలా తక్కువ శాతం సినిమాలు మాత్రమే ప్రేక్షకుల అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఇకపోతే సినీ పరిశ్రమలో కొంత మంది వ్యక్తులకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అలాగే వారు నిర్మించే సినిమాలపై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకుంటారు. అలా తెలుగు సినీ పరిశ్రమలో మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన పేరు ఉంది అంటే ఆ సినిమాపై ఆటోమేటిక్ గా కాస్త పాజిటివ్ వైబ్ ఏర్పడుతూ ఉంటుంది.

కానీ అప్పుడప్పుడు ఈయన నిర్మించే సినిమాలు కూడా ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచిన సందర్భాలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఈయన సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో శాకంతలం అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు దిల్ రాజు భారీ మొత్తంలో ఖర్చు కూడా చేశాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ తో దిల్ రాజు కు పెద్ద మొత్తంలో నష్టం కూడా వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఇకపోతే దిల్ రాజు తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ది ఫ్యామిలీ స్టార్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు కూడా దిల్ రాజు పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా పోయిన సంవత్సరం శాకుంతలం మూవీ తో ... ఈ సంవత్సరం ది ఫ్యామిలీ మెన్ మూవీ లతో దిల్ రాజు కు పెద్ద దెబ్బలే తగిలినట్లు తెలుస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>