MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithine5c95023-8a38-4106-9bb9-ac7e5ef7eb13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithine5c95023-8a38-4106-9bb9-ac7e5ef7eb13-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చిన రోజు ఈ మూవీ లో నితిన్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత రష్మిక కు అనేక ఇతర సినిమా ఆఫర్ లు రావడంతో ఈ సినిమాకు తేదీలను అడ్జస్ట్ చేయలేక పోయింది. దానితో ఈ సినిమా నుండి చివరకు ఈ బ్యూటీ సైడnithin{#}Kumaar;rashmika mandanna;sree;Bike;Venky Kudumula;December;Posters;BEAUTY;Yuva;Heroine;Hero;Cinemaనితిన్ "రాబిన్ హుడ్" విడుదల తేదీ వచ్చేసింది..!నితిన్ "రాబిన్ హుడ్" విడుదల తేదీ వచ్చేసింది..!nithin{#}Kumaar;rashmika mandanna;sree;Bike;Venky Kudumula;December;Posters;BEAUTY;Yuva;Heroine;Hero;CinemaWed, 17 Apr 2024 12:23:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చిన రోజు ఈ మూవీ లో నితిన్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. 

ఆ తర్వాత రష్మిక కు అనేక ఇతర సినిమా ఆఫర్ లు రావడంతో ఈ సినిమాకు తేదీలను అడ్జస్ట్ చేయలేక పోయింది. దానితో ఈ సినిమా నుండి చివరకు ఈ బ్యూటీ సైడ్ అయ్యింది. దానితో ఈ మూవీ బృందం వారు రష్మిక స్థానంలో శ్రీ లీల ను ఈ మూవీ లో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మూవీ యూనిట్ శ్రీ లీల పై ఈ సినిమాకు సంబంధించిన చాలా సన్నివేశాలను కూడా ఇప్పటికే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా నుండి ఓ వీడియోని విడుదల చేశారు. అది అద్భుతమైన రీతిలో ఉండడంతో ఒక్క సారిగా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో నితిన్ అవుట్ అండ్ అవుట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న క్యాప్ ను పెట్టుకొని స్టైలిష్ లుక్ లో బైక్ పై కూర్చుని ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>