PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan797869ae-ec07-4b1d-84ab-d33f55f7423a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan797869ae-ec07-4b1d-84ab-d33f55f7423a-415x250-IndiaHerald.jpg•మళ్ళీ జోరు పెంచిన పవన్ •రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ గట్టిగానే ప్లాన్ చేసిన పవన్ •కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ పై మాయని మచ్చ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి విడత ప్రచారం అంత దూకుడుగా అయితే సాగలేదు. ఆయనకు జ్వరం రావడం అనారోగ్య ఇబ్బందులు తలెత్తడంతో అనకాపల్లి తెనాలి వంటి చోట్ల మాత్రమే ఆయన ప్రచారం చేశారు.ఈ మధ్యలో చంద్రబాబుతో కలసి ఉమ్మడిగా గోదావరి క్రిష్ణా జిల్లాలలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేపట్టారు.ఇపుడు పవన్ మళ్ళీ తన జోరు పెంచుతున్నారు. లేటెస్ట్ గా పవన్ ప్రచారానికి సంబంధించి జనసేన రూPawan Kalyan{#}Anakapalle;Narendra Modi;kalyan;Godavari River;Pawan Kalyan;Janasena;Prime Minister;Andhra Pradesh;TDP;Party;YCPకూటమి కష్టాలు: జోరు పెంచిన పవన్! కానీ ఏం లాభం?కూటమి కష్టాలు: జోరు పెంచిన పవన్! కానీ ఏం లాభం?Pawan Kalyan{#}Anakapalle;Narendra Modi;kalyan;Godavari River;Pawan Kalyan;Janasena;Prime Minister;Andhra Pradesh;TDP;Party;YCPFri, 19 Apr 2024 10:13:29 GMT•రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ గట్టిగానే ప్లాన్ చేసిన పవన్
•కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ పై మాయని మచ్చ


జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి విడత ప్రచారం అంత దూకుడుగా అయితే సాగలేదు. ఆయనకు జ్వరం రావడం అనారోగ్య ఇబ్బందులు తలెత్తడంతో అనకాపల్లి తెనాలి వంటి చోట్ల మాత్రమే ఆయన ప్రచారం చేశారు.ఈ మధ్యలో చంద్రబాబుతో కలసి ఉమ్మడిగా గోదావరి క్రిష్ణా జిల్లాలలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేపట్టారు.ఇపుడు పవన్ మళ్ళీ తన జోరు పెంచుతున్నారు. లేటెస్ట్ గా పవన్ ప్రచారానికి సంబంధించి జనసేన రూట్ మ్యాప్ ని సిద్ధం చేసింది. దాని ప్రకారం చూస్తే  పవన్‌ కల్యాణ్‌ రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ గట్టిగానే ఉండబోతోంది అని తెలుస్తుంది.ఈ నెల 20వ తేదీ నుంచి వరుసగా పర్యటనలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని అంటున్నారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ రోజుకి రెండుకు తక్కువ లేకుండా ప్రచార సభలలో పాలుపంచుకుంటారు అని అంటున్నారు. ఈ ప్రచారం కూడా జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లో కూడా పవన్‌ ప్రచారం పెద్ద ఎత్తున చేస్తారని అంటున్నారు.ఇంకా అదే విధంగా ఇదే నెలలో ఆంధ్రప్రదేశ్ కి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలలో కూడా జనసేనాని పవన్‌ పాల్గొంటారని అంటున్నారు. ఇంకా అలాగే మధ్య మధ్యలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి మరి కొన్ని సభలలో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొంటారని జనసేన పార్టీ వర్గాలు తెలియచేస్తున్నాయి.నామినేషన్ల పర్వం  మొదలైంది.


 ఇప్పటి వరకు ప్రచారం ఒక ఎత్తు. ఇక నుంచి మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుంది. రానున్న కొద్ది రోజులు చాలా ముఖ్యమైనవి. అందుకే అభ్యర్థుల నామినేషన్లు ఒక వైపు జోరుగా సాగుతూంటే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కూడా మరో వైపు స్పీడెక్కించనున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జోరు పెంచినా కూడా ఏం లాభం లేదు. కూటమిలో భాగమైన జనసేన ఇప్పుడు జనాలకు చీప్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ కోసం కష్టపడిన వారికి టిక్కెట్లు ఇవ్వకుండా తన పార్టీలో కలిసిన టీడీపీ, బీజేపీ, వైసీపీ అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చారు. ఈ విషయంలో జనసేన నేతలు పవన్ పై అసహనం వ్యక్తం చేసి పార్టీ నుంచి కూడా తప్పుకున్నారు. ఈ విషయం కారణంగా పవన్ కళ్యాణ్ చాలా బ్యాడ్ అయిపోయారు. తన వెన్నంటే పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేసారంటూ విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి కూడా.  ఇలాంటి పరిణామాల నడుమ పవన్ ఎన్నికల ప్రచారానికి జోరు పెంచినా ఎలాంటి లాభం ఉండదని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>