PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababu-politics-202462763dc2-0d3b-4e59-9938-e8962fb22a51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababu-politics-202462763dc2-0d3b-4e59-9938-e8962fb22a51-415x250-IndiaHerald.jpg•జగన్ లో అదే ధీమా •అన్నీ అనుకూలంగా ఉన్నా భయపడుతున్న బాబూ •చావు రేవు అంటున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు (అమరావతి - ఇండియా హెరాల్డ్) ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది.. మరో 27 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధినేతలలో భయం చుట్టుకుంటోంది. మరోపక్క కొన్ని సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెబుతుంటే.. మరికొన్ని సర్వేలు టీడీపీ కూటమికి పట్టం కడుతున్నాయి.. అయితే సర్వేలు ఎలా ఉన్నా కూడా.. అటు వైసిపి అధినేత జగన్.. ఇటు టిడిపి అధినేత చంద్రబాబులను చూసినప్పుడు.JAGAN;CHANDRABABU;POLITICS 2024{#}Beach;Revanth Reddy;December;KCR;Venkatesh;Telugu Desam Party;Elections;Bharatiya Janata Party;India;Hanu Raghavapudi;Jagan;Andhra Pradesh;CBN;Reddy;CM;Congress;YCP;TDPబాబూనే వణికిస్తున్న జగన్ ధీమా.. ఎందుకంత కాన్ఫిడెంట్..?బాబూనే వణికిస్తున్న జగన్ ధీమా.. ఎందుకంత కాన్ఫిడెంట్..?JAGAN;CHANDRABABU;POLITICS 2024{#}Beach;Revanth Reddy;December;KCR;Venkatesh;Telugu Desam Party;Elections;Bharatiya Janata Party;India;Hanu Raghavapudi;Jagan;Andhra Pradesh;CBN;Reddy;CM;Congress;YCP;TDPWed, 17 Apr 2024 09:10:48 GMT•జగన్ లో అదే ధీమా
•అన్నీ అనుకూలంగా ఉన్నా భయపడుతున్న బాబూ
•చావు రేవు అంటున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు


(అమరావతి - ఇండియా హెరాల్డ్)

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది.. మరో 27 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధినేతలలో భయం చుట్టుకుంటోంది. మరోపక్క కొన్ని సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెబుతుంటే.. మరికొన్ని సర్వేలు టీడీపీ కూటమికి పట్టం కడుతున్నాయి.. అయితే సర్వేలు ఎలా ఉన్నా కూడా.. అటు వైసిపి అధినేత జగన్.. ఇటు టిడిపి అధినేత చంద్రబాబులను చూసినప్పుడు.. జగన్ లో ఎక్కడలేని ధీమా కనిపిస్తే.. బాబూలో మాత్రం భయం కనిపిస్తోంది.. అయితే చంద్రబాబులో భయానికి... జగన్ లో ధీమాకి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నిజానికి చంద్రబాబు సేఫ్ జోన్ లోనే ఉన్నారు ఎందుకంటే 2019 ఎన్నికలలో జరిగిన తప్పులను ఇప్పుడు ఆయన సరిదిద్దుకుంటూ.. బీజేపీ తో పొత్తు పెట్టుకుని.. అలాగే గతంలో తమ ఓట్లకు చిల్లు పడిన జనసేనతో కూడా పొత్తు పెట్టుకుని ..ఇప్పుడు తమకు అనుకూలం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. పటిష్టంగానే కూటమి ముందుకు సాగుతోంది.. ముఖ్యంగా వైసిపికి వ్యతిరేకంగా ఉండే ఓట్లు నూటికి 90% పైగా కూటమికి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.. పైగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లేదా చంద్రబాబు ఆయన కాకపోతే ఈయన అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది.. ఈ ఇద్దరిలో పోరు రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు జగన్ , చంద్రబాబు.

