PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/he-is-the-only-one-who-is-jagan-best-friend-among-ycp-mlasef0224dd-828b-4f34-96ad-24d2ba7e9278-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/he-is-the-only-one-who-is-jagan-best-friend-among-ycp-mlasef0224dd-828b-4f34-96ad-24d2ba7e9278-415x250-IndiaHerald.jpg- శ్రీకాంత్‌రెడ్డి అంటే చ‌చ్చేంత ప్రేమ జ‌గ‌న్‌కు - స్నేహితుడి కోసం ప‌ద‌వి వ‌దులుకున్న ఫ‌స్ట్ ఫ్రెండ్ శ్రీకాంత్‌ - జ‌గ‌న్ సీఎం అయినా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని కాస్త గ్యాప్‌ ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్నేహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. జగన్ ఒకరిని నమ్మారు అంటే చాలు వారితో సుదీర్ఘకాలం అలా స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. వారి ఎదుగుదలకు తన వంతుగా చేయాల్సింది చేస్తూనే ఉంటారు. అలాంటిది జగన్‌కు అత్యంత సన్నిహితులు ఉంటే వారితో ఏ స్థాయిలో బాండింగ్ ఉంటుందో చెప్పక్కర్లేAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; MLA Srikanth reddy; ycp; ysrcp{#}srikanth;రాజీనామా;SV Mohan Reddy;Rayachoty;MLA;Congress;prema;Love;Reddy;YCP;CM;Minister;India;Jaganవైసీపీ ఎమ్మెల్యేల్లో జ‌గ‌న్ బెస్ట్ ఫ్రెండ్ ఆ ఒక్క‌డే... అయినా ఇద్ద‌రికి గొడ‌వ త‌ప్ప‌లేదు..?వైసీపీ ఎమ్మెల్యేల్లో జ‌గ‌న్ బెస్ట్ ఫ్రెండ్ ఆ ఒక్క‌డే... అయినా ఇద్ద‌రికి గొడ‌వ త‌ప్ప‌లేదు..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; MLA Srikanth reddy; ycp; ysrcp{#}srikanth;రాజీనామా;SV Mohan Reddy;Rayachoty;MLA;Congress;prema;Love;Reddy;YCP;CM;Minister;India;JaganSat, 20 Apr 2024 09:18:43 GMT- శ్రీకాంత్‌రెడ్డి అంటే చ‌చ్చేంత ప్రేమ జ‌గ‌న్‌కు
- స్నేహితుడి కోసం ప‌ద‌వి వ‌దులుకున్న ఫ‌స్ట్ ఫ్రెండ్ శ్రీకాంత్‌
- జ‌గ‌న్ సీఎం అయినా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని కాస్త గ్యాప్‌

( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్నేహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. జగన్ ఒకరిని నమ్మారు అంటే చాలు వారితో సుదీర్ఘకాలం అలా స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. వారి ఎదుగుదలకు తన వంతుగా చేయాల్సింది చేస్తూనే ఉంటారు. అలాంటిది జగన్‌కు అత్యంత సన్నిహితులు ఉంటే వారితో ఏ స్థాయిలో బాండింగ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. జగన్‌కు బాగా బాగా కావలసిన దోస్తులలో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఒకరు. అటు శ్రీకాంత్ రెడ్డి కుటుంబానికి ఇటు వైఎస్ కుటుంబానికి ఎప్పటి నుంచి స్నేహం ఉంది. 2009లో శ్రీకాంత్ రెడ్డి కి రాయిచోటి సీటు రావటంలో జగన్ కీలకంగా వ్యవహరించారు. జగన్ స్వ‌యంగా రికమెండ్ చేయించి మరి శ్రీకాంత్ రెడ్డికి రాయచోటి సీటు ఇప్పించగా.. శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.


తర్వాత జగన్ తండ్రి మార‌ణాంత‌రం ఢిల్లీలో.. సోనియాగాంధీని కలిసి బయటకు వచ్చిన మరుక్షణమే ఇక్కడ నాకు న్యాయం జరగదు.. బయటకు రావలసిన సమయం ఆసన్నమైందని శ్రీకాంత్ రెడ్డి తో అన్నారు. ఆ వెంటనే శ్రీకాంత్ రెడ్డి.. నీతోనే నా ప్రయాణం.. నువ్వు ఏం చెబితే అదే చేస్తానని అన్నారు. వెంటనే జగన్ తో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. 2012 ఉప ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీకాంత్ 2014లో మూడోసారి.. 2019లో నాలుగో సారీ కూడా వైసీపీ నుంచి శ్రీకాంత్ రెడ్డి గెలిచారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి తన బెస్ట్ ఫ్రెండ్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తనకు కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని శ్రీకాంత్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.


తొలి మూడేళ్లు కుదరలేదు. తర్వాత ఆయన మంత్రి పదవి వస్తుందని అనుకుంటే శ్రీకాంత్ రెడ్డి ఆశలు నెరవేరలేదు. అక్కడ నుంచి శ్రీకాంత్ రెడ్డి కి జగన్‌కు మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని అంటారు. ఈసారి టికెట్ విషయంలో కూడా రాయిచోటిలో ప్రభుత్వ శాఖలో ఓ కీల‌క అధికారిగా ఉన్న ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారిని పోటీ చేయిస్తారు అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే జగన్ చివరకు తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డికే సీటు ఇచ్చారు. శ్రీకాంత్ రెడ్డి జగన్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నది నిజం. అయితే వీరిద్దరి మధ్య గతంతో ఉన్న స్నేహంతో పోలిస్తే ఎక్కడో చిన్నపాటి గ్యాప్ అయితే ఉందని వైసీపీ వర్గాలే అంతర్గతంగా చెవులు కోరుక్కుంటూ ఉంటాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>