MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies398ad133-12c0-47fb-8936-d0065faa5ea7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies398ad133-12c0-47fb-8936-d0065faa5ea7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ సీనియర్ హీరోయిన్ ల క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఇప్పటికీ యువ హీరోయిన్ లకు పోటాపోటీగా సీనియర్ హీరోయిన్లు నటిస్తున్నారని చెప్పుకోవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ గ్లామర్ ను పెంచుకుంటూ మంచి మంచి అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ఇక, ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ కథలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండడంతో దర్శకులు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు.movies{#}Tollywood;Heroine;Yuva;Audience;Trisha Krishnan;nayantara;kajal aggarwal;marriage;June;anoushka;Anushka;Misterబిజీ బిజీగా సీనియర్ ముద్దుగుమ్మలుబిజీ బిజీగా సీనియర్ ముద్దుగుమ్మలుmovies{#}Tollywood;Heroine;Yuva;Audience;Trisha Krishnan;nayantara;kajal aggarwal;marriage;June;anoushka;Anushka;MisterWed, 17 Apr 2024 18:03:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ సీనియర్ హీరోయిన్ ల క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఇప్పటికీ యువ హీరోయిన్ లకు పోటాపోటీగా సీనియర్ హీరోయిన్లు నటిస్తున్నారని చెప్పుకోవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ గ్లామర్ ను పెంచుకుంటూ మంచి మంచి అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ఇక, ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ కథలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండడంతో దర్శకులు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆ పాత్రలకు సీనియర్ నటిమణులే సరిపోతారని భావిస్తున్నారు. దీంతో సీనియర్ హీరోయిన్ లకు డిమాండ్ పెరిగిపోతుంది. అలాగే సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీగా కూడా సీనియర్ హీరోయిన్ లనే ఎంపిక చేస్తున్నారు. ఏజ్ తో పాటు క్రేజ్ పెంచుకుంటున్న టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..

నటిగా 20 ఏళ్ల కింద కెరీర్ మొదలు పెట్టిన త్రిష ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీ ఎవరంటే ముందుగా త్రిష పేరే వినిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈమె ఐదు ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఇక లేడీ టైగర్ గా పేరు సాధించుకున్న నయనతార ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఈమె ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. నయనతార దర్శకుడు బాబి కాంబినేషన్ లో రూపొందుతున్న #NBK109లో నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

నటిగా సుదీర్ఘ ప్రయాణం కొనసాగించిన కాజల్ అగర్వాల్ తన పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మరోవైపు కమల్ హాసన్ సరసన ఆమె నటించిన 'భారతీయుడు 2' జూన్ లో రిలీజ్ కానుంది. 

మంచి కథలను ఎంపిక చేసుకొని ప్రేక్షకులను అలరించిన నటి అనుష్క శెట్టిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె గత ఏడాది 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం స్వీటీ మరో రెండు ప్రధాన చిత్రాల్లో నటించబోతున్నట్టు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>