PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dhone-politics-kotla-vijaibasker-reddy5a6ecb67-c678-4185-9ce9-06e4c3faec72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dhone-politics-kotla-vijaibasker-reddy5a6ecb67-c678-4185-9ce9-06e4c3faec72-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో నేతలకు అసమ్మతులు సైతం రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కొంతమంది నేతలు కక్కలేక మింగలేక అలాగే తమ పార్టీలలో ఉంటూ ముందుకు వెళ్తున్నారు. మరికొందరు ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. తాజాగా కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి టిడిపి పార్టీ నుంచి కర్నూలు జిల్లా డోన్ నియోజవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. గతంలో ఈయన కర్నూలు పార్లమెంటు నుంచి పోటీ చేశారు.. కానీ ఈసారి మాత్రం టిడిపి పార్టీ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగబోతున్నారు. దీంతో ఆయన ఒక్కసారిగా మనస్థాపం చెందుతూ తనకు ఇష్టం లేDHONE;POLITICS;KOTLA VIJAIBASKER REDDY{#}Kurnool;Kotla Jayasurya Prakasha Reddy;central government;Ishtam;Telugu Desam Party;Andhra Pradesh;TDP;Father;Assembly;Reddy;Congress;Partyరాయలసీమ: గత్యంతరం లేక టిడిపిలో చేరా.. మాజీ మంత్రి కంటతడి..!రాయలసీమ: గత్యంతరం లేక టిడిపిలో చేరా.. మాజీ మంత్రి కంటతడి..!DHONE;POLITICS;KOTLA VIJAIBASKER REDDY{#}Kurnool;Kotla Jayasurya Prakasha Reddy;central government;Ishtam;Telugu Desam Party;Andhra Pradesh;TDP;Father;Assembly;Reddy;Congress;PartyFri, 19 Apr 2024 07:20:00 GMTఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో నేతలకు అసమ్మతులు సైతం రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కొంతమంది నేతలు కక్కలేక మింగలేక అలాగే తమ పార్టీలలో ఉంటూ ముందుకు వెళ్తున్నారు. మరికొందరు ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. తాజాగా కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి టిడిపి పార్టీ నుంచి కర్నూలు జిల్లా డోన్ నియోజవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. గతంలో ఈయన కర్నూలు పార్లమెంటు నుంచి పోటీ చేశారు.. కానీ ఈసారి మాత్రం టిడిపి పార్టీ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగబోతున్నారు.


దీంతో ఆయన ఒక్కసారిగా మనస్థాపం చెందుతూ తనకు ఇష్టం లేక పోయిన డోన్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నానంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. కర్నూలు జిల్లాలోని జరిగిన ఒక బహిరంగ సభలో సూర్య ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.. కర్నూలు పార్లమెంటు వదిలి రావడం చాలా బాధగా ఉందంటూ తెలియజేశారు.. ఒక్కసారిగా  ప్రసంగం మధ్యలో ఆపేసి మరి కూర్చొని గత్యాంత్రం  లేక కాంగ్రెస్ పార్టీని వదిలి టిడిపిలోకి చేరానంటూ తెలియజేశారు.. అయితే ఇక మీదట తాను మాత్రం తెలుగుదేశం పార్టీలోనే ఉండిపోతాను అంటూ తెలియజేశారు.


తనకు ఇష్టం లేకపోయినా డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానంటూ కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ లో కూడా పనిచేశారు . ముఖ్యంగా ఈయన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా ఏపీ ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎంపికయ్యారు.. అలాగే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. కేంద్ర మంత్రిగా ,మంత్రిగా కూడా పనిచేశారు. తండ్రి వారసత్వంగ కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు.. కర్నూల్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఎన్నికలలో డోన్ అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలులో నిర్వహించినటువంటి ఒక సభలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇలా మాట్లాడడం జరిగింది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>