MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/devara--jr-ntr-0a0121c2-08e3-434f-83cf-a68461e927af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/devara--jr-ntr-0a0121c2-08e3-434f-83cf-a68461e927af-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దారుణమైన డిజాస్టర్ అందుకున్న ఆచార్య దర్శకుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. నిజంగా ఇది డేరింగ్ డెసిషన్ అనే చెప్పాలి. అయితే దేవర బిజినెస్ వ్యవహారాలు ఎలా కొనసాగుతున్నాయనే విషయంలో చాలా రోజులుగా చాలా రకాల గాసిప్స్ అయితే వైరల్ గా మారుతున్నాయి.నిర్మాత కళ్యాణ్ రామ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా బిజినెస్ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే నిజంగా దేవర సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ డీల్స్ సెట్ చేసుకుందా లేDevara - Jr NTR {#}Saif Ali Khan;kalyan ram;koratala siva;vijay kumar naidu;Karan Johar;Jr NTR;Darsakudu;Chiranjeevi;Cinema;India;raj;Director;bollywood;Hindi;Newsపుష్ప, కల్కి కంటే వెనకబడ్డ దేవర..?పుష్ప, కల్కి కంటే వెనకబడ్డ దేవర..?Devara - Jr NTR {#}Saif Ali Khan;kalyan ram;koratala siva;vijay kumar naidu;Karan Johar;Jr NTR;Darsakudu;Chiranjeevi;Cinema;India;raj;Director;bollywood;Hindi;NewsTue, 16 Apr 2024 17:30:06 GMTపాన్ ఇండియా హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  దారుణమైన డిజాస్టర్ అందుకున్న ఆచార్య దర్శకుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. నిజంగా ఇది డేరింగ్ డెసిషన్ అనే చెప్పాలి. అయితే  దేవర బిజినెస్ వ్యవహారాలు ఎలా కొనసాగుతున్నాయనే విషయంలో చాలా రోజులుగా చాలా రకాల గాసిప్స్ అయితే వైరల్ గా మారుతున్నాయి.నిర్మాత కళ్యాణ్ రామ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా బిజినెస్ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే నిజంగా దేవర సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ డీల్స్ సెట్ చేసుకుందా లేదా అనే విషయంలో మాత్రం ఊహించని సందేహాలు ఇంకా కలుగుతున్నాయి. ప్రస్తుతం మిగతా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు ఉన్నంత డీల్స్ కూడా దేవర సినిమాకు సెట్ కావడం లేదని సమాచారం తెలుస్తోంది.అందుకు కొరటాల శివ ఒక ప్రధాన కారణం. మెగాస్టార్ చిరంజీవి తో కొరటాల శివ చేసిన ఆచార్య సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యి చాలా దారుణమైన నష్టాలను కలిగించింది. ఆర్థికంగా కూడా ఈ సినిమా వల్ల కొరటాల శివ చాలా ఇబ్బందులు పడ్డాడు. అందుకే ఆయన దేవర సినిమా బిజినెస్ వ్యవహారాలలో అసలు ఏమాత్రం తలదూర్చడం లేదు.


ఇక దేవర సినిమా బిజినెస్ డీల్స్ పుష్ప 2- కల్కి సినిమాల కంటే కూడా చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది.అలాగే సినిమాకు అనుకున్నంత స్థాయిలో ఇప్పటి దాకా మంచి పాజిటివ్ బజ్ ఇచ్చే విధంగా అప్డేట్స్  రాలేదు. ఇక ఆ మధ్య వచ్చిన టీజర్ కూడా ఎక్కువ రోజులు హడావిడి చేయలేకపోయింది. ఇక పోస్టర్స్ కూడా అంతగా వైరల్ అవ్వలేదు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఉన్నప్పటికీ బాలీవుడ్లో కూడా ఈ సినిమా పెద్దగా సౌండ్ ని క్రియేట్ చేయలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ సినిమా కంటెంట్ తో కూడా ఎంతో కొంత బజ్ క్రియేట్ చేస్తేనే బిజినెస్ లో ఖచ్చితంగా టేబుల్ ప్రాఫిట్స్ అందుకునే అవకాశం ఉంటుంది. కరణ్ జోహార్ ను లైన్ లోకి తీసుకురావడం హిందీ మార్కెట్లో బాగా కలిసొచ్చే అంశమే.కానీ బిజినెస్ డీల్స్ అయితే పుష్ప రాజ్ ప్రభాస్ కల్కిల కంటే కూడా తక్కువ స్థాయిలోనే ఉన్నట్లుగా ఇండస్ట్రీలో సమాచారం వినిపిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>