MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg70 సంవత్సరాల వయసులో రజనీకాంత్ ఏమాత్రం అలిసిపోకుండా వరసపెట్టి చేస్తున్న సినిమాల లిస్టు చూస్తూ ఉంటే ఎవరైనా షాక్ అవ్వడం సహజం. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వాలని రజనీకాంత్ కోరిక నెరవేరనప్పటికీ మరింత రెట్టింపు ఉత్సాహంతో చేస్తున్న వరసపెట్టి సినిమాల లిస్టును చూస్తుంటే ఎవరైనా షాక్ అవుతారు. ప్రస్తుతం రజనీకాంత్ జ్ఞానవేలు దర్శకత్వంలో తన 170వ సినిమా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమా షూటింగ్ పూర్తి కాకుండానే రజనీకాంత్ లోకేష్ కనకారాజ్ దర్శకత్వంలో మరో థ్రిల్లర్ మూవీని చేయడానికి రెSHRUTHI HASSAN{#}Shruti Haasan;Lokesh;Lokesh Kanagaraj;INTERNATIONAL;Thriller;Darsakudu;Cinema;Tamilnadu;Party;politics;Telugu;Directorశృతిహాసన్ సహకారంతో రజనీకాంత్ మ్యానియా !శృతిహాసన్ సహకారంతో రజనీకాంత్ మ్యానియా !SHRUTHI HASSAN{#}Shruti Haasan;Lokesh;Lokesh Kanagaraj;INTERNATIONAL;Thriller;Darsakudu;Cinema;Tamilnadu;Party;politics;Telugu;DirectorThu, 18 Apr 2024 10:00:00 GMT70 సంవత్సరాల వయసులో రజనీకాంత్ ఏమాత్రం అలిసిపోకుండా వరసపెట్టి చేస్తున్న సినిమాల లిస్టు చూస్తూ ఉంటే ఎవరైనా షాక్ అవ్వడం సహజం. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వాలని రజనీకాంత్ కోరిక నెరవేరనప్పటికీ మరింత రెట్టింపు ఉత్సాహంతో చేస్తున్న వరసపెట్టి సినిమాల లిస్టును చూస్తుంటే ఎవరైనా షాక్ అవుతారు.



ప్రస్తుతం రజనీకాంత్ జ్ఞానవేలు దర్శకత్వంలో తన 170వ సినిమా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమా షూటింగ్ పూర్తి కాకుండానే రజనీకాంత్ లోకేష్ కనకారాజ్ దర్శకత్వంలో మరో థ్రిల్లర్ మూవీని చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈమూవీలో రజనీకాంత్ కూతురుగా శృతిహాసన్ ఒక కీలక పాత్రలో నటించబోతోంది. కమాలహాస్యం రజనీకాంత్ లు కలిసి సినిమా చేసి దరిదాపు 30 సంవత్సరాలు దాటి పోయింది.



డీనితో అభిమానులు కమల్ రజనీకాంత్ లను ఒక మల్టీ స్టారర్ లో కలిసి నటించమని ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే ఆకోరిక తీరకుండానే కమలహాసన్ కూతురు రజనీ కూతురుగా నటిస్తూ ఉండటం ఈఇద్దరి టాప్ హీరోల అభిమానులకు పెద్ద పండుగగా మారింది. ఈమూవీని అత్యంత వేగంగా పూర్తిచేసి వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదలచేయాలని దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఆలోచన అని అంటున్నారు.



రజనీకాంత్ శృతిహాసన్ ను తన కూతురుతో సమానంగా అభిమానిస్తాడు. దీనితో ఈకాంబినేషన్ పై విపరీతమైన క్రేజ్ ఈమూవీ ప్రారంభం అవ్వకుండానే ఏర్పడింది. ఈమూవీలో రజనీకాంత్ అంతర్జాతీయ బంగారం స్మగ్లర్ గా ఒక నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో నాటిస్తాడాని లీకులు వస్తున్నాయి. రాజకీయాలు తనకు సరిపడవు అన్న భావనతో రజనీ పూర్తిగా తన దృష్టి అంతా సినిమాల పైనే పెడుతున్నాడు. ‘జైలర్’ సూపర్ సక్సస్ కావడంతో మీడియం రేంజ్ టౌన్ లలో కూడ రజనీకాంత్ పట్ల మ్యానియా విపరీతంగా పెరిగి పోయింది. తాను నటిస్తున్న ప్రతి సినిమాకు 100 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్న ఈ టాప్ హీరోకు కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దక్షిణాది యావత్తు రజనీకి అభిమానులు ఉన్నారు..  








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>