MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgదగ్గుబాటి రానా ను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల తీసిన ‘లీడర్’ మూవీ విడుదలై వచ్చే సంవత్సరామికి 15 సంవత్సరాలు పూర్తి అవుతోంది. 2010లో విడుదలైన ఆమూవీ అప్పట్లో ఒక పెను సంచలనం సృష్టించింది. లక్షల కోట్ల అవినీతి సొమ్ము చుట్టూ తీయబడ్డ ఆమూవీ కథ అప్పట్లో ఒక హాట్ టాపిక్. అయితే ఈ మూవీ ఊహించిన స్థాయిలో విజయవంతం అవ్వకపోయినప్పటికీ హీరోగా రానా ఎంట్రీ మాత్రం అందరికీ తెలిసేలా ఆమూవీ చేసింది. ఈమూవీ తరువాత తిరిగి శేఖర్ రాణా ల కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఈ మూవీ తరువాత రానా హీరోగా చాల సినిమాలు చేసినప్పటికీ ఆసినిమsekhar kammula{#}dhanush;rana daggubati;sekhar;bollywood;media;Josh;India;Cinema;Newsలీడర్ 2 పై మనసులో మాటను బయటపెట్టిన శేఖర్ కమ్ముల !లీడర్ 2 పై మనసులో మాటను బయటపెట్టిన శేఖర్ కమ్ముల !sekhar kammula{#}dhanush;rana daggubati;sekhar;bollywood;media;Josh;India;Cinema;NewsSat, 20 Apr 2024 09:00:00 GMTదగ్గుబాటి రానా ను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల తీసిన ‘లీడర్’ మూవీ విడుదలై వచ్చే సంవత్సరామికి 15 సంవత్సరాలు పూర్తి అవుతోంది. 2010లో విడుదలైన ఆమూవీ అప్పట్లో ఒక పెను సంచలనం సృష్టించింది. లక్షల కోట్ల అవినీతి సొమ్ము చుట్టూ తీయబడ్డ ఆమూవీ కథ అప్పట్లో ఒక హాట్ టాపిక్.


అయితే ఈ మూవీ ఊహించిన స్థాయిలో విజయవంతం అవ్వకపోయినప్పటికీ హీరోగా రానా ఎంట్రీ మాత్రం అందరికీ తెలిసేలా ఆమూవీ చేసింది. ఈమూవీ తరువాత తిరిగి శేఖర్ రాణా ల కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఈ మూవీ తరువాత రానా హీరోగా చాల సినిమాలు చేసినప్పటికీ ఆసినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో హీరోగా రానా కెరియర్ కు బ్రేక్ పడింది.


ఆతరువాత వచ్చిన ‘బాహుబలి’ తో రానా కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చినప్పటికీ బాలీవుడ్ కూడ రానా కు చెప్పుకోతగ్గ అవకాశాలు రాలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య రానా శేఖర్ కమ్ముల కాంబినేషన్  మళ్ళీ సెట్ అవుతుంది అని వస్తున్న వార్తలు రానా అభిమానులకు జోష్ ను కలిగిస్తున్నాయి.


ప్రస్తుతం ధనుష్ తో ఒక మూవీని చేస్తున్న శేఖర్ కమ్ముల ఆమూవీని పూర్తి చేసిన తరువాత ‘లీడర్ 2’ మూవీని చేసే ఆస్కారం ఉండీ అంటూ లీకులు ఇస్తున్నాడు. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ తనకు ‘లీడర్ 2’ సంబంధించిన కథ ఆలోచన వచ్చిందని నేటి వర్తమాన రాజకీయాలలోని అవినీతిని కళ్ళకు కట్టేకు కట్టే విధంగా తన కథ ఉంటుంది అనీ లీకులు ఇస్తున్నాడు. అయితే ఈ సీక్వెల్ మూబీ రానా డేట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మొదలు పెడతానని మరొక హీరోతో ఈ సీక్వెల్ తనకు తీసే ఉద్దేశ్యం లేదు అని అంటున్నాడు. దీనితో నిజంగా ఎప్పటికైనా ‘లీడర్’ వచ్చే అవకాశం ఉందా అని అంటున్నారు .  






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>