MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg ధియేటర్లలో విడుదలయ్యే సినిమాలలో ఏసినిమా హిట్ అవుతుందో మరే సినిమా ఫ్లాప్ అవుతుందో తెలియని పరిస్థితి. ఇండస్ట్రీని షేక్ చేస్తున్నట్లుగానే ఓటీటీ లో స్ట్రీమ్ అయ్యే ఏసినిమా హిట్ అవుతుందో మరే సినిమా ఫ్లాప్ అవుతుందో తెలియని పరిస్థితులలో ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడ ఉండటంతో సినిమాలను కొనే విషయంలో ఆసంస్థలు కూడ విపరీతంగా కన్ఫ్యూజ్ అవుతున్నాయి. సంక్రాంతి రేస్ కు విడుదలైన ‘గుంటూరు కారం’ ధియేటర్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవడంతో ఆమూవీ ఆశించిన స్థాయిలో కలక్షన్స్ వసూలు చేయలేకపోయింది. అయితే అదే సినిమా ఓటీటీ లో MAHESH{#}trivikram srinivas;Makar Sakranti;Audience;Viswak sen;SreeVishnu;Telugu;Cinema;Newsఓటీటీ సంస్థలను కన్ఫ్యూజ్ చేస్తున్న ప్రేక్షకుల అభిరుచులు !ఓటీటీ సంస్థలను కన్ఫ్యూజ్ చేస్తున్న ప్రేక్షకుల అభిరుచులు !MAHESH{#}trivikram srinivas;Makar Sakranti;Audience;Viswak sen;SreeVishnu;Telugu;Cinema;NewsTue, 16 Apr 2024 08:00:00 GMT
ధియేటర్లలో విడుదలయ్యే సినిమాలలో ఏసినిమా హిట్ అవుతుందో మరే సినిమా ఫ్లాప్ అవుతుందో తెలియని పరిస్థితి. ఇండస్ట్రీని షేక్ చేస్తున్నట్లుగానే ఓటీటీ లో స్ట్రీమ్ అయ్యే ఏసినిమా హిట్ అవుతుందో మరే సినిమా ఫ్లాప్ అవుతుందో తెలియని పరిస్థితులలో ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడ ఉండటంతో సినిమాలను కొనే విషయంలో ఆసంస్థలు కూడ విపరీతంగా కన్ఫ్యూజ్ అవుతున్నాయి.



సంక్రాంతి రేస్ కు విడుదలైన ‘గుంటూరు కారం’ ధియేటర్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవడంతో ఆమూవీ ఆశించిన స్థాయిలో కలక్షన్స్ వసూలు చేయలేకపోయింది. అయితే అదే సినిమా ఓటీటీ లో స్ట్రీమ్ అయినప్పుడు ఓటీటీ ప్రేక్షకులు విపరీతంగా చూడటంతో ఆసినిమాకు ఓటీటీ లో రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ వచ్చింది. త్రివిక్రమ్ పై సెటైర్లు వేసిన ధియేటర్ ప్రేక్షకులు అదే త్రివిక్రమ్ ను ఆకాశంలోకి ఓటీటీ ప్రేక్షకులు ఎత్తేశారు.



గతవారం ఓటీటీలో అనేక హిట్ సినిమాలు స్ట్రీమ్ అయ్యాయి. అందులో మళయాళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడ బాగా నచ్చిన ‘ప్రేమలు’ మూవీ కూడ ఉంది’ డబ్బింగ్ సినిమాగా విడుదలైన ఈసినిమాకు ఏకంగా 17 కోట్ల కలక్షన్స్ వచ్చాయి అని అంటారు. ఇప్పుడు ఈ మూవీని ఆహా సంస్థ తమ ఓటీటీ లో స్ట్రీమ్ చేసినప్పుడు ఆసినిమాను చూసి చాలామంది ఓటీటీ ప్రేక్షకులు ఈసినిమాలో అంతగా ఏముంది అంటూ కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



అదేవిధంగా జీ5 లో స్ట్రీమ్ అవుతున్న విశ్వక్ సేన్ ‘గామి’ మూవీకి పెద్దగా ఓటీటీ ప్రేక్షకుల నుండి స్పందన రావడంలేదు అని వార్తలు వస్తున్నాయి. ఇదే సినిమా ధియేటర్లలో విడుదలైనప్పుడు ఈసినిమాను ఆకాశానికి ఎత్తెస్తూ ప్రశంసలు వచ్చాయి. అదేవిధంగా శ్రీవిష్ణు నటించిన  మూవీ ‘ఓం భీం బుష్’ కూడ ఓటీటీ ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఈసినిమాను చూస్తూ ఫార్వార్డ్ చేయకుండా చూడలేకపోయామని కొందరు ఓపెన్ గానే కామెంట్స్ చేయడం ఆశ్చర్యంగా మారింది. దీనితో ధియేటర్ ప్రేక్షకుల అభిరుచి వేరు ఓటీటీ ప్రేక్షకుల అభిరుచి వేరు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయ అన్న అభిప్రాయం కలుగుతోంది..










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>