PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024c9cda03c-9ebc-4134-a27a-a56d0167e215-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024c9cda03c-9ebc-4134-a27a-a56d0167e215-415x250-IndiaHerald.jpg•రాబోయే ఎన్నికల్లో ఫైట్ ఫుల్ టైట్ •ఈసారి మెజార్టీ కష్టమే •నువ్వా నేనా అనే రేంజ్ లో పార్టీల మధ్య పోటీ ఈసారి రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఫైట్ ఎంత టైట్ గా ఉండబోతుందో చెప్పేందుకు చాలా సర్వేలు ఉన్నాయి. అలాగే అనేక అంచనాలు కూడా పెరుగుతున్నాయి. అటు అధికార వైసీపీ కానీ ఇటు విపక్ష తెలుగుదేశం కూటమి కానీ ఈసారి ఎన్నికలను మునుపేనాడూ లేనంత సీరియస్ గా తీసుకుంటున్నారు.ఆరు నూరు అయినా నూరు నూట యాభై అయినా ఈసారి ఖచ్చితంగా గెలవాల్సిందే అని పట్టుబడుతున్నారు.దాంతో ప్రతీ ఓటూ కూడా కీలకంగా మారుతోంది. అలాగే నువ్వా నేAP Elections 2024{#}Telangana Chief Minister;India;Elections;war;Hanu Raghavapudi;YCP;Andhra Pradesh;Telugu Desam Party;Jaganఈసారి ఫైట్ ఫుల్ టైట్.. భారీ మెజార్టీ కష్టమే?ఈసారి ఫైట్ ఫుల్ టైట్.. భారీ మెజార్టీ కష్టమే?AP Elections 2024{#}Telangana Chief Minister;India;Elections;war;Hanu Raghavapudi;YCP;Andhra Pradesh;Telugu Desam Party;JaganSat, 20 Apr 2024 08:38:08 GMT•రాబోయే ఎన్నికల్లో ఫైట్ ఫుల్ టైట్ 
•ఈసారి మెజార్టీ కష్టమే
•నువ్వా నేనా అనే రేంజ్ లో పార్టీల మధ్య పోటీ


ఈసారి రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఫైట్ ఎంత టైట్ గా ఉండబోతుందో చెప్పేందుకు చాలా సర్వేలు ఉన్నాయి. అలాగే అనేక అంచనాలు కూడా పెరుగుతున్నాయి. అటు అధికార వైసీపీ కానీ ఇటు విపక్ష తెలుగుదేశం కూటమి కానీ ఈసారి ఎన్నికలను మునుపేనాడూ లేనంత సీరియస్ గా తీసుకుంటున్నారు.ఆరు నూరు అయినా నూరు నూట యాభై అయినా ఈసారి  ఖచ్చితంగా గెలవాల్సిందే అని పట్టుబడుతున్నారు.దాంతో ప్రతీ ఓటూ కూడా కీలకంగా మారుతోంది. అలాగే నువ్వా నేనా అన్న పోటీ కూడా బాగా సాగుతోంది. ఈ నేపధ్యంలో గతంలో వచ్చిన భారీ మెజారిటీలు ఈసారి రాకపోవచ్చు అని ఇండియా హెరాల్డ్ చేసిన సర్వేలో తేలింది. ఎందుకంటే ఏకపక్షంగా ఎన్నికలు సాగితేనే భారీ మెజారిటీలనేవి నమోదు అవుతాయి. కానీ పరిస్థితి చూస్తే అలా లేదని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ఈసారి భారీ మెజారిటీలు ఎక్కడ వస్తాయి అన్న దాని మీద అపుడే అన్వేషణ కూడా మొదలైంది. కనీసంగా పట్టుమని పది సీట్లలో కూడా భారీ మెజారిటీలు వచ్చే సీన్ లేదని సర్వేలో తెలుస్తుంది. దాంతో ఈసారి స్వల్ప మెజారిటీలతోనే గట్టెక్కే నేపధ్యం ఉందని అంటున్నారు.ఇక ముప్పయి వేల భారీ మెజారిటీలు రాబోయే ఎన్నికల్లో చూడగలుగుతామా అన్న చర్చ కూడా సాగుతోంది.


2019లో అయితే ఏకంగా ఇరవై వేల మెజారిటీలు పైగా సీట్లు చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ముప్పయి వేల మెజారిటీ దాటిన సీట్లు కూడా పదుల సంఖ్యలోనే  ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే లక్ష పై దాటిన మెజారిటీలు వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అయితే తొంబై వేల ఓట్ల మెజారిటీ వచ్చింది.అదే ఊపులో నలభై వేలు యాభై వేల మెజారిటీలు కూడా టచ్ చేసిన సీట్లు చాలా కనిపిస్తాయి.అప్పుడు ఇవన్నీ వైసీపీ గెలిచిన సీట్లుగానే ఉన్నాయి. ఎందుకంటే భారీ జన ప్రభంజనం జగన్ కి అనుకూలంగా 2019 ఎన్నికల్లో వీచింది. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీకి 151 సీట్లు 2019లో లభించాయి. ఆ టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. జనసేనకు కేవలం ఒక సీటు మాత్రమే దక్కింది.కానీ ఈసారి  ఫుల్ టైట్ గానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యుద్ధం సాగుతోంది. దాంతో ఎవరికి భారీ మెజారిటీలు వస్తాయన్న  చర్చ ఇప్పుడు మొదలైంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>