PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balakrishnaaad6bae7-6156-4d77-ad1e-1eec4a708efc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balakrishnaaad6bae7-6156-4d77-ad1e-1eec4a708efc-415x250-IndiaHerald.jpgస్టార్ హీరో నందమూరి బాలకృష్ణ టీడీపీ గెలుపు కోసం ఎంతో కష్టపడుతున్నారనే సంగతి తెలిసిందే. పార్టీకి మేలు జరగాలనే ఆలోచనతో తనకు ఏ మాత్రం సంబంధం లేని నియోజకవర్గాల్లో సైతం బాలయ్య ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ కూటమికి బెనిఫిట్ కలిగించడానికి ఉండే ఏ అవకాశాన్ని బాలయ్య వదులుకోవడం లేదు. అయితే ఆ రెండు పత్రికలు మాత్రం బాలయ్య స్పీచ్ లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు.balakrishna{#}Hindupuram;Balakrishna;Jr NTR;TDP;Heroబాలయ్యకు ఘోర అవమానం.. ఆ పత్రికల్లో అస్సలు ప్రాధాన్యత ఇవ్వట్లేదా?బాలయ్యకు ఘోర అవమానం.. ఆ పత్రికల్లో అస్సలు ప్రాధాన్యత ఇవ్వట్లేదా?balakrishna{#}Hindupuram;Balakrishna;Jr NTR;TDP;HeroTue, 16 Apr 2024 22:35:00 GMTస్టార్ హీరో నందమూరి బాలకృష్ణ టీడీపీ గెలుపు కోసం ఎంతో కష్టపడుతున్నారనే సంగతి తెలిసిందే. పార్టీకి మేలు జరగాలనే ఆలోచనతో తనకు ఏ మాత్రం సంబంధం లేని నియోజకవర్గాల్లో సైతం బాలయ్య ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ కూటమికి బెనిఫిట్ కలిగించడానికి ఉండే ఏ అవకాశాన్ని బాలయ్య వదులుకోవడం లేదు. అయితే ఆ రెండు పత్రికలు మాత్రం బాలయ్య స్పీచ్ లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
 
బాలయ్య బాబు కష్టాన్ని ఆ రెండు పత్రికలు ఎందుకు గుర్తించడం లేదో అర్థం కావడం లేదని బాలయ్య ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ గెలవాలంటే బాలయ్య సపోర్ట్ కూడా ఎంతో అవసరమని చెప్పవచ్చు. ప్రచారానికి తగిన ప్రాధాన్యత కల్పించని పక్షంలో బాలయ్య సైతం ఫీలయ్యే అవకాశం ఉంది. సొంత పత్రికలోనే బాలయ్యను అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఇప్పటికే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ విషయంలో నెగిటివ్ ఒపీనియన్ ను కలిగి ఉన్నారు. బాలయ్య ఫ్యాన్స్ టీడీపీ గెలుపు కోసం అహర్నిషలు శ్రమిస్తున్నారు. బాలయ్యకు పార్టీలో ప్రాధాన్యత ఉన్నంత వరకే ఫ్యాన్స్ నుంచి సైతం పూర్తిస్థాయిలో సపోర్ట్ ఉంటుంది. అవసరం ఉన్న సమయంలో మాత్రమే బాలయ్యకు ప్రాధాన్యత ఇస్తే మాత్రం టీడీపీకే మైనస్ అవుతుందని చెప్పవచ్చు.
 
హిందూపూర్ లో మాత్రం బాలయ్యకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. వైసీపీతో పోల్చి చూస్తే టీడీపీ 12 నుంచి 15 శాతం ఓట్ల మెజారిటీతో బాలయ్య విజయం సాధిస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 53 శాతం ఓటర్లు టీడీపీ కూటమికి అనుకూలంగా ఉండగా 38 శాతం ఓటర్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఎటూ తేల్చుకోలేని ఓటర్లు 9 శాతం మంది ఉన్నారని సమాచారం. హిందూపురం టీడీపీకి కంచుకోట అని మరోసారి ప్రూవ్ కానుందని తెలుస్తోంది.
 
 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>