PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/elections-202466f24b5d-8850-40ce-a273-252c8c7b4de2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/elections-202466f24b5d-8850-40ce-a273-252c8c7b4de2-415x250-IndiaHerald.jpgతెలంగాణ లోక్ సభ ఫలితాలు మరో సంచలనానికి వేదికగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నిలకు మించి వివిధ పార్టీల అంచనాలు తలకిందులు కానున్నాయి. చేరికలతో.. జెట్ స్పీడులో కాంగ్రెస్ బల పడుతుందా? లేక.. చాప కింద నీరులా బీజేపీ వ్యాపిస్తుందా అనేది అర్థం కావడం లేదు. ఇప్పటికే కేడర్, లీడర్ రెండింటిని పోగోట్టుకొన్న బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి. మొత్తానిని ఈ సారి లోక్ సభ ఎన్నికలు ట్రాయాంగిల్ పోరును తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏక ఛత్రాధిపత్యంతో తెలంగాణను ఏలిన బీఆర్ఎస్.. ఒక్క అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుదేలయింది. కీలక మైన నేతలు ఒelections 2024{#}kavitha;Smart phone;KCR;Congress;Party;Bharatiya Janata Party;House;Leader;Josh;Assembly;Electionsతెలంగాణలో ఎన్నికల తర్వాత ఆ పార్టీ క్లోజ్‌?తెలంగాణలో ఎన్నికల తర్వాత ఆ పార్టీ క్లోజ్‌?elections 2024{#}kavitha;Smart phone;KCR;Congress;Party;Bharatiya Janata Party;House;Leader;Josh;Assembly;ElectionsSat, 20 Apr 2024 09:03:10 GMTతెలంగాణ లోక్ సభ ఫలితాలు మరో సంచలనానికి వేదికగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నిలకు మించి వివిధ పార్టీల అంచనాలు తలకిందులు కానున్నాయి. చేరికలతో.. జెట్ స్పీడులో కాంగ్రెస్ బల పడుతుందా? లేక.. చాప కింద నీరులా బీజేపీ వ్యాపిస్తుందా అనేది అర్థం కావడం లేదు. ఇప్పటికే కేడర్, లీడర్ రెండింటిని పోగోట్టుకొన్న బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి.


మొత్తానిని ఈ సారి లోక్ సభ ఎన్నికలు ట్రాయాంగిల్ పోరును తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏక ఛత్రాధిపత్యంతో తెలంగాణను ఏలిన బీఆర్ఎస్.. ఒక్క అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుదేలయింది. కీలక మైన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారుతుండటం… ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఈ సారి లోక్ సభ ఎన్నికలు ఆ పార్టీకి జీవన్మరణ సమస్యలా మారింది. ఇప్పటికే అధికారం నుంచి ప్రతిపక్షానికి పరిమితం చేసిన ప్రజలు.. ఈ ఎన్నికల్లో ఆ స్థానాన్ని కూడా వేరే పార్టీకి కట్టబెడతారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.


బీఆర్ఎస్ ఓటమి తర్వాత కొన్ని నెలల పాటు ఓటమిపై సమీక్షలు చేయకుండా కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితం అయ్యారు. ఈ నాలుగు నెలల కాలంలోనే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, దిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం తదితర వాటితో బీఆర్ఎస్ క్రమంగా బలహీన పడుతోంది. దీంతో కేసీఆర్ ప్రజా క్షేత్రంలో వడవడిగా అడుగులు వేశారు.


ఆయా లోక్ సభ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ.. క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ పార్టీకి ఒకటికి, రెండుకి మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఉనికిని కాపాడాలన్నా.. ప్రతిపక్ష హోదా ఉండాలన్నా బీఆర్ఎస్ గణనీయ సీట్లు సాధించాల్సిన అవసరం ఉంది. లేకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>