PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-tdp-sriram-sunithama-varadapuram-suri-2024-politicse9b9db92-dfb5-4e44-9ebf-f248d3455f7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-tdp-sriram-sunithama-varadapuram-suri-2024-politicse9b9db92-dfb5-4e44-9ebf-f248d3455f7c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో బిజెపి ,టిడిపి , జనసేన పార్టీ పొత్తులో భాగంగా సీట్లను కూడా ప్రకటించడం జరిగింది. పొత్తులు పెట్టుకొని ఓట్లు బదిలీ జరుగుతుందని చంద్రబాబు భావించి పన్నాగాలు వేస్తున్నప్పటికీ పొత్తుల వలన పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు అసంతృప్తులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నారు. అనేక నియోజకవర్గాలలో కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తులు కనిపిస్తూనే ఉన్నాయి. ఎంతోమందిని చంద్రబాబు పిలిచి మాట్లాడి అంతా సెట్ చేసినట్టు అనిపించుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు మరో విధంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకిRAYALASIMA;TDP;SRIRAM;SUNITHAMA;VARADAPURAM SURI;2024 POLITICS{#}satya;soori;Dharmavaram;paritala ravindra;Raptadu;Paritala Sunitha;District;Janasena;Bharatiya Janata Party;sriram;News;Party;Telugu Desam Party;CBN;TDPరాయలసీమ: టిడిపి నేతే కూటమికి చేటు చేస్తున్నారా..?రాయలసీమ: టిడిపి నేతే కూటమికి చేటు చేస్తున్నారా..?RAYALASIMA;TDP;SRIRAM;SUNITHAMA;VARADAPURAM SURI;2024 POLITICS{#}satya;soori;Dharmavaram;paritala ravindra;Raptadu;Paritala Sunitha;District;Janasena;Bharatiya Janata Party;sriram;News;Party;Telugu Desam Party;CBN;TDPTue, 16 Apr 2024 08:48:51 GMTఆంధ్రప్రదేశ్లో బిజెపి ,టిడిపి , జనసేన పార్టీ పొత్తులో భాగంగా సీట్లను కూడా ప్రకటించడం జరిగింది. పొత్తులు పెట్టుకొని ఓట్లు బదిలీ జరుగుతుందని చంద్రబాబు భావించి పన్నాగాలు వేస్తున్నప్పటికీ పొత్తుల వలన పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు అసంతృప్తులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నారు. అనేక నియోజకవర్గాలలో కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తులు కనిపిస్తూనే ఉన్నాయి. ఎంతోమందిని చంద్రబాబు పిలిచి మాట్లాడి అంతా సెట్ చేసినట్టు అనిపించుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు మరో విధంగా కనిపిస్తున్నాయి.


ప్రత్యేకించి టిడిపి నాయకులు చేసే పనుల వల్ల కూటమి పార్టీలు ఓడిపోయే పరిస్థితి కనిపిస్తున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.. అనంతపూర్ జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలో తెలుగుదేశం నేతలు అసంతృప్తిని ఎక్కువగా తెలియజేస్తున్నారు.. దీంతో అసంతృప్తి నేతలకు కనీసం రెండు మూడు నియోజకవర్గాలలో కూటమిలోని పార్టీకి దెబ్బ పడేలా కనిపిస్తోంది. ధర్మవరం నియోజకవర్గంలో పొత్తులో భాగంగా బిజెపి పార్టీ సత్య కుమార్ కి సీటు ఇక్కడ కేటాయించారు. ఈ సీటు వాస్తవానికి పరిటాల శ్రీరామ్ ఆశించినప్పటికీ తనకు దక్కకపోయినప్పటికీ సత్యకుమార్ కు అనుకూలంగానే ప్రచారం చేస్తున్నారు. ఇలా ఎంతో గట్టిగా ప్రచారం చేస్తున్నప్పటికీ అక్కడ సత్య గెలుపు మాత్రం చాలా సందేహంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అలాగే శ్రీరామ్ తో పాటు వరదాపురం సూరి కూడా టిడిపి టికెట్ ను  ఆశించారు కానీ వీరిద్దరి మధ్య వైరం ఉండడంతో మధ్యలో బీజేపీ కి ఈ సీటు వెళ్లిపోయింది. దీంతో సత్య కుమార్ ఓటమికి వరదాపురం సూరి పావులు కదుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటితోపాటు పరిటాల సునీత పోటీ చేస్తున్నటువంటి రాప్తాడు నియోజకవర్గంలో కూడా తెర వెనుక ఆమె ఓటమికి చాలామంది సహాయం చేస్తున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ధర్మవరం టికెట్టు తనకు రాకుండా చేసిన పరిటాల కుటుంబాన్ని అసలు శాసనసభలో అడుగు పెట్టకుండా చేసేలా వరదాపురం సూరి పక్కా ప్రణాళికలతోనే పట్టుదలతో ఉన్నారనే వాదన కూడా వినిపిస్తోంది.ఒకవేళ ఈ వరదాపురం సూరి దెబ్బ పడితే ధర్మవరం,  రాప్తాడు రెండు నియోజకవర్గాలలో కూటమి పార్టీ ఓడిపోతుందని ప్రజలు తెలుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>