PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan177ede73-5518-4be7-b263-8b6f9bf63e3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan177ede73-5518-4be7-b263-8b6f9bf63e3b-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే నెల్లూరు వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ను మార్చాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. సర్వేలలో ఖలీల్ కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. నెల్లూరు టీడీపీ అభ్యర్థిగా నారాయణ పోటీ చేస్తుండటంతో ఆయనను ఎదుర్కోవడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ys jagan{#}ahmed;Adala Prabhakara Reddy;local language;Reddy;CM;MLA;Nellore;YCP;Jagan;Party;Chequeఆ నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు దిశగా జగన్.. సర్వేలతో నిర్ణయం మారిందా?ఆ నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు దిశగా జగన్.. సర్వేలతో నిర్ణయం మారిందా?ys jagan{#}ahmed;Adala Prabhakara Reddy;local language;Reddy;CM;MLA;Nellore;YCP;Jagan;Party;ChequeWed, 17 Apr 2024 11:19:00 GMTఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే నెల్లూరు వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ను మార్చాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. సర్వేలలో ఖలీల్ కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. నెల్లూరు టీడీపీ అభ్యర్థిగా నారాయణ పోటీ చేస్తుండటంతో ఆయనను ఎదుర్కోవడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఖలీల్ స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి సమీప బంధువు అయిన ప్రముఖ కాంట్రాక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలని జగన్ ఫిక్స్ అయ్యారని భోగట్టా. నారాయణపై స్థానిక ప్రజల్లో మంచి పేరు ఉన్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థిని మార్చితే మాత్రమే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. వైసీపీ అధికారంలోకి వస్తే ఖలీల్ కు పదవి ఇస్తామనే హామీ ఇచ్చి అభ్యర్థి మార్పు దిశగా అడుగులు వేయాలని జగన్ ఫిక్స్ అయ్యారని భోగట్టా.
 
మరికొన్ని రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయనున్న నేపథ్యంలో మరో రెండు రోజుల్లో నెల్లూరు అభ్యర్థికి సంబంధించి వైసీపీ నుంచి కీలక నిర్ణయం వెలువడనుంది. నారాయణకు ధీటైన అభ్యర్థిని నిలబెడితే మాత్రమే వైసీపీకి విజయావకాశాలు పెరుగుతాయని ఆ పార్టీ నేతలు ఫీలవుతున్నారు. వైసీపీపై వ్యతిరేకత ఉన్న స్థానాలపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం.
 
వైసీపీ గెలుపు కోసం రాబోయే రోజుల్లో సరికొత్త స్కీమ్స్ ను ప్రకటించే దిశగా జగన్ అడుగులు వేయనున్నారని ఆ పథకాలు ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గించడంతో పాటు మధ్యతరగతి వర్గాల ప్రజలకు మరింత మేలు చేసేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది. కూటమి మేనిఫెస్టోలో ఎలాంటి హామీలకు పెద్ద పీట వేస్తారో చూడాలి. జగన్ రాబోయే రోజుల్లో మరిన్ని వ్యూహాలతో కూటమికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేయనున్నారని తెలుస్తోంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>