PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababuf2b9b0ca-c275-414e-91cb-a5a67f9dc23b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababuf2b9b0ca-c275-414e-91cb-a5a67f9dc23b-415x250-IndiaHerald.jpg2024 ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్న రాష్ట్ర ప్రజలను సైతం ఒకింత గందరగోళానికి గురి చేస్తోంది. తాజాగా ఆత్మసాక్షి మరోసారి సర్వే చేసి వెల్లడించిన ఫలితాలలో వైసీపీ 97 స్థానాలలో విజయం సాధిస్తుందని కూటమికి 54 స్థానాలలో అనుకూల ఫలితాలుchandrababu{#}bhavana;Survey;Jagan;CBN;YCP;TDP;Partyబాబు భయమే జగన్ కు శ్రీరామరక్ష.. మొండితనంతో ముందుకెళ్తున్నాడుగా!బాబు భయమే జగన్ కు శ్రీరామరక్ష.. మొండితనంతో ముందుకెళ్తున్నాడుగా!chandrababu{#}bhavana;Survey;Jagan;CBN;YCP;TDP;PartyWed, 17 Apr 2024 09:35:00 GMT2024 ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్న రాష్ట్ర ప్రజలను సైతం ఒకింత గందరగోళానికి గురి చేస్తోంది. తాజాగా ఆత్మసాక్షి మరోసారి సర్వే చేసి వెల్లడించిన ఫలితాలలో వైసీపీ 97 స్థానాలలో విజయం సాధిస్తుందని కూటమికి 54 స్థానాలలో అనుకూల ఫలితాలు వస్తాయని మిగిలిన 24 స్థానాలలో పోటాపోటీ ఉంటుందని తేలింది. ఆ 24 స్థానాలలో కేవలం 8 స్థానాల్లో మాత్రమే కూటమికి ఎడ్జ్ ఉందని వెల్లడైంది.
 
మరోవైపు ఏబీపీ సీ ఓటర్ సర్వేలో మాత్రం 130+ ప్లస్ స్థానాలతో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని వైసీపీ ఈ ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి బాబు భయమే జగన్ కు శ్రీరామరక్ష అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ సభల్లో బాబు మాట్లాడుతున్న సమయంలో ఆయన మాటల్లో భయం స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం.
 
ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాకపోతే టీడీపీ పరిస్థితి ఏంటని ఆయన కంగారు పడుతున్నారు. మూడు పార్టీలతో పొత్తు పెట్టుకుని కూడా ఓటమిపాలైతే ప్రజల్లో చులకన అవుతామనే భావన కూడా ఆయనలో ఉంది. బాబు తెలివితేటలతో కూటమి అధికారంలోకి వస్తుందని భావించిన టీడీపీ నేతలు సైతం ఇప్పుడు బాబు పాచికలు పారడం లేదని అభిప్రాయపడుతున్నారు.
 
బీజేపీతో పొత్తు టీడీపీకి కొంత డ్యామేజ్ చేస్తే అభ్యర్థుల ప్రకటనలో చేసిన పొరపాట్లు పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం చేకూర్చాయి. చాలా ఏరియాలలో ఇంఛార్జ్ లకు బదులుగా తోచిన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి బాబు తప్పు చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి ఓటమిపాలైతే బాబు వల్లే ఓడిపోయామని టీడీపీ నేతలు బాబును టార్గెట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జగన్ మాత్రం కొన్ని నెలల క్రితమే కొత్త అభ్యర్థులను ప్రకటించి మెజారిటీ స్థానాలలో సిట్టింగ్ లకు టికెట్లు కేటాయించి చిన్నచిన్న సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు.
 
2024 ఎన్నికల్లో ఓడినా గెలిచినా పరవాలేదని భావిస్తూ అనుకున్న ప్రణాళిక ప్రకారం జగన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఐదేళ్ల పాలన విషయంలో మహిళలు, పేద నిరుపేద ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని జగన్ బావిస్తున్నారు. మొండిగా ముందుకు వెళ్తున్న జగన్ 120 స్థానాలలో వైసీపీ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. బాబు మాత్రం వైసీపీని ఎలా ఓడించాలో అర్థం కాక జగన్ పాలనపై తరచూ విమర్శలు చేస్తూ ఇష్టానుసారం కొత్త హామీలను ప్రకటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ పార్టీ రాష్ట్రంలో అధికారం సాధిస్తుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>