మరొకవైపు బలంగా కూటమి కట్టిన టీడీపీ కి ఎంతో కొంత ఎడ్జ్ ఉండే ఛాన్స్ ఉందని.. దీనిని కొట్టి పారేయలేమని కూడా చెబుతున్నారు...మరికొంతమంది పాజిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా చంద్రబాబు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనే చర్చ కూడా మొదలయ్యింది. ఉదాహరణకి తెలంగాణలో దాదాపు 10 సంవత్సరాల పాటు కనుమేర చూపులో కూడా కనిపించని కాంగ్రెస్.. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.. దీనికి కారణం ప్రజలలో రేవంత్ రెడ్డి నింపిన పాజిటివ్ వైబ్స్ అని చెప్పవచ్చు.. ఆయన కొద్ది నెలల ముందు జరిగిన ఎన్నికల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపించారు.. అంతేకాదు కేసీఆర్ తొందరలోనే మాజీ సీఎం కాబోతున్నారు అని ప్రతి సభలో చెబుతూ.. డిసెంబర్ 9వ తేదీన తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని కూడా చెప్తూ వచ్చారు. అలా నెల రోజుల ముందు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని జనంలో పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడం ఆయనకు బాగా కలిసొచ్చింది.. కానీ చంద్రబాబు మాత్రం అలా గట్టిగా తాను సీఎం అవుతానని మాత్రం చెప్పలేకపోతున్నారు.. దీంతో సీఎం అవుతానని ఆయనే ధైర్యంగా లేనప్పుడు ఇక ప్రజలలో ఎలా నమ్మకం వస్తుంది అంటూ వైసీపీ ఓటర్సు కామెంట్లు చేస్తున్నారు..

ఇక మరొకవైపు జగన్ ఎందుకు ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు అంటే కొడితే బంపర్ విక్టరీ అవుతుంది. లేకపోతే విపక్షం అయినా సరే నో ప్రాబ్లం అన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నారు.. ప్రస్తుతం జగన్ వయసు 52 ఏళ్లు మాత్రమే.. మరో ఎన్నికకు అంటే 57 సంవత్సరాలొస్తాయి... ఇప్పటినుంచి మరో రెండు దశాబ్దాల పాటు ఆయన రాజకీయం చేసే సత్తా కలిగి ఉన్నారు ..దాంతో ఆయన సర్వేలను సైతం పక్కనపెట్టి ధీమాగా ముందుకు సాగుతున్నారు.. ముఖ్యంగా జగన్ ఎక్కడా కూడా తన ముఖ కవళికలలో మార్పు లేకుండా చూసుకుంటున్నారు.. ముఖంలో చిరునవ్వుతో ముందుకు వెళుతూ వైసిపికి పాజిటివిటీ ను తీసుకొస్తున్నారు .  ఒకవేళ వైసీపీకి ఓట్లు తగ్గినా, సీట్లు తగ్గినా జగన్ ధీమా చూసినవారు మనసు మార్చుకొని వచ్చేది వైసీపే అని ఆవైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది..అలా జగన్ వ్యూహాత్మకంగా నడుచుకుంటుంటే చంద్రబాబు మాత్రం సభలలో ఆందోళనగా కనిపిస్తూ ఓటర్లలో నెగెటివిటీని క్రియేట్ చేస్తున్నారు.. ఇందుకు ప్రధాన కారణం ఆయనకు దాదాపుగా ఇవే చివరి ఎన్నికలు.. ఎన్నికల్లో సర్వేలు ఎన్ని అనుకూలంగా చెప్పినా.. జనాలు ఓట్లు వేసి గెలిపించే అంతవరకు అసలు ఫలితం తెలియదు.. ఒకవేళ టిడిపి ఓడితే..  భవిష్యత్తు ఏమిటి? అనే ఆందోళన ఆయనలో ఎక్కువగా కనిపిస్తోంది.. అందుకే అంత ధీమాగా బయటకు కనిపించలేకపోతున్నారు...  మొత్తానికైతే వీరిద్దరిని చూసినప్పుడు జగన్ లో కనిపిస్తున్న గెలుపు ధీమా.. బాబులో ఆందోళనను క్రియేట్ చేస్తోంది.ఒకవేళ బాబు ఆందోళనే నిజమైతే ఇక టిడిపి మళ్లీ తమ అధికారాన్ని నిలబెట్టుకోలేదని చెప్పడంలో సందేహం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>