PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcrb56e9740-fed5-44ca-ac54-a699e024953f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcrb56e9740-fed5-44ca-ac54-a699e024953f-415x250-IndiaHerald.jpgప్రజా స్వామ్యంలో ఎవరు ఎవరీ మీద అయినా విమర్శలు చేయవచ్చు. ఆ వెసులు బాటు అందరికీ ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇది కాస్త మితిమీరుతూ ఉంటుంది. అదే సమయంలో పార్టీ శ్రేణులు, నాయకులు, ఒక స్థాయిలో ఉండే నాయకులు ఏది మాట్లాడినా.. పార్టీ అధ్యక్షులకు, కీలక పదవుల్లో ఉన్నవారికి సంయమనం ఉండాలి. వారిని వారించాలి. కానీ పార్టీ అధ్యక్షులు, సీఎంలు, మాజీ సీఎంలే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దీనికి అడ్డు చెప్పేది ఎవరు? పెద్ద మనిషి తనం పాటించాల్సిన అధినేతలే చౌక బారు మాటలు మాట్లాడుతుంటే.. దీనికి బాధ్యత ఎవరు వహించాలి. తాజాగా మkcr{#}Medak;Ishtam;KCR;Telangana;Reddy;Congress;CM;Party;Yevaruఎంత పెద్ద కేసీఆర్‌ అయినా రేవంత్‌ రెడ్డిని అలా అనొచ్చా?ఎంత పెద్ద కేసీఆర్‌ అయినా రేవంత్‌ రెడ్డిని అలా అనొచ్చా?kcr{#}Medak;Ishtam;KCR;Telangana;Reddy;Congress;CM;Party;YevaruFri, 19 Apr 2024 07:24:00 GMTప్రజా స్వామ్యంలో ఎవరు ఎవరీ మీద అయినా విమర్శలు చేయవచ్చు.  ఆ వెసులు బాటు అందరికీ ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇది కాస్త మితిమీరుతూ ఉంటుంది. అదే సమయంలో పార్టీ శ్రేణులు, నాయకులు, ఒక స్థాయిలో ఉండే నాయకులు ఏది మాట్లాడినా.. పార్టీ అధ్యక్షులకు, కీలక పదవుల్లో ఉన్నవారికి సంయమనం ఉండాలి. వారిని వారించాలి.


కానీ పార్టీ అధ్యక్షులు, సీఎంలు, మాజీ సీఎంలే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దీనికి అడ్డు చెప్పేది ఎవరు? పెద్ద మనిషి తనం పాటించాల్సిన అధినేతలే చౌక బారు మాటలు మాట్లాడుతుంటే.. దీనికి బాధ్యత ఎవరు వహించాలి.  తాజాగా మాజీ సీఎం కేసీఆర్ జహీరాబాద్, మెదక్ లోక్ సభ పరిధిలో బహిరంగా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చేతగాని, అసమర్థ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. మెడలు వంచైనా సరే రుణ మాఫీ చేయిస్తామని అన్నారు.


దీంతో పాటు అప్పుడప్పుడు రాజకీయాల్లో గమ్మత్తుగా గుడ్డి లక్ష్మి వచ్చినట్లు కొంతమంది లిల్లీ ఫూట్ గాళ్లకు అధికారం వస్తుందని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.  రాజకీయ నాయకుల ఎత్తుల గురించి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగతంగా విమర్శలు ప్రజాస్వామ్యానికి మంచివి కాదని హితవు పలుకుతున్నారు. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంట అనే విధానంలో తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయని.. సీఎం ఒకటి అంటే కేసీఆర్ రెండు మాటలు అంటున్నారని పేర్కొన్నారు.


ఇది సమకాలీన రాజకీయాలకు సరికాదని.. వ్యక్తిగతంగా కాకుండా.. రాజకీయ విధానాలపై, విధానపర అంశాలపై విమర్శలు చేయవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయంలో ఈ తరహా అంశాలు కనిపించడం లేదు. యుద్ధంలో కూడా శత్రువులను గౌరవించడం యుద్ధనీతి అని అలాంటిది రాజకీయాల్లో మాత్రం ఈ ధర్మం పాటించడం లేదు.  తిట్ల దండకంలో, దూషణల పర్వంలో కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి లు ఇద్దరూ ఎవరికీ వారే యమునా తీరు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>