PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ka-paul7c78978d-f98d-4307-b406-cf8426640f9b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ka-paul7c78978d-f98d-4307-b406-cf8426640f9b-415x250-IndiaHerald.jpgనామినేషన్ల పర్వం ప్రారంభం అయింది. దీంతో ఏపీలో ఎన్నికల సందడి మరింత ఎక్కువైంది. ఈ సమయంలో తొలిరోజే పలువురు కీలక నేతలు నామినేషన్లు వేయగా.. రెండో రోజు మరింత ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సమయంలో కేఏ పాల్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆయన తన ఎన్నికల నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ లో ఏం వెల్లడించారు అనే అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అవును.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ పేరుకి ఏమాత్రం పరిచయం అవసరం లేదు. గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన చేస్తున్న హల్ చల్ అంతా ఇంతా కాదనే ka paul{#}Vishakapatnam;Nalgonda;K A Paul;Degree;March;Hanu Raghavapudi;Teluguబాబోయ్‌.. బెంబేలెత్తిస్తున్న కేఏ పాల్‌ ఆస్తుల లెక్కలు?బాబోయ్‌.. బెంబేలెత్తిస్తున్న కేఏ పాల్‌ ఆస్తుల లెక్కలు?ka paul{#}Vishakapatnam;Nalgonda;K A Paul;Degree;March;Hanu Raghavapudi;TeluguSat, 20 Apr 2024 10:00:36 GMTకేఏ పాల్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆయన తన ఎన్నికల నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ లో ఏం వెల్లడించారు అనే అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.


అవును.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ పేరుకి ఏమాత్రం పరిచయం అవసరం లేదు. గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన చేస్తున్న హల్ చల్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఈ క్రమంలో.. రానున్న ఎన్నికల్లో విశాఖ పట్నం నుంచి లోక్ సభ స్థానానికి పోటీ పడుతున్నారు. నామినేషన్ల సందర్భంగా కేఏ పాల్ తన ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులతో పాటు కేసుల వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా తన పేరిట వాహనాలు, స్థిరాస్తులు, అప్పులు ఏమీ లేవని ప్రకటించిన ఆయన.. రూ.1.86లక్షలు మాత్రమే ఉన్నాయని వివరించారు.


ఇక విద్యార్హత విషయానికొస్తే డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే చదువు ఆపేసినట్లు పాల్ వెల్లడించారు. తనపై మహబూబ్ నగర్, ఒంగోలు, ఎస్ కోట, రాజన్న సిరిసిల్ల, నల్గొండ ప్రాంతంలో ఆరు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా 2019 ఎన్నికల సమయంలో మార్చి నెలలో సమర్పించిన అఫిడవిట్ లో చాలా భాగం ఖాళీగా వదిలేశారనే చర్చ సాగింది. విశాఖ పట్నంలోని న్యూ రైల్వే కాలనీలో ఉన్న తన ఇంటి అడ్రస్ ఇచ్చిన పాల్ కులం, మతం లాంటి వివరాలు రాయలేదని.. ఆఇదే క్రమంలో తన చేతిలో రూ.30 వేల క్యాష్ మాత్రమే ఉందని చెప్పి.. ఇతర ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించలేదు. గతంలో వందల కోట్లు ఆస్తిపాస్తులు ఉన్న కేఏ పాల్‌ ఇప్పుడు ఉన్నట్టుండి ఇంత తక్కువ ఆస్తులు చూపడం చర్చనీయాంశంగా మారింది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>