Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanthecf61127-cf03-4b93-b13f-35723fb5c7a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanthecf61127-cf03-4b93-b13f-35723fb5c7a8-415x250-IndiaHerald.jpgపార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇక అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇక ఇప్పటికే అన్ని స్థానాలలో పోటీ చేయబోయే అభ్యర్థుల వివరాలను ప్రకటించాయ్ పార్టీలు. ఇక ఆయా అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీలోని కీలక నేతలందరూ కూడా ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే అటు కారు పార్టీని ఖాళీ చేయడమే లక్ష్Revanth{#}KTR;Car;Arvind Kejriwal;revanth;rahul;Rahul Sipligunj;Revanth Reddy;Party;Telangana;Congressకాంగ్రెస్ కి వేసే ప్రతి ఓటు.. బిజెపికి వెళ్తుందా?కాంగ్రెస్ కి వేసే ప్రతి ఓటు.. బిజెపికి వెళ్తుందా?Revanth{#}KTR;Car;Arvind Kejriwal;revanth;rahul;Rahul Sipligunj;Revanth Reddy;Party;Telangana;CongressFri, 19 Apr 2024 11:05:00 GMTపార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో  తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇక అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇక ఇప్పటికే అన్ని స్థానాలలో  పోటీ చేయబోయే అభ్యర్థుల వివరాలను ప్రకటించాయ్ పార్టీలు. ఇక ఆయా అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీలోని కీలక నేతలందరూ కూడా ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.


 అయితే ఇప్పటికే అటు కారు పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. కేకే, కడియం లాంటి కీలక నేతలందరినీ కూడా ఇప్పటికే హస్తం గూటికి చేర్చుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే మరి కొంతమంది నేతలు కూడా ఇలా హస్తం పార్టీలో చేరెందుకు సంప్రదింపులు జరుపుతున్నారని అటు తెలంగాణ రాజకీయాలలో చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి పరిణామాల మధ్య అటు బిఆర్ఎస్ నేతలు అందరూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏకంగా రేవంత్ కాంగ్రెస్ పార్టీని వదిలి బిఆర్ఎస్ లో చేరబోతున్నారు అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు.



 అయితే ఇటీవల జూబ్లీహిల్స్ లో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఉంది అంటూ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కాం లో కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం అన్యాయమని రాహుల్ అంటాడు. రేవంత్ మాత్రం కవితమ్మ అరెస్టు కరెక్టే అంటాడు. రేవంత్ అసలు ఎవరి కోసం పని చేస్తున్నాడు  మోడీ కోసమా.. లేకపోతే రాహుల్ కోసమా.. మైనారిటీలు కాంగ్రెస్ కోసం వేసే ఒక్కో ఓటు బిజెపికి వెళ్తుంది అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>