PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/naidu-vs-ysrcp-capital-clashda83d38d-8711-48f1-8b15-b950792d0b2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/naidu-vs-ysrcp-capital-clashda83d38d-8711-48f1-8b15-b950792d0b2a-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ ప్రముఖ సంస్థలు సర్వేలను నిర్వహిస్తుండగా తాజాగా రేస్ సంస్థ మరోసారి సర్వే చేసి ఫలితాలను వెల్లడించింది. రేస్ సర్వే ఫలితాలలో కుప్పంలో చంద్రబాబుకు, పిఠాపురంలో పవన్ కు ఓటమి తప్పదని వెల్లడైంది. తెలంగాణలో ఈ సంస్థ ప్రకటించిన ఫలితాలు దాదాపుగా నిజమైన నేపథ్యంలో ఏపీలో కూడా తమ సంస్థ ఫలితాలు నిజమవుతాయని ఈ సంస్థ భావిస్తోంది. chandrababu naidu{#}Govinda;Telugu Desam Party;Survey;TDP;YCP;Bharatiya Janata Partyకుప్పంలో బాబోరికి ఓటమి.. రేస్ తాజా ఫలితాలు నిజమైతే టీడీపీకి చుక్కలే!కుప్పంలో బాబోరికి ఓటమి.. రేస్ తాజా ఫలితాలు నిజమైతే టీడీపీకి చుక్కలే!chandrababu naidu{#}Govinda;Telugu Desam Party;Survey;TDP;YCP;Bharatiya Janata PartyThu, 18 Apr 2024 11:05:00 GMTఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ ప్రముఖ సంస్థలు సర్వేలను నిర్వహిస్తుండగా తాజాగా రేస్ సంస్థ మరోసారి సర్వే చేసి ఫలితాలను వెల్లడించింది. రేస్ సర్వే ఫలితాలలో కుప్పంలో చంద్రబాబుకు, పిఠాపురంలో పవన్ కు ఓటమి తప్పదని వెల్లడైంది. తెలంగాణలో ఈ సంస్థ ప్రకటించిన ఫలితాలు దాదాపుగా నిజమైన నేపథ్యంలో ఏపీలో కూడా తమ సంస్థ ఫలితాలు నిజమవుతాయని ఈ సంస్థ భావిస్తోంది.
 
మంగళగిరి, హిందూపురంలలో మాత్రం టీడీపీకి అనుకూల ఫలితాలు వస్తాయని ఈ సంస్థ ఫీలవుతోంది. గతంతో పోల్చి చూస్తే వైసీపీ ఓటు షేర్ పెరిగిందని ఏపీలో వైసీపీకి 50.8 శాతం ఓటు షేర్ ఉందని ఈ సంస్థ చెబుతోంది. గతంలో చేసిన సర్వేలతో పోల్చి చూస్తే కూటమి ఓటు షేర్ మాత్రం తగ్గిందని ఈ సంస్థ వెల్లడిస్తోంది. సీట్ల విషయానికి వస్తే 132 నుంచి 138 స్థానాలలో వైసీపీ విజయం సాధిస్తుందని ఈ సంస్థ చెబుతోంది.
 
కూటమి విషయానికి వస్తే 37 నుంచి 42 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. రేస్ సర్వే ఫలితాలు నిజమైతే మాత్రం తెలుగుదేశం పార్టీకి చుక్కలే అని వైసీపీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మెజారిటీ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఫలితాలను వెల్లడిస్తుండగా కొన్ని సర్వేలు మాత్రం కూటమిదే విజయమని చెబుతుండటం గమనార్హం.
 
మరోవైపు నేటి నుంచి ఏపీలో నామినేషన్ల పర్వం మొదలైంది. కూటమికి ఓటేస్తే ముస్లిం రిజర్వేషన్లు గోవింద అంటూ వైసీపీ  ప్రచారం చేసుకుంటోంది. మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ చేస్తున్న ప్రకటనను వైసీపీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కూటమికి చేటు చేసే ఏ అవకాశాన్ని వైసీపీ నేతలు వదులుకోవడం లేదు. ముస్లిం ఓటర్ల ఓట్లు కూటమికి పడతాయో లేదో చూడాల్సి ఉంది. ఎన్నికల ముంగిట బాబుకు వ్యతిరేకంగా వస్తున్న ఫలితాలు టీడీపీ నేతలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>