PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kutami40bcd445-2457-464e-a6b0-9cc863a99d8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kutami40bcd445-2457-464e-a6b0-9cc863a99d8b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పరిస్థితి చిత్ర విచిత్రంగా ఉంది. ఎలక్షన్లకు చాలా రోజుల ముందు వరకు తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వారు కూడా ఒంటరి పోరుకే రెడీ అన్నట్లుగా ఉన్నారు. ఇక చంద్రబాబును అరెస్టు చేయడంతోనే పరిస్థితులు అన్నీ మారాయి. ఒంటరిగా వెళ్లి గెలుపు విషయంలో క్లారిటీ లేకుండా ఉండడం కంటే మరో బలమైన వ్యక్తిని తోడు పెట్టుకుంటే గెలుపు వస్తుంది ఏమో అనే ఉద్దేశంతో పవన్ తో తెలుగుదేశం పార్టీ కలిసింది. దానితో ఈ రెండు పార్టీల బలాలు కూడా పెరిగినట్లు వీరు భావించారు. అలాగేKutami{#}Telugu Desam Party;YCP;TDP;Janasena;Andhra Pradesh;News;Party;Bharatiya Janata Partyమూడు పార్టీలన్నారు.. కూటమన్నారు... తుస్సుమన్నారు..?మూడు పార్టీలన్నారు.. కూటమన్నారు... తుస్సుమన్నారు..?Kutami{#}Telugu Desam Party;YCP;TDP;Janasena;Andhra Pradesh;News;Party;Bharatiya Janata PartyFri, 19 Apr 2024 09:25:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పరిస్థితి చిత్ర విచిత్రంగా ఉంది. ఎలక్షన్లకు చాలా రోజుల ముందు వరకు తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వారు కూడా ఒంటరి పోరుకే రెడీ అన్నట్లుగా ఉన్నారు. ఇక చంద్రబాబును అరెస్టు చేయడంతోనే పరిస్థితులు అన్నీ మారాయి. ఒంటరిగా వెళ్లి గెలుపు విషయంలో క్లారిటీ లేకుండా ఉండడం కంటే మరో బలమైన వ్యక్తిని తోడు పెట్టుకుంటే గెలుపు వస్తుంది ఏమో అనే ఉద్దేశంతో పవన్ తో తెలుగుదేశం పార్టీ కలిసింది.

దానితో ఈ రెండు పార్టీల బలాలు కూడా పెరిగినట్లు వీరు భావించారు. అలాగే ఈ పార్టీలు కూడా భావించాయి. ఇక అలాంటి తరుణంలోనే బీజేపీ కూడా వీరితో పొత్తులో కలవబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక చివరకు అటూ ఇటూ అయ్యి ఈ మూడు పార్టీలు కలిసి కూటమిలా ప్రకటించుకున్నాయి. ఇక దీనితో ఇక్కడి ప్రజలు మరియు ఈ మూడు పార్టీల నాయకులు అంతా కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు తిరిగే లేదు అని అనుకున్నారు.

ఇక అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. పొత్తు వరకు బాగానే ఉంది. జనాల్లో క్రేజ్ కూడా ఉంది. పార్టీ టికెట్ల పంపకం విషయంలో మాత్రం కూటమి చాలా వరకు ఫెయిల్ అయ్యింది. మొదట సీట్ల పంపకం విషయంలోనే ఈ మూడు పార్టీలకు క్లారిటీ లేకుండా పోయింది. ఆ పంపకంలో భాగంగా ఒక చోట పాలన పార్టీకి క్రేజ్ ఉన్న నాయకుడు ఉన్నా కానీ ఆ ఏరియాలో వేరే వాళ్లకు సీట్ ఇవ్వడంతో అక్కడ మైనస్ అయిపోతుంది.

దానితో క్రేజ్ ఉన్న ఆ నాయకుడు వేరే పార్టీకి వెళ్లడం... ఇక్కడ సీట్ ఇచ్చిన వ్యక్తికి జనాల్లో బలం లేకపోవడం మైనస్ అవుతుంది. ఇక ఇందులో జనసేన పరిస్థితి కాస్త డిఫరెంట్ గా ఉంది. వీరికి ఇచ్చినవే తక్కువ సీట్లు. వాటిలో కూడా పోటీ చేయడానికి కాండేట్లు లేకపోతే టీడీపీ నుండి కండువా కప్పుకున్న వారికి సిట్ ఇవ్వడం... వైసీపీ నుండి వచ్చిన వారికి కండువా కప్పి సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా మొదలు అయ్యింది. అయినప్పటికీ కొన్ని చోట్ల సీట్ మారుతుందా..? ఉంటుందా అనే క్లారిటీ కూడా కొంతమంది నేతలకు లేదు. ఇలా మూడు పార్టీలుగా ప్రకటించుకున్నప్పుడు ఉన్న క్రేజ్ సీట్ల పంపిణీ తర్వాత ఈ కూటమికి చాలా వరకు తగ్గింది అనే అభిప్రాయాన్ని అక్కడి జనాలు వ్యక్తం చేస్తున్నారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>