TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/nati-divyaka-tripati-comments-casting-coutchc249f133-e8f7-4532-85ab-f52da259e429-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/nati-divyaka-tripati-comments-casting-coutchc249f133-e8f7-4532-85ab-f52da259e429-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా మంది హీరోయిన్స్ పలువురు సెలబ్రిటీలు కూడా పలు రకాల ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అవకాశాల పేరిట తమను లైంగికంగా వేధించారంటూ ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కూడా ధైర్యంగా ఎన్నో ఇంటర్వ్యూలలో తెలియజేశారు. ఇప్పుడు తాజాగా సీరియల్ నటి అయినటువంటి దివ్యాంకా త్రిపాఠి దాహిమా కూడా క్యాస్టింగ్ కౌచ్ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్యాంక తనకు ఇండస్ట్రీలో NATI;DIVYAKA TRIPATI;COMMENTS.CASTING COUTCH{#}Heroine;Directorటీవీ: డైరెక్టర్ తో రాత్రి గడిపితే.. ఆఫర్.. సీరియల్ నటి హాట్ కామెంట్స్..!!టీవీ: డైరెక్టర్ తో రాత్రి గడిపితే.. ఆఫర్.. సీరియల్ నటి హాట్ కామెంట్స్..!!NATI;DIVYAKA TRIPATI;COMMENTS.CASTING COUTCH{#}Heroine;DirectorTue, 16 Apr 2024 02:00:00 GMT ఇండస్ట్రీలో ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా మంది హీరోయిన్స్ పలువురు సెలబ్రిటీలు కూడా పలు రకాల ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అవకాశాల పేరిట తమను లైంగికంగా వేధించారంటూ ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కూడా ధైర్యంగా ఎన్నో ఇంటర్వ్యూలలో తెలియజేశారు. ఇప్పుడు తాజాగా సీరియల్ నటి అయినటువంటి దివ్యాంకా త్రిపాఠి దాహిమా కూడా క్యాస్టింగ్ కౌచ్ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం.


అసలు విషయంలోకి వెళ్తే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్యాంక తనకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను తెలియజేసింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో ఆఫర్లు లేక చేతిలో ఒక్క రూపాయి కూడా డబ్బులు లేని సమయంలో ఒక అవకాశం వచ్చిందని..అయితే అక్కడికి ఆడిషన్ కి వెళ్ళిన తర్వాత నువ్వు డైరెక్టర్ తో ఒక రాత్రంతా గడిపితే తనకు అవకాశం ఇప్పిస్తానని కూడా ఒక వ్యక్తి చెప్పారట.. ఆ విషయం విని ఒక్కసారిగా తాను షాకే గురయ్యానని తెలియజేసింది దివ్యాంక త్రిపాఠి.


దీంతో అలాంటి వారు ఇండస్ట్రీలో కూడా ఉన్నారనుకున్నాననీ..అందుకే ఆ ఆఫర్ వద్దని అక్కడ నుంచే వచ్చేసాను..కానీ ఇండస్ట్రీలో ఇలాంటి వారికి ఎవరూ లొంగకూడదు మన ప్రతిభను నమ్ముకుంటే కచ్చితంగా అవకాశాలు వస్తాయని తెలియజేసింది. ప్రస్తుతం హిందీలో పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నది. ప్రస్తుతం ఈమె అదృశ్యం అనే ఒక సీరియల్ లో కూడా నటిస్తున్నది. సీరియల్ యాక్టర్లలో  అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటిగా కూడా పేరు సంపాదించింది దివ్యాంక త్రిపాఠి.. ఇలా అవకాశం పేరుతో లైంగిక బెదిరింపులను చేసే వారి కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకువచ్చి వారిని శిక్షించేలా చేయాలని అప్పుడే ఇండస్ట్రీలో ఏదైనా మార్పు వస్తుందంటూ తెలియజేసింది. అంతేకాకుండా ఇలాంటివన్నీ కామన్ అనే వారు కూడా తగ్గిపోతారని తెలియజేసింది. ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ పైన చేసిన సీరియల్ నటి కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>