SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shivam-dubeca5c0dbb-fb66-41ef-9e98-618cd605da5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shivam-dubeca5c0dbb-fb66-41ef-9e98-618cd605da5c-415x250-IndiaHerald.jpgఇక ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వెంటనే.. యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే వచ్చే మే నెల మొదటి వారంలో మెగా టోర్నమెంట్‌కు టీమిండియా ప్రాబబుల్స్‌ను సెలెక్ట్ చేయనుంది బీసీసీఐ.ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్.. ప్రపంచకప్ జట్టులో ఫినిషర్ పాత్ర పోషిస్తాడని అందరూ కూడా భావించారు. అయితే ఇప్పుడు అది చాలా కష్టంగా కనిపిస్తోంది.జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికాలలో టీ20 ప్రపంచకప్ 2024 స్టార్ట్ కానుంది. ఈ ప్రపంచకప్ కోసం, మొత్తం 20 జట్లు మే 1 వ తేదీ నాటికShivam Dube{#}Shivam Dube;West Indies;BCCI;Hardik Pandya;ICC T20;News;Chennaiశివమ్ దూబే: ఆట అదుర్స్.. సెలెక్టర్లు ఇంప్రెస్?శివమ్ దూబే: ఆట అదుర్స్.. సెలెక్టర్లు ఇంప్రెస్?Shivam Dube{#}Shivam Dube;West Indies;BCCI;Hardik Pandya;ICC T20;News;ChennaiThu, 18 Apr 2024 14:21:00 GMTఇక ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వెంటనే.. యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే వచ్చే మే నెల మొదటి వారంలో మెగా టోర్నమెంట్‌కు టీమిండియా ప్రాబబుల్స్‌ను సెలెక్ట్ చేయనుంది బీసీసీఐ.ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్.. ప్రపంచకప్ జట్టులో ఫినిషర్ పాత్ర పోషిస్తాడని అందరూ కూడా భావించారు. అయితే ఇప్పుడు అది చాలా కష్టంగా కనిపిస్తోంది.జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికాలలో టీ20 ప్రపంచకప్ 2024 స్టార్ట్ కానుంది. ఈ ప్రపంచకప్ కోసం, మొత్తం 20 జట్లు మే 1 వ తేదీ నాటికి తమ జట్టులను ప్రకటించి, ఐసీసీకి లిస్టులు పంపనున్నాయి. ఆ తర్వాత అవసరమైతే టీంలలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే మే 1 వ తేదీన పంపే స్క్వాడ్‌లు దాదాపుగా ఫైనల్ అని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో టీమిండియా జట్టుకు ఫినిషర్ పాత్ర రింకూ సింగ్ పోషిస్తాడని అందరూ అనుకున్నారు.


అయితే ఇప్పుడు కొత్త ఆల్‌రౌండర్ వచ్చేశాడు. ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ 20 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసిందని సమాచారం తెలిసింది. అందులో నుంచి 15 మంది ప్రాబబుల్స్‌తో కూడిన జట్టును రెడీ చేస్తోందట బోర్డు. ఇక జట్టులో ఫినిషర్ రోల్ అనేది ఖచ్చితంగా చాలా ముఖ్యం. ఆల్‌రౌండర్ స్థానంలో హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్నా కానీ అతడికి బ్యాకప్‌గా శివమ్ దూబేను తీసుకోవాలని సెలెక్టర్లు చూస్తున్నారట.ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున శివమ్ దూబే నిలకడైన ఆటతీరుతో బాగా అదరగొడుతున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై అతడి దూకుడైన బ్యాటింగ్.. వెస్టిండీస్ పిచ్‌లపై సరిగ్గా సరిపోతుందని సెలెక్టర్ల అంచనా వేస్తున్నారు. శివమ్ దూబే ఇప్పటి దాకా 6 ఇన్నింగ్స్‌లలో 163 స్ట్రైక్ రేట్‌తో 242 పరుగులు చేశాడు. ఇందులో 20 ఫోర్లు ఇంకా 15 సిక్సర్లు ఉన్నాయి. అలాగే మరోవైపు రింకూ సింగ్‌కు సరైన అవకాశాలు రావట్లేదు. కేవలం 5 ఇన్నింగ్స్‌లో 51 బంతులని ఎదుర్కుని 83 పరుగులు మాత్రమే చేశాడు రింకూ.. ఇందులో కేవలం 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>