MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishal5e3cdf54-0378-4651-988e-660aa757a58b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishal5e3cdf54-0378-4651-988e-660aa757a58b-415x250-IndiaHerald.jpgతమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విశాల్ తాజాగా రత్నం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరి దర్శకత్వం వహించగా... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని ప్రియ భవాని శంకర్ ఈ సినిమాలో విశాల్ కు జోడిగా నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 26 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ప్రచారాVishal{#}Lokesh;Allu Arjun;arya;gunasekhar;hari;hari music;shankar;vishal krishna;cinema theater;Music;Joseph Vijay;Lokesh Kanagaraj;Arjun;Aryaa;Beautiful;Interview;sree;Kollywood;Cinemaవరుడు... లియో మూవీలను అందుకే రిజెక్ట్ చేశా... విశాల్..!వరుడు... లియో మూవీలను అందుకే రిజెక్ట్ చేశా... విశాల్..!Vishal{#}Lokesh;Allu Arjun;arya;gunasekhar;hari;hari music;shankar;vishal krishna;cinema theater;Music;Joseph Vijay;Lokesh Kanagaraj;Arjun;Aryaa;Beautiful;Interview;sree;Kollywood;CinemaSat, 20 Apr 2024 08:00:00 GMTతమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విశాల్ తాజాగా రత్నం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరి దర్శకత్వం వహించగా... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని ప్రియ భవాని శంకర్ ఈ సినిమాలో విశాల్ కు జోడిగా నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 26 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ప్రచారాలను మొదలు పెట్టింది.

అందులో భాగంగా ఈ మూవీ నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా హీరో అయినటువంటి విశాల్ అనేక ఇంటర్వ్యూవలలో పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా విశాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విశాల్ తాను గతంలో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశాను. అలా వాటిని ఎందుకు రిజెక్ట్ చేయవలసి వచ్చింది అనే వివరాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విశాల్ మాట్లాడుతూ ... నాకు గతంలో అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన వరుడు సినిమాలో ఆర్య చేసిన పాత్ర ఆఫర్ వచ్చింది.

కానీ ఆ టైం లో నేను ఇతర మూవీ లతో బిజీగా ఉండడం వల్ల ఆ పాత్రను చేయలేకపోయాను అని చెప్పాడు. అలాగే విజయ్ హీరో గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో మూవీ లో అర్జున్ చేసిన పాత్ర ఆఫర్ మొదట నాకు వచ్చింది. కానీ ఆ సమయంలో కూడా నేను ఇతర మూవీ లతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాను కూడా వదులుకోవాల్సి వచ్చింది అని విశాల్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>