Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/congresse576c08d-a05e-48f3-801a-dae2b726c2a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/congresse576c08d-a05e-48f3-801a-dae2b726c2a3-415x250-IndiaHerald.jpgగత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కారు పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే ఆయన చేరికతో వ్యవహస్తం పార్టీలో వచ్చిన జోష్ అంతా ఇంతా కాదు. ఇక అన్ని రకాలుగా ఆయన బలమైన నేత కావడంతో.. ఆయన రాక హస్తం పార్టీకి ఎంతో మేలు చేకూరుస్తుంది అని పార్టీ శ్రేణులు కూడా అనుకున్నారు. కానీ ఎంపీ ఎన్నికల్లో మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఒక పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ ను కాంగ్రెస్ కంచుకోటగా పిలుచుకుంటారు. అక్కడ ఇక ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టిన కాంగ్రెCongress{#}prasad;Deputy Chief Minister;Car;Khammam;Karimnagar;Josh;srinivas;Yevaru;Assembly;Hyderabad;MP;Parliment;Success;Congress;Party;News;Ministerసోదరునికి హామీ ఇచ్చి.. కాంగ్రెస్ లో పంతం నెగ్గించుకున్న పొంగులేటి?సోదరునికి హామీ ఇచ్చి.. కాంగ్రెస్ లో పంతం నెగ్గించుకున్న పొంగులేటి?Congress{#}prasad;Deputy Chief Minister;Car;Khammam;Karimnagar;Josh;srinivas;Yevaru;Assembly;Hyderabad;MP;Parliment;Success;Congress;Party;News;MinisterTue, 16 Apr 2024 11:30:00 GMTగత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కారు పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే ఆయన చేరికతో వ్యవహస్తం పార్టీలో వచ్చిన జోష్ అంతా ఇంతా కాదు. ఇక అన్ని రకాలుగా ఆయన బలమైన నేత కావడంతో.. ఆయన రాక హస్తం పార్టీకి ఎంతో మేలు చేకూరుస్తుంది అని పార్టీ శ్రేణులు కూడా అనుకున్నారు. కానీ ఎంపీ ఎన్నికల్లో మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఒక పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ ను కాంగ్రెస్ కంచుకోటగా పిలుచుకుంటారు. అక్కడ ఇక ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టిన కాంగ్రెస్ గెలుపు మాత్రం కన్ఫామ్ అనే పరిస్థితి ఉంది.


 ఇక ప్రత్యర్థి పార్టీలు కూడా ఖమ్మంలో కాంగ్రెస్ ను మించి తమ గెలుపు సాధ్యమవుతుంది అనే ఆశలు కూడా లేని పరిస్థితి. ఈ క్రమంలోనే ఇలా తప్పకుండా గెలిచే సీటులో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పటికే అన్ని స్థానాలలో అభ్యర్థుల వివరాలను ప్రకటించిన కాంగ్రెస్.. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇక్కడ టికెట్ ఆశిస్తున్న వారి లిస్టులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు, ఇక పార్టీ సీనియర్ నేత విహెచ్, మంత్రి తుమ్మల కొడుకు ఉండడంతో ఎవరికి టికెట్ దక్కుతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.



 అయితే ప్రస్తుతం ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఖమ్మం సీటుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే మంత్రి పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించాలని.. ఎంతగానో ప్రయత్నించారు. ఇక ఇప్పుడు ఈ విషయంలో సక్సెస్ అయ్యారట. ప్రసాద్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి ఖమ్మం టికెట్ కన్ఫామ్ అయినట్లు సమాచారం. ఇక మరో పెండింగ్ సీటు అయిన కరీంనగర్ నుంచి అందరూ ఊహించినట్లుగానే వెలిచాల రాజేందర్ రావు కి కేటు కేటాయించారట. అయితే ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు హైదరాబాద్ సీట్ కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంది  ఇక ఇప్పటికే ఇక్కడ నిలబెట్టబోయే కాంగ్రెస్ అభ్యర్థిని కూడా ఫిక్స్ చేశారట. మరో రెండు మూడు రోజుల్లో ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడబోతుంది అన్నది తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>