HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips23fd2efd-9d14-4549-8649-678fdf0fb4c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips23fd2efd-9d14-4549-8649-678fdf0fb4c7-415x250-IndiaHerald.jpgబొప్పాయిలో ఉండే విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఈ మూలకాలు చర్మ కణాలను పోషించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయి. అలాగే బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, మొటిమలు, ముడతలు వంటివి చాలా వరకు అదుపులో ఉంటాయి.బొప్పాయి తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉండే పండు. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మీరు తక్కువ తినేలా చేయడంతోపాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.బొప్పాయిలో విటHealth Tips{#}Vitamin C;Vitamin;Sugarఖాళీ కడుపుతో ఈ పండు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు?ఖాళీ కడుపుతో ఈ పండు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు?Health Tips{#}Vitamin C;Vitamin;SugarThu, 18 Apr 2024 18:26:29 GMTబొప్పాయిలో ఉండే విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఈ మూలకాలు చర్మ కణాలను పోషించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయి. అలాగే బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, మొటిమలు, ముడతలు వంటివి చాలా వరకు అదుపులో ఉంటాయి.బొప్పాయి తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉండే పండు. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మీరు తక్కువ తినేలా చేయడంతోపాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం ద్వారా, విటమిన్ సి నేరుగా రక్తప్రవాహంలోకి చేరుతుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి శక్తిని ఇస్తుంది.బొప్పాయి ఒక సహజమైన డిటాక్సిఫైయింగ్ ఏజెంట్.. ఇందులో ఉండే ఫైబర్, విటమిన్ సి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ మొత్తాన్ని తగ్గిస్తుంది.. మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.


బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. దీని కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం ద్వారా, ఈ ఎంజైమ్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.. దీంతో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది.బొప్పాయి తినడానికి రుచిగా ఉండటమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.. మీరు బొప్పాయిని మీ ఆహారంలో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు. అయితే ఉదయం వేళ ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.అయితే షుగర్ పేషెంట్స్ మాత్రం ఖాళీ కడుపుతో బొప్పాయిని తినకూడదు.లేదంటే ఖచ్చితంగా ముప్పు తప్పదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>