Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl8ed2f89e-a1e8-4776-aaad-b72f2d73b234-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl8ed2f89e-a1e8-4776-aaad-b72f2d73b234-415x250-IndiaHerald.jpgరాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 2024 ఐపీఎల్ సీజన్ కూడా దురదృష్టం వెంటాడుతుంది. ఆ జట్టు ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఓటమిపాలు అవుతూ అభిమానులు అందరినీ కూడా నిరాశ పరుస్తుంది. ఈ క్రమంలోనే ఇక బెంగుళూరు జట్టు ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే జట్టుకు కెప్టెన్ గా ఫ్యాబ్ డూప్లెసిస్ మారినప్పటికీ ఆ టీం కి అదృష్టం అసలు కలిసి రావడం లేదు. ఇప్పటివరకు ఐపీఎల్లో ఆరు మ్యాచ్లు ఆడిన బెంగళూరు టీం కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరన కొనసాగుతోంది. దీంతో టైటిIplఆడలేకపోతున్నా.. ఇక నావల్ల కాదు.. చేతులెత్తేసిన మ్యాక్సీ?ఆడలేకపోతున్నా.. ఇక నావల్ల కాదు.. చేతులెత్తేసిన మ్యాక్సీ?IplWed, 17 Apr 2024 09:23:00 GMTరాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 2024 ఐపీఎల్ సీజన్ కూడా దురదృష్టం వెంటాడుతుంది. ఆ జట్టు ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఓటమిపాలు అవుతూ అభిమానులు అందరినీ కూడా నిరాశ పరుస్తుంది. ఈ క్రమంలోనే ఇక బెంగుళూరు జట్టు ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే జట్టుకు కెప్టెన్ గా ఫ్యాబ్ డూప్లెసిస్ మారినప్పటికీ ఆ టీం కి అదృష్టం అసలు కలిసి రావడం లేదు. ఇప్పటివరకు ఐపీఎల్లో ఆరు మ్యాచ్లు ఆడిన బెంగళూరు టీం కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరన కొనసాగుతోంది.



 దీంతో టైటిల్ వేటలో ఎంతగానో వెనుకబడిపోయింది. అయితే కనీసం ప్లే ఆఫ్ లో అయినా అడుగుపెడుతుందా లేదా అనే విషయంపై కూడా ప్రస్తుతం అనుమానాలు నెలకొన్నాయ్ అని చెప్పాలి. అయితే ఆ జట్టులో ఉన్న స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ ప్రతి మ్యాచ్లో కూడా విఫలమవుతూ ఉండటం టీం కి ఎంత మైనస్ గా మారిపోయింది. అయితే అతను క్రిజ్ లో కుదురుకుంటే సృష్టించే విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్లో కూడా మంచి ప్రదర్శన చేయడం లేదు. మరీ ముఖ్యంగా పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్ అవుతూ పెవీలియన్  చేరుతున్నాడు.


 దీంతో మ్యాక్స్ వెల్ ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూ ఉండగా.. ఇక ఇప్పుడు కోట్లు పెట్టి తీసుకున్న ఈ ప్లేయర్ చివరికి చేతులెత్తేసాడు అన్నది తెలుస్తుంది. ఆర్సిబి అతని కోసం 11 కోట్ల రూపాయలు పెట్టగా చివరికి ఆడటం తన వల్ల కాదు అని చేతులెత్తేసాడట. తనకు కొంత బ్రేక్ కావాలని కెప్టెన్, కోచ్ లకు చెప్పాడట. ఈ క్రమంలోనే మాక్స్ వెల్ ను సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ కి పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఆశించినంత ఆడ లేకపోతూ ఉండటంతో అతనికి బ్రేక్ ఇవ్వాలని ఇలా యాజమాన్యాన్ని కోరాడట. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి తనకు ఎదురైందని.. కొంత విరామం తీసుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చి తిరిగి జట్టులో చేరుతానని మాక్స్ వెల్ చెప్పాడట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>