Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revabrh4dd0a574-44d4-42b4-8628-2b9521f90a58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revabrh4dd0a574-44d4-42b4-8628-2b9521f90a58-415x250-IndiaHerald.jpgపార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇక రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇక ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయింది అన్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంటే.. ఇక కేంద్రంలో అధికారాన్ని చేపట్టేందుకు తెలంగాణ నుంచి కూడా మెజారిటీ అందించాలని అటు బిజెపి భావిస్తోంది. ఇంకోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికRevabrh{#}revanth;Bharatiya Janata Party;Mudiraj;Telangana;Congress;MP;Backward Classes;CM;Parliment;Assembly;Minister;Medak;Reddy;Mahbubnagar;Party;Varshamమంత్రి పదవి ఇస్తా.. బీసీ సెంటిమెంట్ మీద కొట్టిన రేవంత్?మంత్రి పదవి ఇస్తా.. బీసీ సెంటిమెంట్ మీద కొట్టిన రేవంత్?Revabrh{#}revanth;Bharatiya Janata Party;Mudiraj;Telangana;Congress;MP;Backward Classes;CM;Parliment;Assembly;Minister;Medak;Reddy;Mahbubnagar;Party;VarshamTue, 16 Apr 2024 06:41:00 GMTపార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇక రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇక ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయింది అన్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంటే.. ఇక కేంద్రంలో అధికారాన్ని చేపట్టేందుకు తెలంగాణ నుంచి కూడా మెజారిటీ అందించాలని అటు బిజెపి భావిస్తోంది. ఇంకోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో అయిన సత్తా చాటాలని అనుకుంటుంది.


 ఎవరికి వారు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే మిగతా పార్టీలకు షాక్ ఇస్తూ.. హస్తం పార్టీని బలోపేతం చేయడమే కాదు.. ఇక తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే తమ పార్టీ అభ్యర్థులను మెజారిటీ స్థానాలలో గెలిపిస్తే తాము ఏం చేయబోతాము అనే విషయంపై హామీల వర్షం కూడా కురిపిస్తున్నారు. కాగా ఇటీవల నారాయణపేట కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే బీసీ బిడ్డకు మంత్రి పదవి ఇస్తాను అంటూ ఒక హామీ ఇచ్చారు.


 పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ని, ఇక మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బరిలోకి దిగిన నీలం మరో ముదిరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి ఇక వచ్చే ఆగస్టు లోపు ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. తాము బీసీలకు పెద్దపీట వేస్తున్నాము అంటూ చెప్పిన సీఎం రేవంత్.. ఇక ముదిరాజులు అంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి అంటూ కోరారు. ఇలా బీసీ బిడ్డకు మంత్రి పదవి ఇస్తాను అని బీసీ సెంటిమెంట్ మీద కొట్టిన రేవంత్ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకుంటాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>