PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pulivendula-politics-2024-jagan-ravi7e5b1d9d-56f0-45cf-bc2b-214d66c13817-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pulivendula-politics-2024-jagan-ravi7e5b1d9d-56f0-45cf-bc2b-214d66c13817-415x250-IndiaHerald.jpg• వైసీపీ కంచుకోట పులివెందులలో టీడీపీ తట్టుకోగలదా •గెలవకపోయినా ప్రధాన లక్ష్యం అదే అంటున్న బీటెక్ రవి •హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్న జగన్ (రాయలసీమ: పులివెందుల - ఇండియా హెరాల్డ్) ఫ్యాక్షన్ గడ్డ కడప వైసీపీ కంచుకోట అన్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో సీఎం జగన్ 90 వేల ఓట్ల భారీ మెజారిటీగా ఏ.వి.సతీష్ కుమార్ రెడ్డి పై విజయం సాధించారు. ఇక్కడ 1978 నుంచి వైఎస్ కుటుంబమే గెలుస్తూ వస్తోంది. రెడ్డి , బలిజ ఓటర్లు ఈ నియోజPULIVENDULA;POLITICS;2024;JAGAN;RAVI{#}dr rajasekhar;Balija;Pulivendula;ravi anchor;Kollu Ravindra;Kumaar;sathish;India;devineni avinash;Y S Vivekananda Reddy;Jagan;Hanu Raghavapudi;kadapa;Sharmila;Telangana Chief Minister;CM;politics;Reddy;Telugu Desam Party;TDP;YCP;Partyరాయలసీమ (పులివెందుల): జగన్ Vs రవి.. ఫ్యాక్షన్ గడ్డపై గెలుపెవరిది?రాయలసీమ (పులివెందుల): జగన్ Vs రవి.. ఫ్యాక్షన్ గడ్డపై గెలుపెవరిది?PULIVENDULA;POLITICS;2024;JAGAN;RAVI{#}dr rajasekhar;Balija;Pulivendula;ravi anchor;Kollu Ravindra;Kumaar;sathish;India;devineni avinash;Y S Vivekananda Reddy;Jagan;Hanu Raghavapudi;kadapa;Sharmila;Telangana Chief Minister;CM;politics;Reddy;Telugu Desam Party;TDP;YCP;PartyThu, 18 Apr 2024 11:32:45 GMT వైసీపీ కంచుకోట పులివెందులలో టీడీపీ తట్టుకోగలదా

•గెలవకపోయినా ప్రధాన లక్ష్యం అదే అంటున్న బీటెక్ రవి

•హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్న జగన్





(రాయలసీమ: పులివెందుల - ఇండియా హెరాల్డ్)

ఫ్యాక్షన్ గడ్డ కడప వైసీపీ కంచుకోట అన్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో సీఎం జగన్ 90 వేల ఓట్ల భారీ మెజారిటీగా ఏ.వి.సతీష్ కుమార్ రెడ్డి పై విజయం సాధించారు. ఇక్కడ 1978 నుంచి వైఎస్ కుటుంబమే గెలుస్తూ వస్తోంది. రెడ్డి , బలిజ ఓటర్లు ఈ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. రెడ్డి డామినేషన్ నియోజకవర్గం ఏదంటే పులివెందులనే చెబుతారు. ఇక ఇప్పుడు 2024 ఎన్నికల్లో భాగంగా ఈసారి టిడిపి నుంచి బీటెక్ రవి.. జగన్ ను ఢీకొట్టబోతున్నారు. ఇక్కడ అభివృద్ధి బాగానే జరిగిందనేది స్థానికుల మాట.


ఇక్కడ జగన్ గెలుపు తప్ప ఓటమి ఊసే లేదు. అయితే ఇప్పుడు స్వయంగా సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తూ.. అన్నకు ఎదురు తిరగడంతో పులివెందులలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. వైయస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత  వైయస్ కుటుంబంలో చీలికలు ఏర్పడడంతో రాజకీయాలలో కూడా ఈ విషయం సంచలనంగా మారింది. ఈ అంశాలన్నీ జగన్ మెజారిటీ పై ప్రభావం చూపినా.. గెలుపును మాత్రం అడ్డుకోలేరని విశ్లేషకులు చెబుతున్నారు.

వైయస్సార్ ఫ్యామిలీకి కంచుకోటగా మారిన పులివెందులలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తున్నారు..పైగా  వైయస్ రాజశేఖర్ రెడ్డి గెలుపొందడం.. ఆయన మరణం తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికలలో ఆయన సతీమణి వైయస్ విజయమ్మ గెలుపొందారు.. ఆ తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. ఇక ఇప్పుడు 2024 ఎన్నికల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఈయనకు పోటీగా ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్ర టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. 2019 ఎన్నికల్లో భాగంగా సతీష్ రెడ్డి టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు కానీ ఆయన ఇప్పుడు వైసీపీలోకి చేరిపోవడం పులివెందులలో అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు పులివెందుల రాజకీయం అత్యంత సంచలనంగా మారుతోంది. 2014, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు గతంలో కంటే ఈసారి మెజార్టీ ఎక్కువగా ఉంటుందని వైయస్సార్సీపి లెక్కలేసుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న ఈయన పులివెందులలో ప్రచారం చేస్తున్నది తక్కువే అయినప్పటికీ వై ఎస్ కుటుంబానికి అక్కడున్న ప్రజల ఆదరనే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా మారుతోంది. అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఎలాగైనా సరే వైఎస్ఆర్సిపిని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తామంటూ .. ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ఓడిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ వాతావరణం పూర్తిస్థాయిలో జగన్ కి అనుకూలంగా కనిపిస్తుంది. వైయస్ కుటుంబానికి ఎదురులేని నియోజకవర్గంగా ఉన్న పులివెందుల లో జగన్మోహన్ రెడ్డి స్పీడ్ కు బ్రేకులు వేయడం అంతా తేలికైన పని కాదు అని స్పష్టం అవుతోంది. ఏదేమైనా గట్టి పోటీ ఇచ్చి మెజార్టీని తగ్గించడమే ధ్యేయంగా టిడిపి అభ్యర్థి బరిలోకి దిగారు. మరి ఫ్యాక్షన్ గడ్డపై గెలుపు ఎవరిదో తెలియాలంటే పూర్తి ఫలితాలు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>