PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr-criticizes-cong-govt-in-tgana-for-not-keeping-its-wordfe3bebbe-10a4-4f2e-864a-fad4bf1eeb67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr-criticizes-cong-govt-in-tgana-for-not-keeping-its-wordfe3bebbe-10a4-4f2e-864a-fad4bf1eeb67-415x250-IndiaHerald.jpgతాజాగా కెసిఆర్ ... చేవెళ్ల బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ పద్ధతి పై విరుచుకుపడ్డారు. తాజా సభలో ఆయన మాట్లాడుతూ... మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి పుణ్యమా అని ఆర్టికల్ 3 ద్వారా మనమంతా కలిసి తెలంగాణను సాధించుకున్నాం. ఇక అలాంటి గొప్ప వ్యక్తి అయినటువంటి అంబేడ్కర్ గారికి సమున్నత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో 125 అడుగుల విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటివరకు మన దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సచివాలయానికి మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి పేరు పెట్టి ఆయన్ను ఎంతోkcr{#}Doctor;electricity;Manam;Congress;Government;Telangana;Partyకేసిఆర్ : మరోసారి అదే రూట్లో..?కేసిఆర్ : మరోసారి అదే రూట్లో..?kcr{#}Doctor;electricity;Manam;Congress;Government;Telangana;PartyMon, 15 Apr 2024 09:09:14 GMTతాజాగా కెసిఆర్ ... చేవెళ్ల బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ పద్ధతి పై విరుచుకుపడ్డారు. తాజా సభలో ఆయన మాట్లాడుతూ...

మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి పుణ్యమా అని ఆర్టికల్ 3 ద్వారా మనమంతా కలిసి తెలంగాణను సాధించుకున్నాం. ఇక అలాంటి గొప్ప వ్యక్తి అయినటువంటి అంబేడ్కర్ గారికి సమున్నత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో 125 అడుగుల విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటివరకు మన దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సచివాలయానికి మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి పేరు పెట్టి ఆయన్ను ఎంతో గొప్పగా గౌరవించుకున్నాం. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఆదుకునే ప్రభుత్వం మాకు ఉందని ప్రజలకు ధీమా ఉండాలె.

అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంతులేని హామీలు , ప్రలోభాలతో కిందమీద చేస్తే ఆ పార్టీ గెలిచింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలల అయిన సరే ఆ పార్టీకి వారి చిత్తశుద్ది లేదు. వాళ్ళకి ఉన్న వనరులను వాడుకునే తెలివి కూడా ఏ మాత్రం లేదు. ఇంతకాలం పాటు మనం మరచిపోయిన సమస్యలన్ని మళ్లీ మనకి కనబడుతున్నాయి. నేను తెలంగాణ రాష్ట్రం కోసం చావు నోట్లో తలపెట్టాను. అలాగే ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేస్తే  తెలంగాణను వచ్చింది. తెలంగాణ ఏర్పడిన సమయంలో రైతులకు చాలా సమస్యలుండే.

అలాంటి సమయంలో  కోడి రెక్కల కింద తన  పిల్లలను కాపాడుకున్నట్లు రైతాంగాన్ని , రైతులను కాపాడుకున్నాం. అందులో భాగంగా రైతులను కాపాడుకునేందుకు ఒక పాలసీ పెట్టుకున్నాం. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా  రైతాంగానికి  5  పథకాలు చేపట్టాం. అవే రైతుబంధు , నాణ్యమైన విద్యుత్ , రైతు బీమా , పంట కొనుగోలు లాంటి పథకాలతో రైతులకు ధీమా ఇచ్చాం. ఇలా ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకొని ఆ తర్వాత కూడా ప్రజల కోసం, రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చి తెలంగాణ ప్రజలను అభివృద్ధి వైపు తీసుకువెళ్లం అని కెసిఆర్ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>