Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl11feb969-cdd4-40e6-9c64-9b9e9c594543-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl11feb969-cdd4-40e6-9c64-9b9e9c594543-415x250-IndiaHerald.jpgసాధారణంగా బ్యాటింగ్ చేయడానికి బరీలోకి దిగిన ప్రతి ఆటగాడికి కూడా సెంచరీస్ స్కోర్ చేయాలని ఆశ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలా శతకాన్ని బాధేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే అందరూ ఆటగాళ్లు ఇలా సెంచరీ చేయడం కోసమే బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పటికీ కొంతమంది విఫలమవుతూ ఉంటారు. ఇంకొంద మంది మాత్రం అనుకున్నది సాధిస్తూ ఉంటారు. మరి కొంతమంది బ్యాటింగ్ విధ్వంసాన్ని సృష్టించి సెంచరీ తో రికార్డులు కొల్లగొడుతూ ఉంటారు. ఇక ఇటీవల ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిIpl{#}Hyderabadఅందుకే సెంచరీని అలా సెలబ్రేట్ చేసుకున్నా : ట్రావిస్ హెడ్అందుకే సెంచరీని అలా సెలబ్రేట్ చేసుకున్నా : ట్రావిస్ హెడ్Ipl{#}HyderabadWed, 17 Apr 2024 17:30:00 GMTసాధారణంగా బ్యాటింగ్ చేయడానికి బరీలోకి దిగిన ప్రతి ఆటగాడికి కూడా సెంచరీస్ స్కోర్ చేయాలని ఆశ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలా శతకాన్ని బాధేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే అందరూ ఆటగాళ్లు ఇలా సెంచరీ చేయడం కోసమే బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పటికీ కొంతమంది విఫలమవుతూ ఉంటారు. ఇంకొంద మంది మాత్రం అనుకున్నది సాధిస్తూ ఉంటారు. మరి కొంతమంది బ్యాటింగ్ విధ్వంసాన్ని సృష్టించి సెంచరీ తో రికార్డులు కొల్లగొడుతూ ఉంటారు. ఇక ఇటీవల ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో కూడా ఇదే జరిగింది.


 సన్రైజర్స్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ విధ్వంసంతో సూపర్ సెంచరీ చేశాడు. కేవలం 39 బంతుల్లోనే  శతకం మార్క్ అందుకున్నాడు. దీన్నిబట్టి అతని బ్యాటింగ్ విధ్వంసం ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలా సెంచరీ చేసినప్పుడు ఆటగాళ్లు ఆనందంలో తమకు నచ్చిన విధంగా సెలబ్రేషన్స్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి సమయంలో కొంతమంది ఆటగాళ్లు చేస్తే సెలబ్రేషన్స్ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇటీవల ట్రావిస్ హెడ్ కూడా ఇలాగే కొత్తగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. బ్యాట్ చేతిలో పట్టుకొని బ్యాట్ హ్యాండిల్ పైన హెల్మెట్ పెట్టి సెలెబ్రేట్ చేసుకోవడం గమనార్హం.


 అయితే తాను ఇలా ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది అనే విషయంపై ఇటీవల ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్. రెండు రోజుల క్రితమే నేను కోచ్ వెటోరి వివిధ సెంచరీ సెలబ్రేషన్స్ పై జోకులు వేసుకున్నాం. ఆ చర్చను అనుసరిస్తూనే ఇక శతకం పూర్తయిన తర్వాత నేను సరదాగా అలాంటి సెలబ్రేషన్స్ చేసుకున్నాను. ఈ తరహ సెలబ్రేషన్స్ తో కోచ్ వెటోరికి అభివాదం చేశాను అంటూ హెడ్ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>