PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pittapuram-pavan-kalyanc352c7ab-566e-4a5f-bf39-51c198abaffb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pittapuram-pavan-kalyanc352c7ab-566e-4a5f-bf39-51c198abaffb-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ టీడీపీ, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అందుకే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ పవన్ కళ్యాణ్ కి బాగా సపోర్ట్ అందిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఆయనే బాగా పనిచేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. వైసీపీ నాయకుల ప్రకారం పవన్ కళ్యాణ్ కంటే వర్మనే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ ప్రచారాలు సాగిస్తున్నారు. పిఠాపురంలో లక్ష ఓట్ల మెజారిటీతో తాను గెలుస్తాననిpittapuram pavan kalyan{#}advertisement;Vijayawada;kalyan;Janasena;Ram Gopal Varma;YCP;TDP;District;Party;MLAఏపీ: పిఠాపురంలో గెలిచేదెవరు.. వైసీపీ మాజీ నేత సంచలన కామెంట్స్..??ఏపీ: పిఠాపురంలో గెలిచేదెవరు.. వైసీపీ మాజీ నేత సంచలన కామెంట్స్..??pittapuram pavan kalyan{#}advertisement;Vijayawada;kalyan;Janasena;Ram Gopal Varma;YCP;TDP;District;Party;MLAWed, 17 Apr 2024 20:12:06 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ టీడీపీ, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అందుకే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ పవన్ కళ్యాణ్ కి బాగా సపోర్ట్ అందిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఆయనే బాగా పనిచేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. వైసీపీ నాయకుల ప్రకారం పవన్ కళ్యాణ్ కంటే వర్మనే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ ప్రచారాలు సాగిస్తున్నారు. పిఠాపురంలో లక్ష ఓట్ల మెజారిటీతో తాను గెలుస్తానని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటనలు చేస్తున్నారు కానీ దానికి తగినట్లుగా ఆయన నియోజకవర్గంలో పనిచేయడం లేదని వైసీపీ నాయకులు కామెంట్లు చేస్తున్నారు.

ఎవరు ఎంత పని చేసినా సరే వైసీపీ 175 స్థానాలకు గాను 175 స్థానాల్లో గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వైసీపీ నేత పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. నిజానికి మహేష్ ఇంతకుముందు జనసేన పార్టీలో ఉండేవారు. జనసేన అధిష్టానం తనకు విజయవాడ వెస్ట్ స్థానానికి గాను ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందేమో అని ఆశించారు కానీ అతనికి నిరాశే ఎదురయింది. దీనివల్ల వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచి పవన్ ని ఏకిపారేస్తున్నారు.

ఇటీవల మీడియాతో సంభాషించిన ఆయన పవన్ కళ్యాణ్ కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి కేవలం ఆరు సినిమాలే చేశారని, అందులో కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయని, వాటి నుంచి ఆయన ఎంత సంపాదించాడో చెప్పాలని మహేష్ సూటిగా ప్రశ్నించారు. ఆ సమయం నుంచి సినిమాల నుంచి సంపాదించిన సొమ్ము ఎంత, ఆయన పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టాడు? వంటి వివరాలను బయట పెట్టాలని సవాలు విసిరారు. తనకు ఆ వివరాలు తెలుసు అని వాటిని బయట పెడతానని కూడా సంచలన కామెంట్లు చేశారు. మహేష్ చేసిన కామెంట్స్ జనసేన పార్టీలో పెద్ద ప్రకంపనలు సృష్టించాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>