PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/2024-politics-jagan-chandrababu-balaya76e3b486-6588-4448-b038-0cf4ecaea1b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/2024-politics-jagan-chandrababu-balaya76e3b486-6588-4448-b038-0cf4ecaea1b0-415x250-IndiaHerald.jpgఆంధ్రాలో ఈసారి ఎన్నికలు చాలా టైట్ గా ఉండబోతున్నట్లు ఇప్పటికే ఎన్నో రకాల సర్వేలు కూడా తెలియజేశాయి. అటు అధికార పార్టీ వైసిపి ఇటు ఎలాగైనా సరే ఈసారి కచ్చితంగా టిడిపి పార్టీ గెలవాల్సిందే.. లేకపోతే ఇక టిడిపి పార్టీ భూస్థాపితం అవుతుంది. అందుకే ఈసారి బిజెపి , టిడిపి, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని మరి ముందుకు వెళుతున్నారు. ఇదంతా ఇలా ఉండగా గతంలో వచ్చిన భారీ మెజారిటీ ఈసారి రాకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏకపక్ష ఎన్నికలు సాగితేనే భారీ మెజారిటీలు వస్తాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అలాంట2024;POLITICS;JAGAN;CHANDRABABU;BALAYA{#}Balakrishna;Janasena;Elections;Bharatiya Janata Party;TDP;Jagan;Party;YCP;CBN;Newsఏపీ: అత్యధికంగా మెజారిటీతో గెలిచే సీట్లు మూడేనా..?ఏపీ: అత్యధికంగా మెజారిటీతో గెలిచే సీట్లు మూడేనా..?2024;POLITICS;JAGAN;CHANDRABABU;BALAYA{#}Balakrishna;Janasena;Elections;Bharatiya Janata Party;TDP;Jagan;Party;YCP;CBN;NewsSat, 20 Apr 2024 06:48:14 GMTఆంధ్రాలో ఈసారి ఎన్నికలు చాలా టైట్ గా ఉండబోతున్నట్లు ఇప్పటికే ఎన్నో రకాల సర్వేలు కూడా తెలియజేశాయి. అటు అధికార పార్టీ వైసిపి ఇటు ఎలాగైనా సరే ఈసారి కచ్చితంగా టిడిపి పార్టీ గెలవాల్సిందే.. లేకపోతే ఇక టిడిపి పార్టీ భూస్థాపితం అవుతుంది. అందుకే ఈసారి బిజెపి , టిడిపి, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని మరి ముందుకు వెళుతున్నారు. ఇదంతా ఇలా ఉండగా గతంలో వచ్చిన భారీ మెజారిటీ ఈసారి రాకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి.



ఎందుకంటే ఏకపక్ష ఎన్నికలు సాగితేనే భారీ మెజారిటీలు వస్తాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని రాజకీయ పండితులు తెలియజేస్తున్నారు. కనీసం పట్టుమని పది సీట్లలో కూడా భారీ మెజారిటీ వచ్చే సీట్లు ఎక్కడా కనిపించడం లేదట. ముఖ్యంగా స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కి నేపథ్యం ఎక్కువగా కనిపిస్తోంది.. 30 వేలకు మించి భారీ మెజారిటీలు ఈసారి చూడలేమనే చర్చ కొనసాగుతోంది. గత ఎన్నికలలో చూస్తే 20,000 మెజారిటీ కలిగివున్న సీట్లు చాలానే వచ్చాయి.. ఇక 30 వేల మెజారిటీ కలిగిన సీట్లు కూడా పదుల సంఖ్యలో ఉన్నాయి. అలాగే లక్షకు పైగా దాటిన మెజారిటీ సీట్లు కూడా ఉన్నాయి.


ముఖ్యంగా వైయస్ జగన్ కి 90 వేల కోట్ల మెజారిటీ అయితే వచ్చింది. అదే ఊపులో 40 వేలు 50 వేలు మెజారిటీలు టచ్ చేసిన సీట్లు కూడా చాలానే కనిపించాయి. అయితే ఇవన్నీ కూడా ఎక్కువగా వైసిపి పార్టీ నుంచి వచ్చాయి. 151 సీట్లతో వైసిపి 2019లో ఒక ప్రభంజనం సృష్టించింది. కేవలం టిడిపి 23 సీట్లకే పరిమితం కాక జనసేన ఒకటి గెలుచుకుంది. అయితే ఈసారి జరగబోయే ఎన్నికలలో 175 సీట్లలో.. 80 శాతం సీట్లు 10వేలకు మించి మెజారిటీలు ఉండకపోవచ్చట.. మరి ఆ 20% సీట్లు కూడా 10,000 దాటి మెజారిటీలు ఎక్కడ నమోదయ్య అవకాశాలు కనిపించడం లేదట.భారీ మెజారిటీతో గెలుస్తామని చెబుతున్న నాయకులు గొప్పగా బయటకు చెప్పుకున్న గ్రౌండ్ లెవెల్ లో వేరేగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే 30 వేలకు పైగా గెలిచే సీట్లు మాత్రం కేవలం మూడేనట.. ఆ సీట్లు ఏమిటంటే వైయస్ జగన్ నిలిచిన పులివెందల, చంద్రబాబు నియోజవర్గం కుప్పం, మూడవది బాలయ్య నిలబడిన హిందూపురం. ఈ మూడు 30 వేలకు మించి ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు తెలుపుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>