MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajakar32226ecd-c85d-42b7-bc58-b9ce7708ac8f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajakar32226ecd-c85d-42b7-bc58-b9ce7708ac8f-415x250-IndiaHerald.jpgకొన్ని రోజుల క్రితమే తెలుగులో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేయలేక పోయినప్పటికీ విమర్శకుల నుండి మంచి ప్రశంశలు పొందిన సినిమాగా నిలిచింది రజాకార్. ఈ సినిమా తెలంగాణ ప్రాంతంలో జరిగిన కొన్ని పోరాటాలను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించారు. ఇకపోతే ఇందులోని కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి అని ... ఆ సన్నివేశాలకు కంటినిండా నీళ్లు తిరిగాయి అని అనేక మంది జనాలు కూడా చెప్పుకొచ్చారు. అలా కొంత మంది ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలను అందుకున్న ఈ సినిమాని మరికొన్ని రోజుల్లోనrajakar{#}anasuya bharadwaj;vedhika;Gudur;Hindi;Box office;Bobby;Telugu;Reddy;Cinema;Musicహిందీ తో పాటు చాలా భాషల్లో రిలీజ్ కి రెడీ అయిన "రజాకార్"..!హిందీ తో పాటు చాలా భాషల్లో రిలీజ్ కి రెడీ అయిన "రజాకార్"..!rajakar{#}anasuya bharadwaj;vedhika;Gudur;Hindi;Box office;Bobby;Telugu;Reddy;Cinema;MusicWed, 17 Apr 2024 14:20:10 GMTకొన్ని రోజుల క్రితమే తెలుగులో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేయలేక పోయినప్పటికీ విమర్శకుల నుండి మంచి ప్రశంశలు పొందిన సినిమాగా నిలిచింది రజాకార్. ఈ సినిమా తెలంగాణ ప్రాంతంలో జరిగిన కొన్ని పోరాటాలను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించారు. ఇకపోతే ఇందులోని కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి అని ... ఆ సన్నివేశాలకు కంటినిండా నీళ్లు తిరిగాయి అని అనేక మంది జనాలు కూడా చెప్పుకొచ్చారు. 

అలా కొంత మంది ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలను అందుకున్న ఈ సినిమాని మరికొన్ని రోజుల్లోనే హిందీ తో పాటు మరికొన్ని భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుడింది. ఈ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమాని హిందీ , మరాఠీ సహా మన దక్షిణాది భాషల్లో కూడా ఈ ఏప్రిల్ 26 న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. 

ఇక ఈ చిత్రాన్ని పనోరమా స్టూడియోస్ వారు నేషనల్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మరి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మాణం వహించారు. బాబీ సింహా , వేదిక , అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. మరి ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన ఈ సినిమా ఇతర భాష ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే ఏప్రిల్ 26 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే . ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించిన బాబీ సింహా , వేదిక , అనసూయ భరద్వాజ్ నటనలకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>